Home /News /international /

JAPANESE COMPANY ANNOUNCES SIX DAYS EXTRA LEAVES PER YEAR FOR NON SMOKING EMPLOYEES HERE IS INTERESTING NEWS SK

No Smoking: ఆఫీసులో ఇలాంటి ఆఫర్లు కూడా ఉంటాయా? స్పెషల్‌గా సిగరెట్ తాగని ఉద్యోగుల కోసమే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సిగరెట్ తాగే ఉద్యోగులు మధ్య మధ్యలో విరామం తీసుకొని దమ్ముకొట్టేందుకు వెళ్తుంటారు. రోజుకు కనీసం మూడు నాలుగు సార్లు బయటకు వెళ్తుంటారు. కానీ పొగతాగని వారు మాత్రం ఈ బ్రేక్‌లు తీసుకోరు. అందుకే వారికి అదనపు సెలవులు ఇస్తున్నామని కంపెనీ తెలిపింది.

ఇంకా చదవండి ...
    ధూమపానం (Smoking) ఆరోగ్యానికి హానికరం . క్యాన్సర్‌ (Cancer)కు కారకం. స్వయంగా ఆ సిగరెట్ పెట్టెలపైనే ఈ హెచ్చరిక ఉంటుంది. ఐనా పొగరాయుళ్లు వింటారా..? డబ్బాలకు డబ్బాలు పీల్చేస్తారు. రైలింజన్‌లా పొగను గుప్పుగుప్పున వదులుతారు. ఇక ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు.. ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల్లో కొందరు.. పని ఒత్తిడిని తట్టుకోలేక.. సిగరెట్లు తాగుతుంటారు. అప్పుడప్పుడూ మిత్రులతో సరదాగా బయటకు వెళ్లి.. సిగరెట్స్ తాగుతుంటారు. పాన్ షాప్ వద్దో.. లేదంటే టీ స్టాల్ వద్దో.. దమ్ము కొడతారు. కొందరైతే బ్రేక్స్ మీద బ్రేక్స్ తీసుకొని సిగరెట్స్ లాగిస్తారు. ఈ క్రమంలో జపాన్‌కు చెందిన ఓ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. సిగరెట్ తాగని ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

    Viral Video: పెళ్లిలో వధువు అరాచకం..  మండపంలో అందరి ముందు ఎంత పనిచేసింది..

    ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. పియాలా ఇంక్ అనే జపనీస్ మార్కెటింగ్ సంస్థ (Japanese company Piala Inc)  తమ పెయిడ్ టైమ్ ఆఫ్ పాలిసీలో కీలక మార్పులు చేసింది. సిగరెట్ తాగడానికి ఉద్యోగులు తరచూ విరామం తీసుకోవడం వల్ల ఉత్పాదకత తగ్గిపోతుందని అదే ఆఫీసుకు చెందిన ఓ పొగతాగని ఉద్యోగి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు సమర్థనీయమని కంపెనీ గుర్తించింది. ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. ధూమపానం చేయని ఉద్యోగుల కోసం అదనపు ప్రయోజనాలను (Company policy for non smokers) ప్రకటించింది.  సిగరెట్ తాగని ఉద్యోగులకు ఏడాదిలో 6 రోజుల పాటు అదనపు సెలవులు (Japanese company cigarette break rule) ఇస్తామని కంపెనీ వెల్లడించింది. ఈ నిర్ణయం వెనక మంచి కారణమే ఉంది. సిగరెట్ తాగే ఉద్యోగులు మధ్య మధ్యలో విరామం తీసుకొని దమ్ముకొట్టేందుకు వెళ్తుంటారు. రోజుకు కనీసం మూడు నాలుగు సార్లు బయటకు వెళ్తుంటారు. కానీ పొగతాగని వారు మాత్రం ఈ బ్రేక్‌లు తీసుకోరు. అందుకే వారికి అదనపు సెలవులు ఇస్తున్నామని కంపెనీ తెలిపింది.

    Shocking: ఊహించని ఘటన.. బాల్కనీ నుంచి మూడెళ్ల కొడుకుని బైటకు విసిరేసిన తండ్రి..

    కంపెనీ ప్రతినిధి హిరోటక మతుషిమా మాట్లాడుతూ.. '' పనివేళల్లో ధూమపానం కోసం తీసుకునే విరామాలు ఆఫీసులో చాలా సమస్యలను కలిగిస్తున్నాయని కొన్నేళ్ల క్రితం గుర్తు తెలియని ఉద్యోగి కంపెనీ ఫిర్యాదు చేశారు. తన అభిప్రాయాన్ని లేఖరాసి సజెషన్ బాక్స్‌లో వేశారు. సిగరెట్ బ్రేక్ కారణంగా ఓ ఉద్యోగి రోజూ 15 నిమిషాల పాటు ఆఫీసు బయటే ఉంటున్నాడని అందులో రాసి ఉంది. వారి వల్ల ఉత్పాదకత తగ్గుతుందని.. ఎక్కువ విరామాలు తీసుకోవడం వల్ల తక్కువ పనిచేస్తున్నారని... ఆ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ విషయం కంపెనీ సీఈఓ దృష్టికి వెళ్లింది. అందుకే ధూమపానం చేయని వారికి పరిహారం చెల్లించేందుకు సీఈవో టకావో అసుకా ప్రత్యేక సెలవు ప్రకటించారు. '' అని చెప్పారు.

    సిగరెట్ తాగేవారిని... స్మోకింగ్ మానేయాలని ప్రేరేపించడం కోసమే ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని ఓ ఇంటర్వ్యూలో కంపెనీ సీఈవో తెలిపారు. ధూమపానం వల్ల కలిగే నష్టాలను చెప్పి భయపెట్టే బదులు.. ఇలా లాభాలు చూపిస్తే సిగరెట్ తాగడం మానేస్తారని పేర్కొన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: International news, Japan, Smoking habbit, Trending

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు