హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

North Korea Missile : అమెరికాపై ఉత్తరకొరియా క్షిపణి దాడి చేయబోతోందా?

North Korea Missile : అమెరికాపై ఉత్తరకొరియా క్షిపణి దాడి చేయబోతోందా?

ప్రతీకాత్మక చిత్రం (image credit - twitter - reuters)

ప్రతీకాత్మక చిత్రం (image credit - twitter - reuters)

North Korea Missile : దేశాల పాలకులు ప్రశాంతంగా ఉంటే.. ప్రపంచ ప్రజలు కూడా మనస్శాంతితో ఉంటారు. కానీ ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ లాంటి వాళ్ల వల్ల ఆ ప్రశాంతత కనిపించట్లేదు. తాజాగా ఆ దేశం తయారుచేసిన ఓ క్షిపణిపై తీవ్ర కలకలం రేగుతోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఉత్తర కొరియా మిసైల్స్‌ ప్రయోగాలను కొనసాగిస్తోంది. ప్రపంచ దేశాల హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రయోగాలను చేపడుతోంది. ఏకంగా రెండు నెలల్లోనే 50కి పైగా మిసైల్స్‌ను ఉత్తర కొరియా టెస్ట్‌ ఫైర్‌ చేసింది. తాజాగా శుక్రవారం అనుమానాస్పద ఖండాంతర బాలిస్టిక్ మిసైల్‌ (Intercontinental Ballistic Missile)ని పరీక్షించింది. ఇది రెండు రోజుల్లో ఉత్తర కొరియా చేపట్టిన రెండో ప్రయోగం కావడం గమనార్హం. ఈ మిసైల్‌కు అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరుకోవడానికి అవసరమైన రేంజ్‌ ఉందని జపాన్ రక్షణ మంత్రి యసుకాజు హమదా తాజాగా ఆరోపించారు. ఈ మిసైల్‌ 15,000 కి.మీ (9,320 మైళ్ల) దూరం ప్రయాణించగలదని అన్నారు.

గతంలో జపాన్‌ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ హిరోకాజు మట్సునో మాట్లాడుతూ.. ఖండాంతర బాలిస్టిక్ మిసైల్‌ (ICBM) తరగతికి చెందిన మిసైల్స్ 1,000 కి.మీ (622 మైళ్లు) రేంజ్‌ను కవర్‌ చేస్తాయని చెప్పారు. అంతేకాకుండా 6,000 కి.మీ (3,730 మైళ్లు) ఎత్తుకు చేరుకోగల సామర్థ్యం వాటికి ఉంటుందన్నారు.

మిసైల్ కలకలం :

ఉత్తర కొరియా అనుమానాస్పద ఖండాంతర బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించింది. ఇటీవల కాలంలో ప్యాంగ్యాంగ్ రికార్డు స్థాయిలో మిసైల్స్‌ను టెస్ట్‌ ఫైర్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల వ్యవధిలో శుక్రవారం మరో మిసైల్‌ను ప్రయోగించింది. టెస్ట్‌ ఫైర్‌ చేసిన మిసైల్‌ హక్కైడో ఉత్తర ప్రిఫెక్చర్‌లోని ఒషిమా-ఓషిమా ద్వీపానికి పశ్చిమాన 200 కి.మీ (124 మైళ్లు) దూరంలో పడింది. దీనిపై జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా మాట్లాడుతూ.. మిసైల్‌ హక్కైడో ఉత్తర ప్రాంతంలోని జపాన్‌కు చెందిన ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) పరిధిలోని నీటిలో పడిపోయిందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రయోగాలను ఉత్తర కొరియా నిర్వహించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

అంతకుముందు సియోల్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మాట్లాడుతూ.. తూర్పు దిశలో బాలిస్టిక్ మిసైల్‌ లాంచ్‌ అయినట్లు గుర్తించామని చెప్పారు. టోక్యో కూడా ప్రయోగాన్ని ధ్రువీకరించింది. ప్యాంగ్యాంగ్ అనుమానిత బాలిస్టిక్ మిసైల్‌ని ప్రయోగించిందని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఖండించిన అమెరికా :

ఈ ప్రయోగాన్ని అమెరికా ఖండించింది. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా బలమైన నిరోధక చర్యలను తీసుకోవాలని దక్షిణ కొరియాను ఆదేశించింది. గురువారం ఉత్తర కొరియా ఆర్థిక మంత్రి చో సోన్ హుయ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఏ విధంగా అయినా యూఎస్‌ సైనిక చర్యలు పెరిగితే, తీవ్ర ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అదే రోజు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్‌ను ఉత్తర కొరియా ప్రయోగించింది. ఈ చర్యలు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్, యూఎస్‌ అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్ పీఎం ఫుమియో కిషిదా మధ్య గత ఆదివారం సమావేశం జరిగిన తర్వాత చోటు చేసుకున్నాయి. ఈ సమావేశం తర్వాత మూడు దేశాలూ తమ సైనిక సహకారాన్ని పెంచుకోవడానికి అంగీకరించాయి.

Mystery : గుండ్రంగా తిరుగుతున్న గొర్రెలు.. మిస్టరీ వీడియోకి 80 లక్షల వ్యూస్

రెండు నెలల్లో 50కి పైగా ప్రయోగాలు :

ఉత్తర కొరియా గత రెండు నెలల్లో 50కి పైగా మిసైల్స్‌ను ప్రయోగించింది. వాటిలో ఎక్కువ భాగం షార్ట్‌ రేంజ్‌ మిసైల్స్‌ ఉన్నాయి. లాంగ్‌ రేంజ్‌ మిసైల్‌ ప్రయోగాలు చాలా అరుదుగా ఉంటాయి. తాజా ఖండాంతర బాలిస్టిక్ మిసైల్‌ (ICBM)ని ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ దగ్గర నుంచి స్థానిక సమయం 10:15 (02:15 GMT)కి ప్రయోగించినట్లు సియోల్‌లోని మిలిటరీ చీఫ్‌లు తెలిపారు.

First published:

Tags: America, International news, Japan, North Korea

ఉత్తమ కథలు