శృంగారం చేసుకోమని కపుల్స్‌కు సెలవులు ఇస్తున్న ఆఫీసులు...ఎక్కడో తెలుసా...?

జపాన్ యువతలో 30-39 వయస్సు కలిగిన యువకుల్లో ఒక్కసారి కూడా సెక్స్ అనుభవం లేని వారి సంఖ్య 12.7 శాతంగా ఉంది. అంతే కాదు ఈ సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతోంది. పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలతో యువత సెక్స్ పట్ల ఆసక్తి చూపడం లేదని సర్వేల్లో తేలింది. దీంతో తప్పును సరిదిద్దుకునేందుకు జపాన్ ప్రభుత్వం ఆరోగ్యం పై ఎక్కువ శ్రద్ధ చూపేందుకు ముందుకు వచ్చింది.

news18-telugu
Updated: June 19, 2019, 9:21 PM IST
శృంగారం చేసుకోమని కపుల్స్‌కు సెలవులు ఇస్తున్న ఆఫీసులు...ఎక్కడో తెలుసా...?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 19, 2019, 9:21 PM IST
జపాన్‌లో జనాభా విపరీతంగా పతనమవుతోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే జనాభా పెరగాలని అక్కడి ప్రభుత్వం నడుం బిగించింది. జపాన్ లో గత ఏడాది 10 లక్షల మంది పసిపిల్లలు జన్మించగా, అదే సమయంలో 13 లక్షల మంది వృద్ధులు మరణించారు. ఇదే ఇప్పుడు జపాన్ ప్రభుత్వాన్ని ఆందోళన పెట్టే అంశంగా మారింది. ముఖ్యంగా యువత సెక్స్ పట్ల ఆసక్తి చూపడం లేదని, వారంతా పని ధ్యాసలోనూ, డబ్బు సంపాదించే ధ్యాసలో పడి దాంపత్య సుఖానికి దూరమవుతున్నారని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా జనాభాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి, యువకుల సంఖ్య తగ్గిపోతే అది దేశ ఆర్థిక వ్యవస్థ పైనే దుష్ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. మానవ వనరుల కొరత కారణంగా పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతుందని ఆర్థిక వేత్తలు కంగారు పడుతున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడి, జపాన్ జనాభా పెంచేందుకు అక్కడ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టగా, అటు ప్రైవేటు కంపెనీలు సైతం జనాభా పెరుగుదుల కోసం తమ వంతు సహకారం అందిస్తున్నారు. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఒకటి తమ ఉద్యోగుల్లో పెళ్లి కాని వారు, పెళ్లిళ్లు చేసుకుంటే ప్రత్యేక నజరానాలు ప్రకటించింది. ఇందులో మూడు నెలల బోనస్‌తో పాటు హనీమూన్ కోసం వారికి నచ్చిన ప్రదేశంలో ప్యాకేజీ టూర్లను కూడా ఫ్రీగా ఆఫర్ చేస్తోంది. అంతే కాదు పిల్లలు పుట్టిన జంటలకు సైతం ప్రత్యేక నగదు బహుమతులు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అలాగే ముగ్గురు పిల్లలు ఉన్న దంపతులకు అదనంగా మరో వేతన పెంపుతో పాటు వీకెండ్స్ లో ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఇదొక్కటే కాదు, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు ప్రత్యేకంగా కావాల్సినన్ని సెలవలు కూడా జపాన్ కంపెనీ ఇస్తోంది. అయితే జపాన్ యువతలో 30-39 వయస్సు కలిగిన యువకుల్లో ఒక్కసారి కూడా సెక్స్ అనుభవం లేని వారి సంఖ్య 12.7 శాతంగా ఉంది. అంతే కాదు ఈ సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతోంది. పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలతో యువత సెక్స్ పట్ల ఆసక్తి చూపడం లేదని సర్వేల్లో తేలింది. దీంతో తప్పును సరిదిద్దుకునేందుకు జపాన్ ప్రభుత్వం ఆరోగ్యం పై ఎక్కువ శ్రద్ధ చూపేందుకు ముందుకు వచ్చింది.

First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...