మహిళలు హై హీల్స్‌తో రావాల్సిందే... జపాన్ మంత్రి ఆదేశాలు...

KuToo campaign : మహిళలు హై హీల్స్ తప్పక వేసుకోవాలనే కండీషన్‌ను తప్పించాలంటూ... 19 వేల మంది పిటిషన్‌పై సంతకం చేశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 6, 2019, 9:06 AM IST
మహిళలు హై హీల్స్‌తో రావాల్సిందే... జపాన్ మంత్రి ఆదేశాలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీటూ లాంటి ఉద్యమం కూటూ జపాన్‌లో మరింత విస్తరిస్తోంది. అక్కడి మహిళా ఉద్యోగినులు సూట్, హైహీల్స్ తప్పనిసరిగా వేసుకోవాలని జపాన్ ప్రభుత్వం ఇదివరకు ఆదేశించింది. దీన్ని చాలా మంది మహిళలు వ్యతిరేకిస్తున్నారు. హైహీల్స్ వేసుకోవడం వల్ల కాళ్లలో రక్త సరఫరా సరిగా జరగట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్యమానికి రోజురోజుకూ మద్దతు పెరుగుతుంటే... జపాన్ ఆరోగ్య, కార్మిక సంక్షేమశాఖ మంత్రి టకుమీ నెమోటో మాత్రం మహిళల్నే తప్పుపట్టారు. పని ప్రదేశాలకు తగినట్టు మహిళలు హై హీల్స్ వేసుకోవడం అవసరమన్నారు. అందులో ఏమాత్రం తప్పులేదంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.

హై హీల్స్ వేసుకోవాలని సంస్థల యాజమాన్యాలు తమను ఒత్తిడి చేయకుండా చట్టం తీసుకురావాలంటూ ఉద్యమకారులు ఈ మధ్య కార్మికశాఖను ఆశ్రయించారు. 19 వేల మందికి పైగా ఉద్యోగినులు తమ పిటిషన్‌పై సంతకాలు చేశారు. కానీ కార్మిక శాఖ నుంచీ మహిళలకు ఎలాంటి హామీ లభించనట్లైంది. మగవాళ్లతో సమానంగా తామూ పనిచేసినా... ఇలా వేర్వేరుగా చూడడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు మహిళలు.

జపనీస్ భాషలో ‘కూట్స్’ అంటే బూట్లు అని అర్థం.. ఈ కారణంగానే తమ ఉద్యమానికి ‘కూటూ’అని పేరుపెట్టుకున్నారు మహిళలు. ప్రపంచవ్యాప్తంగా హైహీల్స్ వాడరాదనే ప్రచారం జరుగుతోంది. జపాన్‌లో మాత్రం ప్రభుత్వం అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకొని అమలుచేస్తోంది.
First published: June 6, 2019, 9:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading