హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Tsunami Waring : తైవాన్ లో భారీ భూకంపం..జపాన్ లో సునామీ హెచ్చరిక జారీ

Tsunami Waring : తైవాన్ లో భారీ భూకంపం..జపాన్ లో సునామీ హెచ్చరిక జారీ

భూకంధాటికి కుప్పకూలిన బిల్డింగ్

భూకంధాటికి కుప్పకూలిన బిల్డింగ్

Earthquake In Taiwan : చైనా తూర్పు తీరంలో స్వయం ప్రతిపత్తి కలిగిన తైవాన్(Taiwan) ద్వీపంలో ఆదివారం మరోసారి బలమైన భూకంపం(Earthquake) సంభవించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Tsunami Waring In Japan : చైనా తూర్పు తీరంలో స్వయం ప్రతిపత్తి కలిగిన తైవాన్(Taiwan) ద్వీపంలో ఆదివారం మరోసారి బలమైన భూకంపం(Earthquake) సంభవించింది. తైవాన్‌లోని యుజింగ్ నగరంలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. తైవాన్‌లోని యుజింగ్‌కు తూర్పున 85 కిలోమీటర్ల దూరంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:14 గంటలకు భూకంపం సంభవించిందని USGS(యూఎస్ జియోలాజికల్ సర్వే) తెలిపింది. ప్రారంభ:లో భూకంప తీవ్రత 7.2గా ఇవ్వబడింది, అయితే USGS దానిని తర్వాత 6.9కి మార్చింది. అయితే శనివారం అదే ప్రాంతంలో తక్కువ నష్టంతో అనేక సార్లు ప్రకంపనలు వచ్చాయి.అదే ప్రాంతంలో 24గంటల్లో 12సార్లు భూమి కంపించింది. శనివారం అదే ప్రాంతంలో 6.5 తీవ్రతతో కూడా భూకంపం వచ్చిందని,24 గంటల్లోనే మళ్లీ అదే తీవ్రతతో ఇవాళ భూకంపం వచ్చినట్లు USGS తెలిపింది. కానీ ఆదివారం నాటి భూకంపం మరింత బలంగా ఉందని తెలిపింది. భారీ భూకంపం రావడంతో పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. పెద్ద అపార్టమెంట్లు కుప్పకూలిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. రాజధాని తైపీలో కూడా ప్రకంపనలు సంభవించాయి. తైవాన్ మీడియా ప్రకారం, భూకంప కేంద్రానికి సమీపంలో రెండు అంతస్తుల నివాస భవనం కూలిపోయింది. రాజధాని తైపీలోని ద్వీపం యొక్క ఉత్తర చివరలో కూడా ప్రకంపనలు సంభవించాయి.

తైవాన్‌లో భూకంపం సంభవించిన తర్వాత  జపాన్(Japan) వాతావరణ సంస్థ...తైవాన్ సమీపంలోని మారుమూల దీవులకు సునామీ హెచ్చరికను జారీ చేసింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు బీచ్‌కు దూరంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. సాయంత్రం 4 గంటల వరకు ఒక మీటర్ ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. తైవాన్‌కు తూర్పున 110 కిలోమీటర్లు (70 మైళ్లు) తూర్పున 4:10 గంటలకు జపాన్‌లోని పశ్చిమ ద్వీపమైన యోనాగుని ద్వీపానికి తొలి అలలు చేరుకోవచ్చని ఏజెన్సీ తెలిపింది. ఆ తర్వాత సమీపంలోని మూడు ద్వీపాల్లో అలలు ఎగసిపడే అవకాశముందని తెలిపింది. ముప్పు ఉండటం వల్ల ప్రజల్ని ముందుగానే అప్రమత్తం చేశారు అధికారులు.

Weird Shark : వింత షార్క్ ని పట్టుకున్న మత్స్యకారుడు..కళ్లు,పళ్లు అన్నీ ఢిఫరెంట్

మరోవైపు,జపాన్ మెటెరాలాజికల్ ఏజెన్సీ (JMA) కగోషిమా ప్రాంతానికి 'స్పెషల్ వార్నింగ్' ఇచ్చింది. తుఫాను ముంచుకొస్తున్న సమయంలో ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఇప్పుడు అక్కడ అలాంటి వాతావరణమే నెలకొంది. Typhoon Nanmadol కారణంగా నైరుతి జపాన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. కనీసం 30 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కగోషిమా సహా పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోకల్ ట్రైన్‌లు నిలిచి పోయాయి. ఫ్లైట్‌లూ రద్దయ్యాయి. మిగతా ప్రజారవాణా సర్వీసులనూ నిలిపివేశారు. ప్రమాదకర స్థాయిలో గాలులు వీస్తుండటం వల్ల JMA హెచ్చరికలు జారీ చేసింది. ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అని... ఇది చాలా ప్రమాదకరమైన టైఫూన్‌ అని అధికారులు తెలిపారు. ఇప్పటికే 29 లక్షల ఇళ్లకు హెచ్చరికలు జారీ చేసి వెంటనే ఖాళీ చేయాలని చెప్పారు. ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ కూడా రంగంలోకి దిగింది. కగోషిమా స్థానిక అధికార యంత్రాంగమూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి 8,500 మంది పౌరుల్ని వేరే ప్రాంతాలకు తరలించారు. వారికి ప్రత్యేక ఆవాసాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకుని నిలబడగలిగే ఇళ్లలోనూ వీళ్లకు ఆశ్రయం కల్పిస్తున్నారు. బలమైన గాలులు వీచే సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులు వివరిస్తున్నారు. దృఢంగా ఉండే బిల్డింగ్‌ల్లోకి వెళ్లాలని, కిటికీల పక్కన నిలుచోకూడదని ప్రజలకు సూచిస్తున్నారు.  గంటకు 252 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను దూసుకొచ్చే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

China Bus Accident: బస్సు బోల్తాపడి.. 27 మంది మృతి..చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం

కాగా,తైవాన్ భూమి తరచుగా భూకంపాలతో వణుకుతుంది, ఎందుకంటే ఈ ప్రాంతం రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ మధ్య ఉంటుంది. ఈ ద్వీపం రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్‌కు సమీపంలో ఉన్నందున తైవాన్‌లో తరచుగా భూకంపాలు వస్తుంటాయి. శనివారం తైవాన్‌లోని తూర్పు తీర ప్రాంతంలో భూకంపం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే 6.6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంపం రాత్రి 9:30 గంటలకు ఉత్తర తీరప్రాంత పట్టణమైన టైటుంగ్‌కు 50 కి.మీ దూరంలో పది కి.మీ లోతులో వచ్చింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Earth quake, Earthquake, Japan, Taiwan

ఉత్తమ కథలు