Japan Health: కరోనా రోగుల మృత్యుఘోష.. ఇళ్లల్లో శవాలు.. జపాన్‌కు అసలేమైంది?

Japan Health Crisis: కరోనా ధాటికి జపనీస్ చిగురుటాకులా వణుకుతున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స అందక అల్లాడిపోతున్నారు. ఇంట్లోనే మరణిస్తున్నారు.

Japan Health Crisis: కరోనా ధాటికి జపనీస్ చిగురుటాకులా వణుకుతున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స అందక అల్లాడిపోతున్నారు. ఇంట్లోనే మరణిస్తున్నారు.

  • Share this:
జపాన్.. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానానికి కేరాఫ్. బలమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందిన దేశం కావటంతో జపాన్ కరోనా సంక్షోభం బారిన పడదని ప్రపంచదేశాలన్నీ భావిస్తే.. అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే షాక్ తినేలా ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచంలో అత్యధిక ఆయుర్ధాయం ఉన్న దేశం జపాన్ కావటంతో ఇక్కడ వృద్ధుల జనాభా ఎక్కువ, వృద్ధులకు కరోనా సోకే అవకాశాలు చాలా ఎక్కువ కూడా. దీంతో ఇక్కడ ఉన్న ఆసుపత్రులు, వైద్యసిబ్బంది చేతులెత్తేసింది. అత్యవసర ఎమర్జెన్సీ సేవల కోసం కాల్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తి జవాబు ఇచ్చేవారు కూడా కరువైవ దుర్భిక్షంలో జపనీయులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. కోవిడ్-19 సోకిన జపానీయులంతా వైద్య సేవలు లభించక, ఇంటిపట్టునే బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకుని బ్రతుకు వెళ్లదీస్తున్నారు.

జపాన్‌లో వైద్య సేవలు, తలసరి బెడ్ల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నాయంటూ గతంలో ప్రపంచమంతా ఆదేశాన్ని కీర్తిస్తే ..అక్కడ బెడ్ల సంఖ్య అత్యల్పంగా ఉన్నకారణంగా కరోనా రోగులకు చికిత్స సైతం అందకపోవటం వంటి వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. గత రెండు నెలల్లో ఇక్కడ శరవేగంగా కరోనా వ్యాపించటంతో ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 406,000 దాటింది. పాజిటివ్ వచ్చినవారు వేలల్లో ఐసొలేషన్ సెంటర్లలో ఉంటూ ఆసుపత్రిలో బెడ్లు ఎప్పుడెప్పుడు ఖాళీ అవుతాయా అని వేచిచూస్తున్నారు. ఇలా వైద్యం అందక కరోనా కారణంగా ఇళ్లలోనే చచ్చిపోతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది..


అందరికీ ఆరోగ్య బీమా:

జపాన్‌లో అందరికీ ఆరోగ్యం దక్కాలనే లక్ష్యంతో అందరికీ మెడికల్ ఇన్సూరెన్సులను ఇవ్వటం 1960ల్లోనే ప్రారంభమైంది. వారి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టం ఇక్కడ అమల్లో ఉంది. దీంతో అవసరం లేకపోయినా ఆసుపత్రికి వచ్చి కరోనాకు చికిత్స తీసుకోవాలనుకునే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోందని..అందుకే బెడ్ల కొరతనే సంక్షోభం తలెత్తుతోందని ప్రభుత్వం తాజాగా సరికొత్త వాదన తెరపైకి తెస్తోంది. దీంతో గత్యంతరం లేక కోవిడ్ సోకినవారంతా ఇళ్లలోనే ఉండక తప్పటం లేదు.. వీరు కనీసం వైద్యులను సంప్రదించే చాన్స్ కూడా దక్కకపోవటం కఠోరమైన సత్యమేనంటూ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్లు కుండబద్ధలు కొడుతున్నారు. కరోనా తొలిరోజుల్లో కేవలం సింప్టమ్స్ వచ్చినా వారిని ఆటోమేటిక్ గా ఆసుపత్రుల్లో చేరాల్సివచ్చేదని, కానీ కేసులు సంఖ్య విపరీతంగా పెరగటంతో ఆరోగ్యం విషమిస్తున్న స్థితిలో ఉన్న కరోనా రోగికి కూడా బెడ్లు దొరకని పరిస్థితి తలెత్తి.. వైద్యసేవలు లభించటం అసంభవంగా మారిందని డాక్టర్లు తెగేసి చెబుతున్నారు.


వెయ్యిమందికి 13 బెడ్లు:

ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) గతంలో చెప్పిన గణాంకాల ప్రకారం 2019లో ప్రతి వెయ్యి మందికి 13 బెడ్లు ఉన్నట్టు జపాన్ అధికారికంగా వెల్లడించింది. ఇక అమెరికా, బ్రిటన్ వంటి ధనిక దేశాల విషయానికి వస్తే ప్రతి వెయ్యి మందికి 3 బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని OECD రిపోర్ట్ వెల్లడించింది. కానీ నిజానికి 126 మిలియన్ల జపాన్ జనాభాకు ఒక మిలియన్ కు పైగా బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే ప్రతి 100,000 మందికి కేవలం 5 ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ ఉండగా జర్మనీలో వీటి సంఖ్య 34కాగా, అమెరికాలో 26గా ఉంది.


స్పెషలిస్ట్ డాక్టర్లు లేరు:

జపాన్ లో డాక్టర్లు, నర్సులు వంటి వైద్యసిబ్బంది కొరత దారుణంగా ఉంది. ఇక్కడ కేవలం 1,631 రకాల అంటువ్యాధులకు చికిత్స చేసే స్పెషలిస్టులు మాత్రమే ఉండగా దేశవ్యాప్తంగా 8,300 ఆసుపత్రులున్నాయి. అంటే వీటిలో మెజార్టీ ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్స్ కు చికిత్స చేసే స్పెషలిస్టులే లేరన్నమాట. చైనా, హాంగ్ కాంగ్, సౌత్ కొరియా, సింగపూర్, తైవాన్ వంటి దేశాలతో పోల్చి చూస్తే మొదట్లో కరోనా ఇక్కడ చాలా తక్కువగా ఉండగా గతంలోనూ SARS, MERS వంటివి తమదేశంలో పాకకుండా తగు జాగ్రత్తలను విజయవంతంగా తీసుకుంది. దీంతో తమదేశంలోకి ఇన్ఫెక్షియస్ రోగాలు అడుగుపెట్టవనే ధీమాతో జపాన్ ప్రభుత్వం ఇందుకు ఎప్పుడూ సన్నద్ధం కాలేదని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే వైద్యులు, వైద్య సిబ్బంది ఇక్కడ రేయింబవళ్లు పనిచేసి తీవ్ర మానసిక ఒత్తిడితో, అలసటతో ఉన్నట్టు ఆసుపత్రులు వివరిస్తున్నాయి.


కన్ఫ్యూజన్‌లో ప్రభుత్వం:

కరోనాపై తాము సరిగ్గా స్పందించలేకపోతున్నట్టు ఇందుకు క్షమాపణలు కూడా జపాన్ ప్రజలకు ఆదేశ ప్రధాని యోషిహిడ్ సుగా చెప్పటం వెనుక ఇంత తతంగం ఉంది. జపాన్ ప్రభుత్వానికి కరోనాపై ఎలా పోరాడాలో స్పష్టత లేకపోగా కన్ఫ్యూజన్ లో ఉంది. దీంతో ప్రజలను కూడా కన్ఫ్యూజన్ కు గురిచేస్తోంది. ఓవైపు సాధారణ జీవితం గడుపుతూ బయట తిరిగి, తినచ్చంటున్న జపాన్ సర్కారు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటే అదెలా సాధ్యమంటూ విమర్శలు జోరందుకున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ అత్యధిక జపనీయులకు టీకాపై అస్సలు విశ్వాసం లేకపోగా సైడ్ ఎఫెక్ట్స్ తలచుకుని వణికిపోతున్నారు. కేవలం 30 మంది ప్రజలు మాత్రమే టీకా తీసుకుంటామని చెబుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: