Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. ప్రజల్లో సునామీ భయం

జపాన్ భూకంపం (Image:USGS)

రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7 గా ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. భూమి నుంచి 60 కి.మీ. లోతులో భూకంపం వచ్చినట్లు తెలిపింది.

  • Share this:
    జపాన్‌ను భారీ భూకంపం వణికించింది. భారత కాలమాన ప్రకారం శనివారం రాత్రి 07.37 సమయంలో పుకుషిమా తీరంలో భూకంపం సంభవించింది. ఇషినోమాకికి 108 కి.మీ., రాజధాని టోక్యోకు ఈశాన్య దిశలో 306 కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7 గా ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. భూమి నుంచి 60 కి.మీ. లోతులో భూకంపం వచ్చినట్లు తెలిపింది. జపాన్ మెటియరలాజికల్ ఏజెన్సీ సైతం 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం వచ్చిందని పేర్కొంది. 7 తీవ్రత అంటే చిన్నది కాదు. ఇది చాలా పెద్ద భూకంపం. ఐతే ఇది సముద్రంలో రావడంతో ప్రధాన భూభాగానికి పెను ముప్పు తప్పింది. ఐతే సముద్రం లోపల రావడంతో సునామీ వస్తుందేమోనని ప్రజలు వణికిపోతున్నారు.




    భూకంపం ధాటికి రాజధాని టోక్యోలోనూ ప్రకంపనలు వచ్చాయి. దీని ప్రభావంతో జపాన్ తూర్పు తీరంలో పలు చోట్ల భవనాలు కుప్పకూలాయి. ఇళ్లల్లో వస్తువులు కింద పడిపోయాయి. ఐతే ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియరాలేదు.
    Published by:Shiva Kumar Addula
    First published: