• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • JAPAN EARTHQUAKE MAGNITUDE 7 2 STRONG EARTHQUAKE HITS JAPAN HERE IS SHOCKING FOOTAGE SK

Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. స్ట్రీట్ కెమెరాల్లో షాకింగ్ దృశ్యాలు

Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. స్ట్రీట్ కెమెరాల్లో షాకింగ్ దృశ్యాలు

జపాన్‌లో భూకంపం (Image:USGS)

Japan Earthquake: 2011లో సంభవించిన భారీ భూకంపం, సునామీ ధాటికి మియాగి భారీగా దెబ్బతింది. మళ్లీ అదే ప్రాంతంలో భూకంపం రాడంతో అక్కడి ప్రజలు వణికిపోయారు.

  • Share this:
    జపాన్‌లో మరో భారీ భూకంపం వణికించింది. ఉత్తర జపాన్‌లోని మియాగి ప్రాంతంలో భూకంపం వచ్చింది. 7.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూమికి 60 కి.మీ. లోతులో భూకంపకేంద్రం ఉన్నట్లు పేర్కొంది. ఈ భారీ భూ ప్రకంపనల ధాటికి భవనాలు ఊగిపోయాయి. ఇళ్లలో ఫ్యాన్‌లు కదలడంతో పాటు వస్తువులు కిందపడిపోయాయి. దాంతో చాలా మంది ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. దేశ రాజధాని టోక్యోను కూడా ప్రకంపనలు తాకినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఐతే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు.

    భారీ భూకంపం రావడంతో మొదట జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర తీరాల్లో మీటర్ వరకు అలలు ఎగసిపడతాయని హెచ్చరించిది. ఐతే 90 నిమిషాల తర్వాత ఈ హెచ్చరికలను వెనక్కి తీసుకుంది. ఐతే భూకంపం దృశ్యాలో స్థానిక స్ట్రీట్ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


    2011లో సంభవించిన భారీ భూకంపం, సునామీ ధాటికి మియాగి భారీగా దెబ్బతింది. మళ్లీ అదే ప్రాంతంలో భూకంపం రాడంతో అక్కడి ప్రజలు వణికిపోయారు. ఐతే ఈ భూకంపం వల్ల అణు రియాక్టర్లపైనా ఎలాంటి ప్రభావం పడలేదని అధికారులు తెలిపారు. బుల్లెట్‌రైలు సేవలు కాసేపు నిలిచిపోయినట్లు వెల్లడించారు. ఐతే తరచూ భూకంపాలు రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని జపనీయుల్లో ఆందోళన నెలకొంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు