హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

ఆ దేశానికి ఏమైంది. అక్కడే ఇలా జరుగుతోందా..ఇంకా ఎక్కడైనా ఇలాగే జరుగుతోందా ..?

ఆ దేశానికి ఏమైంది. అక్కడే ఇలా జరుగుతోందా..ఇంకా ఎక్కడైనా ఇలాగే జరుగుతోందా ..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జపాన్‌ను మంచు భయపెడుతోంది. ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారిపోవడంతో దాని ప్రభావం విమాన రాకపోకలపై ప్రభావం చూపుతోంది. క్రిస్మస్‌, వీకెండ్‌లో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో సుమారు 100 విమాన సర్వీసులు రద్దవడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జపాన్‌లో వాతావరణంలో అస్థిరత కొనసాగితే మరికొన్ని విమానాలు రద్దే ఛాన్సుంది.

ఇంకా చదవండి ...

వందకుపైగా విమాన సర్వీసులు రద్దు..

కొత్త సంవత్సరం రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన ప్రజలు తమ దేశీయ, విదేశీ ప్రయాణాలు రూపొందించుకునే పనిలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలపైన ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మరోవైపు విదేశాల్లో ఉన్న వాళ్లు వేరే దేశాలకు వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమయంలోనే వాతావరణంలో కలిగిన మార్పు అక్కడి ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది. జపాన్‌(Japan)లో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. జపాన్‌ నుంచి ఇతర దేశాలకు వెళ్లాల్సిన వందకుపైగా దేశీయ విమానాల రాకపోకలు రద్దు చేశారు అక్కడి అధికారులు. ఈ విషయాన్ని జపాన్‌కి చెందిన రెండు అతిపెద్ద విమానాయాన సంస్థలు ప్రకటించాయి. జపాన్‌లోని ఉత్తర,పశ్చిమ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న మంచు కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతానికి జపాన్‌ ఎయిర్‌లైన్స్ 35 విమాన సర్వీసుల్ని రద్దు చేసుకోవడం వల్ల సుమారు 1810 మంది ప్రయణికులపై ప్రభావం పడింది. ఇవే కాదు మరో 100కుపైగా దేశీయ విమాన సర్వీసులను నిలిపివేయడం జరిగింది.

కారణం ఒమిక్రాన్‌ కాదా..?

జపాన్‌ను మంచు (Heavy Snow) దుప్పటి కప్పేస్తున్న పరిస్థితుల దృష్ట్య మరో 77 విమాన రాకపోకలను నిలిపివేశారు. ఈ నిర్ణయం కారణంగా 5100మంది ప్రయాణికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని జపాన్ ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. అంతే కాదు  వాతావరణ పరిస్థితులు మారుతున్నందున మరికొన్ని విమాన సర్వీసుల్ని కూడా రద్దే చేసే అవకాశం లేకపోలేదని వెల్లడించారు.

జపాన్‌లో ప్రయాణాల రద్దు దేనికి..?

ఇప్పటికే ఒమిక్రాన్‌ పుణ్యమా అంటూ చాలా దేశాలు కొత్త వేరియంట్ వ్యాప్తితో గజగజ వణికిపోతున్నాయి. క్రిస్మస్‌, వీకెండ్‌ కావడంతో జపాన్‌లో కొన్విని మాన సర్వీసులు రద్దయ్యాయి. వైరస్‌ని కట్టడి చేయడానికి సరిహద్దు నియంత్రణలను కఠినతరం చేసింది అక్కడి ఆరోగ్య మంత్రిత్వశాఖ. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణంలో మార్పు సంభవించడం విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.  మంచు కురుస్తుండటంతో  ప్రయాణాల కోసం టికెట్స్‌ బుక్ చేసుకొని ప్రణాళికలు వేసుకున్న వాళ్లందరిని అయోమయంలో నెట్టినట్లైంది.

ఇప్పటికే చాలా దేశాలు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులతో భయపడుతున్నాయి. కొన్ని దేశాలు వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉన్న ప్రాంతాలకు విమాన రాకపోకల్ని తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నాయి. అయితే జపాన్‌లో మాత్రం అటు మంచు, ఇటు వైరస్‌ వ్యాప్తి రెండూ అక్కడి వాళ్లను  ఆందోళనకు గురి చేస్తున్నాయి.

జపాన్‌(Japan)కు కరోనా కొత్త వేరియంట్ కేసుల భయం పట్టుకుంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ల  కారణంగా కొత్తగా 231 కేసులు నమోదైనట్లుగా అక్కడి ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ పరిణామాల్ని దృష్టిలో ఉంచుకొనే అటు క్రిస్మస్, న్యూ ఇయర్‌ కోసం ప్రత్యేక విమాన సర్వీసుల్ని రద్దు చేసింది.

First published:

Tags: Corona alert, Flight tickets, Japan

ఉత్తమ కథలు