Home /News /international /

JAMES WEBB SPACE TELESCOPES FIRST PHOTOS REVEAL HOW UNIVERSE LOOKED 13 BILLION YEARS AGO UMG GH

James Webb Telescope: ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఫొటో ఇదే.. అప్పట్లో విశ్వం ఎలా ఉందో చూడండి..!

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నుంచి తీసిన మొదటి ఫొటో ఇదే

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నుంచి తీసిన మొదటి ఫొటో ఇదే

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ తొలిసారిగా విశ్వాన్ని (Universe) ఫొటోలు తీసింది. ఆ ఫొటోలలో ఒక దాన్ని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సోమవారం విడుదల చేశారు. ఈ ఫొటోలో ఇంతకు ముందెన్నడూ చూడని సుదూరమైన, స్పష్టమైన విశ్వానికి సంబంధించిన దృశ్యాన్ని చూడవచ్చు.

ఇంకా చదవండి ...
అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా (NASA) ఖగోళ రహస్యాలను ఛేదించేందుకు, అనేక మర్మమైన ప్రశ్నలకు జవాబులు కనుగొనేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ (James Webb Space Telescope)ను అంతరిక్షంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వెబ్ టెలిస్కోప్ తొలిసారిగా విశ్వాన్ని (Universe) ఫొటోలు తీసింది. ఆ ఫొటోలలో ఒక దాన్ని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సోమవారం విడుదల చేశారు. ఈ ఫొటోలో ఇంతకు ముందెన్నడూ చూడని సుదూరమైన, స్పష్టమైన విశ్వానికి సంబంధించిన దృశ్యాన్ని చూడవచ్చు. ఈ ఫొటోలో 4.6 బిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడిన SMACS 0723 అనే గెలాక్సీ సమూహాల పెద్ద గ్రూప్‌ను కూడా తిలకించవచ్చు. ఈ గెలాక్సీ సమూహాలు వాటి వెనుక ఉన్న వస్తువులకు భూతద్దం వలె పనిచేస్తాయి.

ఈ ఫొటో విడుదల చేసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ విస్మయం వ్యక్తం చేశారు. వెబ్ టెలిస్కోప్ దాదాపు 13 బిలియన్ ఏళ్ల క్రితం నాటి విశ్వం ఫొటోలను క్యాప్చర్ చేస్తోందన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం అవుతుందన్నారు. ఈ ఫొటోలు అమెరికా గొప్ప, క్లిష్టమైన పనులు చేయగలదని.. అమెరికన్ ప్రజలకు, ముఖ్యంగా అమెరికన్ పిల్లలకు అమెరికన్ సామర్థ్యాన్ని మించినది ఏమీ లేదని ప్రపంచానికి గుర్తు చేయబోతున్నాయని యూఎస్ అధ్యక్షుడు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పొరిగింటోళ్లకి రూ.19 లక్షల గిఫ్ట్ ఇచ్చిన మహిళ.. ఎందుకో తెలుసా..? ఈ స్టోరీ కచ్చితంగా చదవాల్సిందే


వెబ్ టెలిస్కోప్ గ్రావిటేషనల్ లెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి పురాతన, సుదూర, మందమైన గెలాక్సీల మొదటి స్పష్టమైన క్షేత్ర వీక్షణను సృష్టించింది. నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ టెలిస్కోప్ ద్వారా తీసిన ఈ ఫొటో విశ్వాన్ని ఇప్పటివరకు తీసిన అత్యంత మహత్తరమైన ఫొటోగా అభివర్ణించారు. విశ్వాన్ని ఇంత లోతుగా, స్పష్టంగా ఫొటో తీయడం ఇదే మొదటిసారి అని నాసా కూడా పేర్కొంది. విశ్వానికి అద్భుతమైన ఇన్‌ఫ్రారెడ్ వ్యూ లేదా పరారుణ వీక్షణను ఈ ఫొటోలో వీక్షించవచ్చు. విశాలమైన విశ్వంలో ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఇసుక రేణువు పరిమాణంలో ఉన్న అతి చిన్న భాగమేనని నాసా తెలిపింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ సుదూర గెలాక్సీలు, నక్షత్ర సమూహాలు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు.



వెబ్ నియర్-ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ఈ ఫొటోని క్లిక్ తీసింది. మిగతా ఫొటోలను పన్నెండున్నర గంటల వ్యవధిలో వివిధ కాంతి తరంగదైర్ఘ్యాల వద్ద క్లిక్ చేసింది. సుదూర గ్రహాలు.. నక్షత్రాలు ఏర్పడే "నక్షత్ర నర్సరీలు" ఉన్న మరిన్ని హై-రిజల్యూషన్ ఫొటోలు నేడు విడుదల కానున్నాయి. కొత్త ఫొటోలలో కారినా నెబ్యులా, WASP-96b, సదరన్ రింగ్ నెబ్యులా, స్టీఫన్స్ క్వింటెట్ ఉన్నాయి. కారినా నెబ్యులా అనేది నక్షత్రాల నర్సరీ, ఇక్కడ మన సూర్యుడి కంటే పెద్ద నక్షత్రాలు ఉంటాయి. ఈ నెబ్యులా 9,600-కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ దూరంలో ఉంది. ఎక్సోప్లానెట్ WASP-96b, దాని వాతావరణం ఫొటోలు కూడా విడుదలవుతాయి. ఈ గ్రహం భూమి నుంచి 1,150 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది కేవలం 3.4 రోజుల్లో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. వెబ్ టెలిస్కోప్ నుంచి మిగిలిన హై-రిజల్యూషన్ కలర్ ఇమేజ్‌లు జులై 12న విడుదల చేస్తామని నాసా వెల్లడించింది.
Published by:Mahesh
First published:

Tags: International news, NASA, Photos, Telescope

తదుపరి వార్తలు