• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • JAISH E MOHAMMED MASOOD AZHAR DESIGNATED AS GLOBAL TERRORIST HERE ARE THE ATTACKS HE MADE AGAINST INDIA BA

అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్ అజర్, భారత్‌లో అతడు జరిపిన దాడులివే..

అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్ అజర్, భారత్‌లో అతడు జరిపిన దాడులివే..

మసూద్ అజర్ ఇతర దేశాలకు ప్రయాణించే అవకాశం ఉండదు. ఆయుధాల కొనుగోలు మీద ఆంక్షలు ఉంటాయి.

Masood Azhar | మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. భారత్ అందించిన సాక్ష్యాలకు తోడు ప్రపంచ దేశాల ఒత్తిడి కూడా ఫలించడంతో మసూద్ అజర్ మీద చర్యలు తీసుకుంది.

  • Share this:
    మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. భారత్ అందించిన సాక్ష్యాలకు తోడు ప్రపంచ దేశాల ఒత్తిడి కూడా ఫలించడంతో మసూద్ అజర్ మీద చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో మసూద్ అజర్ చేసిన అరాచకాలు ఒక్కసారి చూద్దాం. భారత్‌‌పై ఎన్నో దాడులు చేసిన, చేయించిన టెర్రరిస్ట్. ఒకప్పుడు భారత్‌కు చిక్కాడు. మళ్లీ తప్పించుకున్నాడు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఓ టెర్రరిస్ట్ గ్రూప్‌ని ఏర్పాటుచేసి ఏకంగా భారత్‌లో అశాంతి నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేశాడు. పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో 1968 జూలై 10న పుట్టాడు. అతడి తండ్రి ఓ ప్రభుత్వ స్కూల్లో హెడ్ మాస్టర్. 11 మంది సంతానంలో మూడో వాడు. ఎనిమిదో తరగతితో చదువు ఆపేసి.. జామియా ఉల్ ఉలూమ్ ఇస్లామిక్ స్కూల్లో చేరాడు. ప్రముఖ మౌలానాగా పేరుతెచ్చుకున్నాడు. భారత్, బ్రిటన్‌తోపాటు పలు ఆఫ్రికా దేశాల్లో కూడా ఉగ్రవాద దాడులు చేయించాడు.

    masood azhar Dead, maulana masood azhar, jem chief masood azhar, who is masood azhar, maluna masood azhar, masood azhar strory,terrorist masood azhar, story of maulana masood azhar,life story of maulana masood azhar, biography of maulana masood azhar, Masood Azhar Wiki, Masood Azhar details, మసూద్ అజర్ మృతి, మసూద్ అజర్ కన్నుమూత, మసూద్ అజర్ ఎవరు? మసూద్ అజర్ వికీపీడియా, మసూద్ అజర్ టెర్రరిస్ట్, మసూద్ అజర్ లైఫ్ స్టోరీ, మసూద్ అజర్ ఫ్యామిలీ,
    మసూద్ అజర్ (ఫైల్ ఫొటో)


    మసూద్ అజర్.. ఒకప్పటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడు. జిహాద్ పేరుతో ఉగ్రవాద కార్యక్రమాలు చేపట్టాడు. 1994 ప్రాంతంలో నకిలీ గుర్తింపు కార్డుతో భారత్‌లోకి అడుగుపెట్టాడు. అయితే, అతడిని అనంతనాగ్ జిల్లాలో భారత్ అతడిని అరెస్ట్ చేసింది. అయితే, 1994లో నేపాల్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానాన్ని హైజాక్ చేసిన కొందరు టెర్రరిస్టులు దాన్ని అఫ్ఘానిస్తాన్‌కు తరలించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకున్న అప్పటి ప్రభుత్వం మసూద్ అజర్‌ను అప్పగించి ప్రయాణికులను విడిపించింది.

    masood azhar Dead, maulana masood azhar, jem chief masood azhar, who is masood azhar, maluna masood azhar, masood azhar strory,terrorist masood azhar, story of maulana masood azhar,life story of maulana masood azhar, biography of maulana masood azhar, Masood Azhar Wiki, Masood Azhar details, మసూద్ అజర్ మృతి, మసూద్ అజర్ కన్నుమూత, మసూద్ అజర్ ఎవరు? మసూద్ అజర్ వికీపీడియా, మసూద్ అజర్ టెర్రరిస్ట్, మసూద్ అజర్ లైఫ్ స్టోరీ, మసూద్ అజర్ ఫ్యామిలీ,
    పుల్వామాలో ఆత్మాహుతి దాడి చేసిన ఆదిల్ దార్ (File)


    జైషే మహ్మద్ ఏర్పాటు చేయకముందు హర్కత్ ఉల్ అన్సార్ అనే సంస్థను కూడా నడిపాడు. 1994 ప్రాంతంలో కాశ్మీర్‌ వచ్చిన నలుగురు విదేశీ టూరిస్టులను ఓ బ్రిటన్ ఉగ్రవాది కిడ్నాప్ చేశాడు. అయితే, పోలీసులు వారిని క్షేమంగా విడిపించగలిగారు. ఆ తర్వాత 1995లో మరోసారి ఐదుగురు విదేశీ టూరిస్టులను కిడ్నాప్ చేసి చంపేశారు.

    • 2000వ సంవత్సరంలో జైషే మహ్మద్ సంస్థ మొట్టమొదటి ఆత్మాహుతి దాడి చేసింది. శ్రీనగర్‌లోని బదామి బాగ్ కంటోన్మెంట్‌లో ఈ దాడి జరిగింది.

    • 2001 డిసెంబర్ 13న ఏకంగా భారత పార్లమెంట్ మీద దాడి చేయించాడు. ఆ దాడిలో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

    • 2016 జనవరి 2న పంజాబ్‌లో ఉన్న పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద ఉగ్రదాడి కూడా మసూద్ అజర్ పనే. ఆ దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు.

    • 2016లోనే సెప్టెంబర్ 18న జమ్మూకాశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో భారత బలగాల మీద మరోసారి ఉగ్రదాడి చేశారు. ఆ దాడిలో 17 మంది సైనికులు చనిపోయారు. 30 మంది గాయపడ్డారు.

    • 2019 ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడి చేయించాడు. ఆ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. పుల్వామాలో దాడి చేయించింది తామేనని అధికారికంగా జైషే మహ్మద్ ప్రకటించుకుంది.

    First published: