హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

జైషే చీఫ్ మసూద్ అజర్ చనిపోలేదు..: పాకిస్తాన్ మీడియా

జైషే చీఫ్ మసూద్ అజర్ చనిపోలేదు..: పాకిస్తాన్ మీడియా

Pak Media on Jaish-e-Mohammed Chief Masood Azhar Death : పాకిస్తాన్ కూడా ఇంతవరకు అజర్ మృతిపై నోరు మెదపలేదు. అజర్ మృతిపై స్పందించాల్సిందిగా ఫెడరల్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఫవాద్ చౌదరిని PTI కోరగా.. తనకేమి తెలియదని బదులిచ్చారు.

  మసూద్ అజర్ మృతిపై తీవ్ర గందరగోళం నెలకొంది. మసూద్ నిజంగానే చనిపోయాడా? లేక ఊహాగానాలేనా? అన్నది అంతుచిక్కడం లేదు. ఆదివారం సాయంత్రం నుంచి మసూద్ అజర్ చనిపోయాడన్న వార్తా కథనాలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని కథనాల్లో అతను ఇంకా బతికే ఉన్నాడంటూ జైషే మహమ్మద్ వర్గాలు తెలిపాయి. తాజాగా పాకిస్తాన్ మీడియా Geo Urdu సైతం అజర్ బతికే ఉన్నాడని వెల్లడించింది. ఆయన కుటుంబ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు తెలిపింది. మసూద్ అజర్ చనిపోయాడన్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది.

  మసూద్ అజర్‌ బతికే ఉన్నాడని చెప్పిన పాక్ మీడియా.. ఆయన ఆరోగ్య వివరాలు మాత్రం వెల్లడించలేదు. అటు పాకిస్తాన్ కూడా ఇంతవరకు అజర్ మృతిపై నోరు మెదపలేదు. అజర్ మృతిపై స్పందించాల్సిందిగా ఫెడరల్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఫవాద్ చౌదరిని PTI కోరగా.. తనకేమి తెలియదని బదులిచ్చారు. ఇటు భారత ప్రభుత్వ వర్గాలు కూడా.. మసూద్ అజర్ కిడ్నీ సమస్యలతో ఓ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తప్పించి.. మరే సమాచారం తమకు తెలియదని వెల్లడించాయి.

  ఇదిలా ఉంటే, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ తమతో టచ్‌లోనే ఉన్నాడని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే అతని ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగా లేదని.. ఇల్లు కూడా కదల్లేని స్థితిలో ఉన్నాడని ఆయన వెల్లడించారు. ఖురేషీ ఈ విషయం వెల్లడించిన మరుసటి రోజే.. మసూద్ అజర్ చనిపోయాడన్న వార్త వెలుగులోకి రావడం గమనార్హం. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ఒత్తిడి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ ఉధ్దేశపూర్వకంగానే మసూద్ అజర్ చనిపోయాడన్న వార్తలను ప్రచారం చేస్తోందా? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మొత్తం మీద పాకిస్తాన్ ప్రభుత్వం దీనిపై ఒక అధికారిక ప్రకటన చేస్తే తప్ప మసూద్ అజర్ మృతి విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

  ఇది కూడా చదవండి : ఎవరీ మసూద్ అజార్... ఎందుకు ఉగ్రవాది అయ్యాడు? బిన్ లాడెన్‌తో సంబంధమేంటి?

  First published:

  Tags: Imran khan, India VS Pakistan, Masood Azhar, Narendra modi, Pakistan, Pulwama Terror Attack

  ఉత్తమ కథలు