హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

బీహార్ బాలిక జ్యోతి కుమారిపై ఇవాంకా ట్రంప్ ప్రశంసలు..

బీహార్ బాలిక జ్యోతి కుమారిపై ఇవాంకా ట్రంప్ ప్రశంసలు..

తండ్రిని కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుతున్న జ్యోతి కుమారి

తండ్రిని కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుతున్న జ్యోతి కుమారి

కన్నతండ్రిని సైకిల్ మీద కూర్చెబెట్టుకుని 1200 కి.మీ దూరం తొక్కిన బీహార్ బాలిక జ్యోతికుమారిని ఇవాంకా ట్రంప్ అభినందించారు.

అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని సైకిల్ మీద కూర్చో బెట్టుకుని 1200 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కిన 15 సంవత్సరాల బాలిక జ్యోతి కుమారిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రశంసించారు. జ్యోతి కుమారి ప్రతిభను మెచ్చుకున్నారు. ‘గాయంతో ఉన్న తండ్రిని సైకిల్ మీద ఎక్కించుకుని ఏడు రోజుల పాటు తొక్కుతూ 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సొంత గ్రామానికి చేరుకుంది. ఆ అందమైన ఓర్పు, ప్రేమ భారతీయ సమాజాన్నే కాకుండా సైక్లింగ్ ఫెడరేషన్‌ను కూడా ఆకట్టుకుంది.’ అంటూ ఇవాంకా ట్రంప్ ట్వీట్ చేశారు.

బీహార్ కు చెందిన జ్యోతికుమారి తండ్రితో కలసి గురుగ్రామ్‌లో ఉంటోంది. 8వ తరగతి చదువుతోంది. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొనడంతో తండ్రికి ఉపాధి లేదు. దీంతో సొంత గ్రామానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అనారోగ్యంతో ఉన్న తండ్రి గురుగ్రామ్ నుంచి బీహార్ వరకు సైకిల్ తొక్కే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో ఆమె హ్యాండిల్ తన చేతికి తీసుకుంది. తండ్రిని వెనుక కూర్చోబెట్టుకుని తొక్కుతూ వెళ్లింది. 1200 కిలోమీటర్ల దూరాన్ని ఏడు రోజుల్లో చేరుకుంది.

అంత దూరం సైకిల్ తొక్కడం అంటే సామాన్యమైన విషయం కాదు. దీంతో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆమె ప్రతిభను మెచ్చుకుంది. జ్యోతి కుమారిని సైక్లింగ్ ట్రయల్స్‌కు రావాల్సిందిగా ఆహ్వానించింది. ఆమె ట్రయల్స్‌లో సెలక్ట్ అయితే, ట్రైనీగా అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఆమెకు పూర్తిస్థాయిలో ట్రైనింగ్ ఇస్తారు.

First published:

Tags: Bihar, Lockdown

ఉత్తమ కథలు