ఇవాంకా ట్రంప్ అసిస్టెంట్‌కు కరోనా పాజిటివ్.. వైట్‌హౌజ్‌లో ఇది మూడో కేసు

ప్రస్తుతం పీఏగా పనిచేస్తున్న ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని శ్వేతసౌధ అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఆమెలో ఏలాంటి కరోనా వైరస్ లక్షణాలు కన్పించట్లేదని సమాచారం.

news18-telugu
Updated: May 9, 2020, 6:34 PM IST
ఇవాంకా ట్రంప్ అసిస్టెంట్‌కు కరోనా పాజిటివ్.. వైట్‌హౌజ్‌లో ఇది మూడో కేసు
ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత చీఫ్ జిమ్ యంగ్ కిమ్... ఫిబ్రవరి 1న పదవికి గుడ్ బై చెప్పబోతున్నారు. ఆ వెంటనే ఆ ప్లేస్‌లోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వచ్చేందుకు ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. అదే నిజమైతే, అమెరికాకు ప్రపంచ బ్యాంక్ నుంచీ భారీగా రుణాలు వస్తాయా?
  • Share this:
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలికి కరోనా వైరస్ సోకింది. అయితే ఆమె కొద్ది రోజులుగా ఇవాంక దగ్గరకు రాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇవాంక దగ్గర పీఏగా పనిచేస్తున్న ఆమె రెండు నెలలుగా మొబైల్ ద్వారానే తన విధులను నిర్వహిస్తోంది. ఇదిలావుంటే.. ప్రస్తుతం పీఏగా పనిచేస్తున్న ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని శ్వేతసౌధ అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఆమెలో ఏలాంటి కరోనా వైరస్ లక్షణాలు కన్పించట్లేదని సమాచారం. ఇదిలావుంటే.. ఇవాంక, ఆమె భర్త జేర్డ్ కుష్నర్‌కు కోవిడ్-19 పరీక్షలు చేయగా, నెగిటివ్‌గా వచ్చినట్టు తేలిసింది. అమెరికా ఉపాధ్యక్షులు మైక్ పెన్స్ ప్రెస్ కార్యదర్శి కాటే మిల్లర్ కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సహాయకుడికి సైతం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వైట్ హౌజ్‌లో మొత్తంగా ముగ్గురికి కరోనా సోకింది.
Published by: Narsimha Badhini
First published: May 9, 2020, 6:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading