పార్లమెంటులో అందరూ చూస్తుండగానే పెళ్లి ప్రపోజల్ పెట్టిన ఎంపీ...ఇటలీలో ఘటన

తన ప్రేయసి ఎలీసా గ్యాలరీలో కూర్చోని ప్రసంగాన్ని వింటున్న సమయంలో మూరో తన ప్రేమను వ్యక్త పరిచాడు. అయితే ఇటలీలో భూకంప బాధితుల పునరావాసంపై చర్చ నడుస్తుండగా, ఆ ఎంపీ ఈ పనిచేసినట్లు సమాచారం.

news18-telugu
Updated: December 3, 2019, 10:52 PM IST
పార్లమెంటులో అందరూ చూస్తుండగానే పెళ్లి ప్రపోజల్ పెట్టిన ఎంపీ...ఇటలీలో ఘటన
పార్లమెంటులో అందరూ చూస్తుండగానే పెళ్లి ప్రపోజల్ పెట్టిన ఎంపీ...ఇటలీలో ఘటన (Image:CNN)
  • Share this:
ఇటలీకి చెందిన ఓ పార్లమెంట్‌ సభ్యుడు పార్లమెంట్‌లో చర్చ జరుగుతున్న సమయంలో తన ప్రేయసి ఎలీసాకి ప్రపోజ్ చేశాడు. ఎంపీ పదవిలో ఉన్న డైమూరో చేసిన పనికి అంతా షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళితే ఈ ఘటన ఇటాలియన్‌ పార్లమెంట్‌లో జరిగింది. తన ప్రేయసి ఎలీసా గ్యాలరీలో కూర్చోని ప్రసంగాన్ని వింటున్న సమయంలో మూరో తన ప్రేమను వ్యక్త పరిచాడు. అయితే ఇటలీలో భూకంప బాధితుల పునరావాసంపై చర్చ నడుస్తుండగా, ఆ ఎంపీ ఈ పనిచేసినట్లు సమాచారం. వెంటనే పక్కనున్న సహచర సభ్యులంతా ముందుగా షాక్ తిన్నా ఆ తర్వాత తేరుకొని అతడికి చప్పట్లతో అభినందనలు తెలిపారు. కాసేపటికే ఎలీశా తన ప్రపోజల్‌ను అంగీకరించిందని తోటి సభ్యులు తెలిపారు. సభ ప్రత్యక్ష ప్రసారం అవుతున్న సమయంలోనే ఎంపీ ప్రపోజ్ చేయడం విశేషం.
Published by: Krishna Adithya
First published: December 3, 2019, 10:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading