హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

OMG : పురుషుడితో శృంగారం..ఓ వ్యక్తికి ఒకే సమయంలో కరోనా,మంకీపాక్స్,హెచ్‌ఐవీ

OMG : పురుషుడితో శృంగారం..ఓ వ్యక్తికి ఒకే సమయంలో కరోనా,మంకీపాక్స్,హెచ్‌ఐవీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Man Tests Positive For Monkeypox,COVID, HIV  Same Time : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్,కొన్ని దశాబ్దాలుగా మానవాళికి ముప్పుగా మారిన హెచ్‌ఐవీ,గత కొద్ది నెలలుగా ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్..ఓ వ్యక్తికి ఒకే సమయంలో సోకడం కలకం రేపుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Man Tests Positive For Monkeypox,COVID, HIV  Same Time : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్(Covid19),కొన్ని దశాబ్దాలుగా మానవాళికి ముప్పుగా మారిన హెచ్‌ఐవీ(HIV),గత కొద్ది నెలలుగా ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్(Monkeypox)..ఓ వ్యక్తికి ఒకే సమయంలో సోకడం కలకం రేపుతోంది. జర్నల్‌ ఆఫ్ ఇన్ఫెక్షన్‌లో ప్రచురితమైన వార్త ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 19న ఈ కేసు గురించి దానిలో ప్రచురితమైంది.


ఇటలీ(Italy)కి చెందిన 36 ఏళ్ల వ్యక్తి జూన్ 16 నుండి జూన్ 20 వరకు స్పెయిన్‌లో ఐదు రోజులు గడిపాడు. స్పెయిన్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తొమ్మిది రోజుల తర్వాత జ్వరం, అలసట, గొంతు నొప్పితో సహా అనేక లక్షణాలను అతడిలొ కనిపించాయి. లక్షణాలు కనిపించిన మూడు రోజుల తర్వాత జూలై 2 న అతనికి పరీక్షలో కోవిడ్‌ సోకినట్లు తేలింది. అదే రోజు మధ్యాహ్నం, అతని తన ఎడమ చేతిపై దద్దుర్లు,పొక్కులు రావడం మొదలైంది. జూలై 5 నాటికి, ఇవి మరింతగా వ్యాపించి చర్మంపై చిన్న చిన్న గడ్డలుగా మారాయి. దీంతో ఆ వ్యక్తి ఇటలీలోని కాటానియాలోని శాన్ మార్కో యూనివర్శిటీ హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడ  డాక్టర్లు పలుమార్లు పరీక్షలు నిర్వహించగా అతడికి మంకీపాక్స్ సోకినట్లు తేలింది. అతడికి ఆ సమయంలోనే వివి పరీక్షలు నిర్వహించగా..హెచ్ ఐవీ సోకినట్లుగా కూడా తేలింది. అతను చివరిసారిగా 2021 సెప్టెంబర్‌లో హెచ్‌ఐవి టెస్ట్ చేయించుకోగా అతనికి అప్పుడు నెగెటివ్ అని తేలింది. అయితే స్పెయిన్ పర్యటనలో కొందరు పురుషులతో అసురక్షిత శృంగారంలో పాల్గొన్నట్లు అతడు అంగీకరించాడు.


Live streaming in SC : చరిత్రలో తొలిసారి..సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారంఅతడు ఇప్పటికే రెండు డోసుల ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాడని తెలిపారు. వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత కొవిడ్, మంకీపాక్స్‌ నుంచి కోలుకొని అతడు జులై 11న హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జి అయ్యి హోమ్ ఐసొలేషన్ లో ఉన్నాడని తెలిపారు. హెచ్‌ఐవీకి మాత్రం ట్రీట్మెంట్ పొందుతున్నాడని చెప్పారు.  అయితే ఇప్పటివరకూ ఒకేసారి మూడు వైరస్‌లు సోకిన ఘటన ఇదొకటేనని, మూడింటి బారినపడటం వల్ల అనారోగ్యం తీవ్రమవుతుందనేదానికి తగిన ఆధారాలు లేవని పరిశోధకులు తెలిపారు. రోగ నిర్ధారణ సమయంలో పలు విషయాలను పరిగణనలోకి తీసుకునేందుకు ఈ తరహా కేసులు కీలకంగా మారతాయని తెలిపారు.


కాగా,మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ఇటీవల అధికారికంగా గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే. మేలో తాజా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32,000 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. యూకేలో 3,000.. అమెరికాలో 10,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Covid positive, HIV, Italy, Monkeypox

ఉత్తమ కథలు