పనిచేయకుండానే రూ. 4.58 కోట్ల జీతం జేబులో వేసుకున్నాడు.. 15 ఏళ్లగా మోసం.. అసలు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి పనిచేయకుండా రూ. 4.58 కోట్ల జీతం తన ఖాతాలో వేసుకున్నాడు. చివరకు మాత్రం అసలు విషయం వెలుగు చూసింది. అసలు ఏం జరిగిందంటే..

 • Share this:
  ఓ వ్యక్తి పనిచేయకుండా రూ. 4.58 కోట్ల జీతం తన ఖాతాలో వేసుకున్నాడు. 15 ఏళ్లుగా విధులకు హాజరు కాకుండా ఈ మొత్తాన్ని సంపాదించుకున్నాడు. కానీ చివరకు మాత్రం దొరికిపోయాడు. ఈ ఘటన ఇటలీలోని ఓ హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఇటలీలోని కాటాన్జారోలోని Pugliese Ciaccio hospitalలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి 2005 నుంచి విధులకు హాజరు కాకుండా జీతం జేబులో వేసుకుంటున్నాడు. ఇందుకోసం అతను చేయని ఆగడాలు లేవు. అనేక విధాలుగా తాను విధులకు హాజరవుతున్నట్టుగా క్రియేట్ చేసి జీతం పొందాడు. తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ఆస్పత్రి డైరక్టర్‌ను కూడా బెదిరింపులకు గురిచేశాడు.విధుల‌కు గైర్హాజరు కావ‌డాన్ని ప‌సిగ‌ట్ట‌కుండా 67 ఏండ్ల ఉద్యోగి ప‌లు మార్గాల‌ను ఎంచుకున్నాడ‌ని స్థానిక పబ్లిక్ ప్రాసిక్యూట‌ర్ కార్యాల‌యం వెల్ల‌డించింది.

  అయితే ఆ డైరెక్టర్ పదవీ విరమణ చేయడం.. ఆ తర్వాత మరో వ్యక్తి ఆ స్థానంలో వచ్చారు. అయితే కొత్తగా బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్ గానీ, హెచ్‌ఆర్ విభాగం గానీ.. ఆ ఉద్యోగి గైర్హాజరును గుర్తించలేదు. దీంతో అతని జీతం అతని ఖాతాలో వేసుకుంటూ వచ్చాడు. ఇలా మొత్తంగా €538,000 (Rs 4.85 crore) తన సొంతం చేసుకున్నాడు. ఈ విషయం కాస్తా ఇటీవల బయటపడటంతో.. అతడిని గతేడాది విధుల నుంచి తొలగించారు. అతడి చేసిన మోసానికి సంబంధించి దర్యాప్తుకు ఆదేశించారు.

  ఇక, ఈ ఘటనకు సంబంధించి అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అతడు విధుల‌కు హాజ‌రుకాక‌కుండా ఏండ్ల త‌ర‌బ‌డి జీతం పొందడం వెనక కారణాలను వెలికితీస్తున్నారు. ఈ మేరకు ఇటాలియన్ న్యూస్ ఏజెన్సీ Ansa పేర్కొంది. మరోవైపు ఇటాలియన్ మీడియా 'king of absentees'గా తెలిపింది.
  Published by:Sumanth Kanukula
  First published: