ISO Chandrayan-2 : మన భూమిపై రకరకాల జీవులుంటాయి. వాటిలో మనకు తెలియని సూక్ష్మజీవులు చాలా ఉంటాయి. అవన్నీ భూమిపై బతకగలవుగానీ... వేరే గ్రహాలపై జీవించేవి చాలా తక్కువ. అలాంటి వాటిలో ఒకటి టార్డిగ్రేడ్ (Tardigrade). దీన్నే మాట్లాడుకునే భాషలో... ఎకా వాటర్ బేర్ (నీటి ఎలుగుబంటి) అని పిలుస్తుంటారు. ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగానికీ, దీనికీ ఏంటి సంబంధం అన్న ప్రశ్న ఇప్పుడు ఉదయించింది. ఏంటంటే... ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లో ఇలాంటి జీవులున్నట్లు తెలిసింది. వాటిలోనే కాదు... అంతరిక్షంలో పంపే చాలా రాకెట్లు, శాటిలైట్లపై ఇలాంటి జీవులు ఉండటం సర్వసాధారణం. ఇవి మన కంటికి కనిపించవు. వీటిని చూడాలంటే మైక్రోస్కోప్ తప్పనిసరి. కొన్నేళ్ల కిందటే... ఇలాంటి జీవులు భూమితోపాటూ... చందమామపైనా ఉన్నట్లు గుర్తించారు. తాజాగా విక్రమ్ ల్యాండర్... చందమామ దక్షిణ ధ్రువంపై ఉండటంతో... ఇప్పుడు అక్కడ కూడా ఈ జీవులు ఉన్నట్లే అంటున్నారు ప్రపంచ శాస్త్రవేత్తలు.
You're looking at the toughest animal in the known universe. This is a tardigrade (aka water bear) and now, thanks to a crashed lunar lander, thousands of them are on the moon. Yes, the moon.
Here's what happened: https://t.co/iRI8Uod4n2
📽️ Rafael Martín-Ledo @rmartinledo pic.twitter.com/bfAcGmtBnX
— WIRED (@WIRED) September 9, 2019
ఏప్రిల్‌లో ఇజ్రాయెల్... చందమామపైకి బెరెషీట్ స్పేస్‌క్రాఫ్ట్‌ని పంపింది. అది కాస్తా... కంప్యూటర్ లోపం వల్ల పేలిపోయింది. ఐతే... ఆ స్పేస్‌క్రాఫ్ట్‌లో వేలాది వాటర్ బేర్లు, మనుషుల DNA శాంపిల్స్నీ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు... చందమామపైకి పంపారని వైర్డ్ (Wired) సంస్థ చెబుతోంది. ఇజ్రాయెల్ పంపిన ల్యూనార్ ల్యాండర్ కూలిపోవడంతో... వేలాది వాటర్ బేర్లు చందమామపై పడి... అక్కడే తిరుగుతున్నాయని ఆ సంస్థ అంటోంది.
మామూలుగా చందమామపై ఎండ పడని చోట... మైనస్ 153 డిగ్రీల చల్లదనం ఉంటుంది. అలాంటి వాతావరణంలో ఏ జీవులూ బతకలేవు. అలాంటిది... వాటర్ బేర్లు మాత్రం బతకగలవని పరిశోధనల్లో తేలింది. అందువల్ల విక్రమ్ ల్యాండర్ ఉన్న చోట కూడా ఇవి ఉంటాయని ప్రపంచ శాస్త్రవేత్తలు అంటున్నారు.
భూమిపై ఏడు ఖండాల్లోనూ వాటర్ బేర్లు ఉన్నాయి. అత్యంత ఎత్తైన పర్వతాలపైనా, అత్యంత సముద్ర లోతుల్లో కూడా అవి కనిపించాయి. భూమిపై అవి లేని చోటంటూ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ అవి మైనస్ డిగ్రీల్లో ఎలా బతకగలుగుతున్నాయంటే... శాస్త్రవేత్తలు కొత్త వాదన చెబుతున్నారు. అవి అసలు భూమిపై పుట్టిన జీవులు కాదనీ... అంతరిక్షం నుంచీ భూమిపైకి వచ్చి ఉంటాయని అంటున్నా్రు. అందువల్లే అవి భూ వాతావరణంతో సంబంధం లేకుండా... జీవించగలుగుతున్నాయని తేల్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrayaan-2, ISRO, Moon, World