హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Israel Weapons: డ్రోన్ కిల్లర్ స్మాష్ డ్రాగన్‌ను ఆవిష్కరించిన ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్ కు దీని ఉపయోగం ఏంటి..?

Israel Weapons: డ్రోన్ కిల్లర్ స్మాష్ డ్రాగన్‌ను ఆవిష్కరించిన ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్ కు దీని ఉపయోగం ఏంటి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎప్పటికప్పుడు సరికొత్త రక్షణ ఉత్పత్తులను తయారుచేస్తూ.. ప్రపంచ దేశాలకు దీటుగా నిలుస్తున్న చిన్నదేశం ఇజ్రాయెల్ తాజాగా కిల్లర్ డ్రోన్‌లను ఆవిష్కరించింది. కొత్త టెక్నాలజీ ఆధారంగా సరికొత్త ఆర్మ్‌డ్‌ డ్రోన్‌లను ఆవిష్కరించింది.

ఎప్పటికప్పుడు సరికొత్త రక్షణ ఉత్పత్తులను తయారుచేస్తూ.. ప్రపంచ దేశాలకు దీటుగా నిలుస్తున్న చిన్నదేశం ఇజ్రాయెల్(Israel) తాజాగా కిల్లర్ డ్రోన్‌లను(Killer Drones) ఆవిష్కరించింది. కొత్త టెక్నాలజీ(New Technology) ఆధారంగా సరికొత్త ఆర్మ్‌డ్‌ డ్రోన్‌లను ఆవిష్కరించింది. వెహికల్-మౌంటెడ్ రిమోట్-కంట్రోల్డ్ వెపన్ స్టేషన్​(SMASH Hopper)గా పిలిచే మరో సాధనాన్ని కూడా ప్రదర్శించింది. శత్రుదేశాల నుంచి వచ్చే అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికల్‌ల(UAV) నుంచి రక్షణ కల్పించేందుకు స్మాష్ డ్రాగన్ అండ్ హోపర్(Hopper) వంటి సాంకేతికత ఉపయోగపడుతుందని చెబుతోంది.

డ్రోన్ వెపన్స్ ప్రత్యేకతలు

కిల్లర్ డ్రోన్లు స్థిర, ఎగిరే వస్తువులను స్మాష్ డ్రాగన్ ఛేదించగలవు. కదిలే ల్యాండ్-బేస్డ్, వైమానిక లక్ష్యాలను హోపర్(Hopper)స్ట్రైక్ చేయగలదు. వేర్వేరు డ్రోన్‌లపై అమర్చేలా స్మాష్ డ్రాగన్ అడ్వాన్స్‌డ్‌ రోబోటిక్ వెపన్‌రీ పేలోడ్‌ వ్యవస్థ వీటిలో ఉంది. వివిధ రకాల అసాల్ట్ రైఫిల్స్, స్నైపర్ రైఫిల్స్, 40ఎంఎం, ఇతర మందుగుండు సామగ్రితో ఫైట్ చేస్తాయి.

Crisis: భారీ ఆర్థిక సంక్షోభంలో పొరుగు దేశం.. చుక్కలనంటిన ధరలతో విలవిల..


స్మాష్ డ్రాగన్ విశేషాలు

స్మాష్ డ్రాగన్ కచ్చితమైన లక్ష్యాలను ఛేదించేలా కాంబాట్-ప్రూవ్డ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. వీటిని రిమోట్‌గా ఆపరేట్ చేయొచ్చు.. లాంగ్ మిషన్‌లను తట్టుకోగలిగేలా వీటికి రూపొందించారు. ట్రాకింగ్ అల్గారిథమ్స్, లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించే టెక్నాలజీలతో కచ్చితత్వంతో కూడిన పర్​ఫార్మెన్స్ వీటి సొంతం. భూమి, గాలి, సముద్ర ఆధారిత లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉపయోగించే అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్ విజన్ కేప‌బిలిటీ వీటికి ఉంది. అత్యంత తక్కువ బరువు ఉండే కిల్లర్ డ్రోన్ కచ్చితత్వం కోసం యూనిక్ స్టెబిలైజేషన్ కాన్సెప్ట్ వినియోగంతో ఇవి పనిచేస్తాయి. డ్రోన్ బరువు అనేది మిషన్ తట్టుకోగల శక్తిని, వ్యయాన్ని ప్రభావితం చేసే కీలక అంశమని స్మార్ట్ షూటర్ సీఈఓ మిచల్ మోర్ అన్నారు. అలాగే తమ స్మాష్ డ్రాగన్ నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉంటూ చాలా తేలికగా తయారైందని చెబుతున్నారు.

ఇజ్రాయెల్‌కు అలాంటి డ్రోన్‌లు ఎందుకు అవసరం?

చిన్న దేశమైనప్పటికీ చుట్టూ ఉన్న వివాదాస్పద, సున్నిత ప్రాంతాలతో ఇజ్రాయెల్​కు నిత్య ఘర్షణ తప్పడంలేదు. హిజ్బుల్లా (Hezbollah)పార్టీ, హమాస్ (Hamas) వంటి సంస్థలు దేశంలోకి యూఏవీలను తరచుగా పంపుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం ఈ సరికొత్త కిల్లర్ డ్రోన్‌లను రూపొందించినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. తీవ్రవాద సంస్థలు యూఏవీలను గుఢాచార కార్యకలాపాల కోసం అప్‌గ్రేడ్ చేసే పనిలో ఉన్నాయని.. కేవలం గతేడాదిలోనే 74 డ్రోన్‌లను హిజ్బుల్లా ప్రయోగించిందని.. ఇటువంటి వాటిని అడ్డుకునేందుకు అత్యాధునిక ఆయుధ వ్యవస్థల అవసరం ఉందని వాదిస్తోంది.

SSD Storage: మీ ల్యాప్‌టాప్‌ స్లో అవుతోందా..? బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించే ఈ SSD స్టోరేజ్​ ప్రొడక్ట్స్‌ను ప్రయత్నించండి..


Smash Hopper

వెహికల్-మౌంటెడ్ రిమోట్-కంట్రోల్డ్ వెపన్ స్టేషన్ SMASH Hopper స్మార్ట్ షూటర్ కంపెనీ ఆవిష్కరించింది. 300 మీటర్ల పరిధిలో కదిలే ల్యాండ్ బేస్డ్, వైమానిక లక్ష్యాలను చేధించగల ఈ స్మాష్ హోపర్.. సురక్షిత దూరాల నుంచి సులువుగా ఆపరేట్ చేయొచ్చు. దీని బరువు కేవలం 15 కిలోలు. సేఫ్ ట్రిగ్గర్ మెకానిజం, ఆటోమేటిక్ స్కానింగ్, టార్గెట్ డిటెక్షన్ వంటి ఫీచర్లు వీటి సొంతం.

మోస్ట్ పాపులర్ వెపన్..?

స్మాష్ డ్రాగన్, Hopper భవిష్యత్తులో సూపర్ పాపులర్ అయ్యే అవకాశం ఉందని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇప్పటికే కొత్తతరం స్మాష్ 2000 యాంటీ-డ్రోన్ వెపన్ కోసం విదేశీ సైన్యాలు క్యూ కడుతున్నాయని ఆ దేశ రక్షణ విభాగం తెలిపింది. ప్రతి రౌండ్​లో లక్ష్యాన్ని కనుగొనేలా రూపొందించిన కాంబాట్-ప్రూవ్డ్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థ ఈ స్మాష్ 2000 సొంతం. హై స్పీడ్ డ్రోన్‌లను ట్రాక్ చేయడం సహా... వాటిని కూల్చేందుకు బిల్ట్-ఇన్ టార్గెటింగ్ అల్గారిథమ్‌లతో కచ్చితమైన యాంటీ-డ్రోన్ సిస్టమ్​గా స్మాష్ 2000కు మంచి పేరుంది. 72 గంటల బ్యాకప్ లేదా 3,600 షాట్‌ల వరకు నిలువగల రీఛార్జిబుల్ లిథియం బ్యాటరీని దీనిలో అమర్చారు.


బరువు కేవలం ఒక కేజీ కంటే కాస్త ఎక్కువ. 200 మీటర్ల ఎత్తులో ఎగిరే డ్రోన్‌ను ఢీకొట్టి.. 300 మీటర్ల ఎత్తులో స్థిరంగా, డైనమిక్‌గా ఉన్న భూ లక్ష్యాలను ఛేదించగల శక్తి దీని సొంతం. స్మాష్ 2000 ప్లస్ రైఫిల్‌ను యూఎస్ మెరైన్ కార్ప్స్, ఇండియన్ నేవీ కలిగి ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. 2021 అక్టోబర్‌లో ఈ సిస్టమ్‌ను యూఎస్ మెరైన్‌లు ఆర్డర్ చేయగా.. గత ఏడాది చివర్లో భారత్ సైతం వీటి కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది.

First published:

Tags: Army, Indian Navy, Israel

ఉత్తమ కథలు