హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Israel: సైనికులు కనిపించరు.. కానీ శత్రువుతో పోరాటం చేస్తారు.. ఇజ్రాయెల్‌లో కొత్త టెక్నాలజీ

Israel: సైనికులు కనిపించరు.. కానీ శత్రువుతో పోరాటం చేస్తారు.. ఇజ్రాయెల్‌లో కొత్త టెక్నాలజీ

(Image: The media line/Youtube)

(Image: The media line/Youtube)

ఇజ్రాయిల్ కొత్తగా అభివృద్ధి చేసిన కామెఫ్లాగ్‌ షీట్‌ పేరు కిట్‌ 300. ఇజ్రాయిల్ రక్షణ మంత్రిత్వ శాఖతో కలసి పొలారిస్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థ దీన్ని రూపొందించింది. దీనిని ధరిస్తే సైనికులను శత్రు సైన్యం గుర్తించడం అసాధ్యమట.

శత్రుదేశాల సైన్యం కళ్లకు, బైనాక్యులర్‌కు తమ సైనికులు కనిపించకుండా ఉండటానికి ఇజ్రాయిల్‌ వినూత్న సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సాంకేతిక ద్వారా సైనికులు అంత సులభంగా శత్రు సైన్యానికి కనిపించరు. దాని కోసం వాళ్లే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, భారీ ఎక్విప్‌మెంట్‌ వాడుతున్నారు అనుకునేరు. ఎందుకంటే ఇజ్రాయిల్‌ రూపొందించింది సరికొత్త కామెఫ్లాగ్‌ షీట్‌ మాత్రమే. ఈ షీట్‌ ప్రత్యేకత ఏంటో చూద్దాం. ఇజ్రాయిల్ కొత్తగా అభివృద్ధి చేసిన కామెఫ్లాగ్‌ షీట్‌ పేరు కిట్‌ 300. ఇజ్రాయిల్ రక్షణ మంత్రిత్వ శాఖతో కలసి పొలారిస్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థ దీన్ని రూపొందించింది. దీనిని ధరిస్తే సైనికులను శత్రు సైన్యం గుర్తించడం అసాధ్యమట. దీనిని థర్మల్‌ విజువల్ కాన్‌సీల్‌మెంట్‌ (టీవీసీ)తో రూపొందించారు. ఇందులో మైక్రో ఫైబర్స్‌, మెటల్స్‌, పాలిమర్స్‌ను వినియోగిస్తున్నారు. దీంతో సాధారణంగా చూసినా, థర్మల్‌ కెమెరాలతో చూసినా... ఆ షీట్‌ ధరించిన వ్యక్తి కనిపించరట.

ఇంతటి ఫీచర్లున్న షీట్‌ భారీ బరువు ఉంటుంది అనుకుంటే పొరపాటే. దీని బరువు కేవలం 1.1 పౌండ్లు మాత్రమే. దాని వల్ల సైనికులు ట్రెక్కింగ్‌ వెళ్లేటప్పుడు సులభంగా క్యారీ చేయొచ్చట. అలాగే ఈ షీట్‌లో 500 పౌండ్ల బరువును తీసుకెళ్లొచ్చు కూడా. కిట్‌ 300 షీట్‌ను రెండువైపులా వాడొచ్చట. అంటే ఓవైపు రాతి రంగుల్లో, మరోవైపు పచ్చని రంగులో ఉంటుంది. అంటే కొండల్లో యుద్ధం, కాపలా చేసేటప్పుడు రాతి రంగు బయటకు కనిపించేలా ఒంటికి చుట్టుకోవాలి. అడవుల్లో ఉన్నప్పుడు పచ్చని రంగు బయటివైపు ఉండేలా చూసుకోవాలన్నమాట.

కిట్‌ 300 షీట్ పరిసరాల్లో కలిసిపోయేలా ఉండటంతో... తేడాను అవతలి సైనికులు గుర్తించలేరని ఇజ్రాయిల్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో బైనాక్యులర్‌లు పెట్టి చూసినా గుర్తించడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే కొండల్లో ఉన్నప్పుడు షీట్‌ చుట్టుకుంటే... ఆ సైనికుడు కూడా కొండ రాయే అనుకునేలా షీట్‌ ఉంటుందట. అడవుల్లో ఉన్నా అంతే.

సైనికులు వాడే షీట్‌ను ఇజ్రాయిల్‌లో 50 ఏళ్ల నుంచి వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో షీట్‌లో మార్పులు అవసరమని భావించి ఇజ్రాయిల్‌ రక్షణ శాఖ ఈ మేరకు కొత్త సాంకేతికతతో షీట్‌ను రూపొందించిందట. మెటీరియల్‌ కూడా మార్చడం వల్ల సైనికులు వీటిని సులభంగా క్యారీ చేయగలుగుతారట. మరోవైపు ఇజ్రాయిల్‌ సీబ్రేకర్‌ పేరుతో మరో డిఫెన్స్‌ సిస్టమ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Keywords

First published:

Tags: Israel, Technology

ఉత్తమ కథలు