హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Israel : ఇజ్రాయెల్ లో మళ్లీ రాజకీయ సంక్షోభం..పార్లమెంట్ రద్దు..3ఏళ్లలో ఐదోసారి ఎన్నికలు

Israel : ఇజ్రాయెల్ లో మళ్లీ రాజకీయ సంక్షోభం..పార్లమెంట్ రద్దు..3ఏళ్లలో ఐదోసారి ఎన్నికలు

ఇజ్రాయెల్ ప్రధాని(ఫైల్ ఫొటో)

ఇజ్రాయెల్ ప్రధాని(ఫైల్ ఫొటో)

Israel Parliament Dissolve : ఇజ్రాయెల్(Israel) లో మళ్లీ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అధికార కూటమి పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలీ బెన్నెట్ సోమవారం తన పాలక సంకీర్ణం వచ్చే వారం పార్లమెంటును రద్దు(Parliament Dissolve) చేస్తుందని చెప్పారు.

ఇంకా చదవండి ...

Israel Parliament Dissolve : ఇజ్రాయెల్(Israel) లో మళ్లీ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అధికార కూటమి పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలీ బెన్నెట్ సోమవారం తన పాలక సంకీర్ణం వచ్చే వారం పార్లమెంటును రద్దు(Parliament Dissolve) చేస్తుందని చెప్పారు. గతేడాది జరిగిన పవర్ షేరింగ్ డీల్ ప్రకారం కూటమి భాగస్వామి అయిన విదేశాంగ మంత్రి యాయిర్ లాపిడ్‌ ఆపద్ధర్మ ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా వ్యవహరించనున్నారని తెలిపారు. "మేము ఇజ్రాయెల్ కోసం సరైన నిర్ణయం తీసుకున్నాము," అని బెన్నెట్ చెప్పాడు. జులైలో ఇజ్రాయెల్‌ను సందర్శించనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి లాపిడ్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం మనుగడ సాగించలేకపోవడం ఇజ్రాయెల్ "తీవ్రమైన మార్పు అవసరం" అని సూచించిందని లాపిడ్ చెప్పారు.

కాగా,12ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన బెంజిమిన్ నెతన్యాహు పాలనకు తెరదించుతూ గతేడాది జనవరిలో ఇజ్రాయెల్ ప్రధానిగా నాఫ్తాలి బెన్నెట్ అధికారాన్ని చేపట్టారు. పరస్పర విరుద్ధ సిద్దాంతాలు, భావజాలాలతో కూడిన ఎనిమిది పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి బెన్నెట్‌ నేతృత్వం వహించారు. బెన్నెట్ కు మద్దతిచ్చిన కూటమిలో అరబ్ పార్టీతో పాటు.. అతివాద, వామపక్ష పార్టీలున్నాయి. ఈ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టిన బెన్నెట్‌ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగాల్సి ఉంది. ధికారం చేపట్టినప్పటి నుంచి 8 పార్టీల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఈ క్రమంలో కూటమితో కలిసి ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. ఎనిమిది పార్టీలతో కలిసి ఏర్పడిన ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లడంలో బెన్నెట్ విఫలమయ్యారు.

Wife Kills Husband : జీతం తక్కువ అని..భర్తను దారుణంగా హత్య చేసిన భార్య!

మరోవైపు 2 నెలలకు పైగా పార్లమెంటులో మెజారిటీ లేకుండానే కొనసాగారు.ఈ నేపథ్యంలోనే తాజాగా నిర్వహించిన చర్చలు పార్లమంట్ రద్దుకు దారి తీశాయి. ఈ మేరకు కూటమి నేతలు అంగీకారానికి వచ్చారు. దేశంలో త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇవి మూడేళ్ల వ్యవధిలో జరిగే ఐదో ఎన్నికలు కానున్నాయి. ప్రజా సంక్షేమం కంటే స్వప్రయోజనాలకే రాజకీయ పార్టీలు పెద్దపీట వేస్తుండటంతో అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకావడం లేదు. పర్యవసానంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది

Published by:Venkaiah Naidu
First published:

Tags: Israel

ఉత్తమ కథలు