హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

ఇజ్రాయెల్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్.. ఈసారి అధికారం పీఠం ఎవరిది?

ఇజ్రాయెల్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్.. ఈసారి అధికారం పీఠం ఎవరిది?

ఓటు వేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాన నేతాన్యహు,ఆయన భార్య సారా

ఓటు వేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాన నేతాన్యహు,ఆయన భార్య సారా

ఎన్నికలకు సంబంధించి బుధవారం ఉదయం ప్రాథమిక ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఫలితాలు వెల్లడైన వెంటనే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలు ప్రయత్నించే అవకాశం ఉంది.

ఇజ్రాయెల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఆసక్తి రేపుతున్నాయి.ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నేతన్యాహు మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు తగ్గినట్టే కనిపిస్తోంది.ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. నేతన్యాహు నేత్రుత్వంలోని లికుద్ రైట్ వింగ్ పార్టీకి 30 నుంచి 33 సీట్లకు మించే అవకాశం లేదని తెలుస్తోంది.మాజీ మిలటరీ చీఫ్ బెన్నీ గంట్జ్ నేత్రుత్వంలోని బ్లూ&వైట్ అలియెన్స్ పార్టీకి 32 నుంచి 34 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తం 120 సీట్లు ఉన్న ఇజ్రాయెల్ పార్లమెంటులో 13 సీట్లతో మూడో అతిపెద్ద పార్టీగా అరబ్ పక్షాలు నిలవనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అలాగే యూదుల పార్టీలైన షా &యునైటెడ్ తొరాహ్‌‌లకు 8,9 సీట్లు, రైట్ వింగ్ అయిన యమినా పార్టీకి 7 సీట్లు,లెఫ్ట్ వింగ్ అయిన లేబర్ గెషర్ & డెమోక్రాటిక్ యూనియన్ పార్టీలకు 6,5 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు వెల్లడవుతోంది.


ఎన్నికలకు సంబంధించి బుధవారం ఉదయం ప్రాథమిక ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఫలితాలు వెల్లడైన వెంటనే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలు ప్రయత్నించే అవకాశం ఉంది.ఎన్నికల ఫలితాలపై బుధవారం నేతన్యాహు చేసిన వ్యాఖ్యల్లో ఓటమి సంకేతాలు కనిపించాయి. అదే సమయంలో గంట్జ్

వ్యాఖ్యల్లో గెలుస్తామన్న ధీమా వ్యక్తమైంది. 'ఎన్నికల క్యాంపెయిన్‌లో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. ఏదేమైనా ఒక విషయం క్లియర్.. ఇజ్రాయెల్ ఇప్పుడో చారిత్రక సందర్భంలో ఉంది. మనకెన్నో గొప్ప అవకాశాలు దక్కాయి. అలాగే సవాళ్లను ఎదుర్కొన్నాం.' అని నేతన్యాహు చెప్పారు. గంట్జ్ మాట్లాడుతూ.. 'అంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. అయితే ఎన్నికల మిషన్‌ను మనం చాలా సమర్థవంతంగా పూర్తి చేశాం.ఇకముందు కూడా ఇదే ఐక్యత,సానుకూలత అవసరం.' అని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం బెన్నీ గంట్జ్ నేత్రుత్వంలోని బ్లూ&వైట్ అలియెన్స్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది.మిగతా పార్టీల మద్దతును కూడగట్టగలిగితే ఆ పార్టీ అధికారాన్ని చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

First published:

Tags: Israel Elections 2019, Isreal

ఉత్తమ కథలు