• HOME
 • »
 • NEWS
 • »
 • INTERNATIONAL
 • »
 • ISRAEL CORONA HOW ISRAEL ERADICATE COVID 19 IS INDIA SHOULD LEARN SOMETHING FROM ISRAEL HERE IS THE SIMPLE ANALYSIS NK

Israel: కరోనాను జయించిన ఇజ్రాయెల్... ఎలా సాధ్యమైంది... భారత్ పాఠాలు నేర్చుకోవాలా?

Israel: కరోనాను జయించిన ఇజ్రాయెల్... ఎలా సాధ్యమైంది... భారత్ పాఠాలు నేర్చుకోవాలా?

కరోనాను జయించిన ఇజ్రాయెల్... ఎలా సాధ్యమైంది... భారత్ పాఠాలు నేర్చుకోవాలా? (image credit - twitter - reuters)

Israel Corona: కేంద్ర ప్రభుత్వం... ఇజ్రాయెల్‌ని చూసి గుణపాఠాలు నేర్చుకోవాలని శివసేన విమర్శలు చేస్తోంది. అసలు ఇజ్రాయెల్ ఏం చేసింది? ఆ దేశాన్ని చూసి ఇండియా పాఠాలు నేర్చుకోవాలా? విశ్లేషించుకుందాం.

 • Share this:
  Israel: ఈ ప్రపంచంలో కరోనాను పూర్తిగా జయించిన దేశం ఒక్కటీ లేదు. ఆ మధ్య మొదటి వేవ్‌లో న్యూజిలాండ్... కరోనాను జయించినట్లు ప్రకటించుకున్నా... అక్కడ కూడా ఇప్పుడు రోజూ ఒకటో, రెండో కేసులు వస్తూనే ఉన్నాయి. తాజాగా న్యూజిలాండ్ కరోనాను జయించిందనీ... దాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోవాలని శివసేన, కాంగ్రెస్ లాంటి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఈ విషయంలో 2 అంశాలున్నాయి. కరోనాను కంట్రోల్ చెయ్యడంలో ఇజ్రాయెల్ చాలా వరకూ విజయం సాధించిన మాట వాస్తవమే. కానీ... దాన్ని చూసి... ఇండియా గుణపాఠాలు నేర్చుకోవాలనుకోవడం కరెక్టు కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇందుకు చాలా అంశాలున్నాయి. ఎలాగో చూద్దాం.

  ఇజ్రాయెల్ ఏం సాధించింది?
  ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకూ 8,37,218 కరోనా కేసులు వచ్చాయి. రోజూ కత్తగా 150 దాకా కేసులు, 5 నుంచి 10 మరణాలు నమోదవుతున్నాయి. అందువల్ల ఇజ్రాయెల్... తాము కరోనాను దాదాపు జయించినట్లుగా చెప్పుకుంటోంది. పరిమాణంలో తెలంగాణ అంత సైజున్న ఇజ్రాయెల్... కరోనా వ్యాక్సిన్లను వేసే విషయంలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ప్రపంచంలోనే వ్యాక్సిన్లను పద్ధతిగా వేసిన దేశంగా గుర్తింపు పొందింది. ఆ దేశంలోని జనాభాలో... 53 శాతం మంది... రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. ఫలితంగా అస్పత్రి పాలవుతున్న వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. డిసెంబర్ నుంచి వ్యాక్సినేషన్ మొదలవ్వడంతో... జనవరి మధ్య వరకూ భారీగా పెరిగిన కేసులు... ఇప్పుడు పెద్దగా నమోదవ్వట్లేదు. ఇప్పుడు అక్కడ స్కూళ్లు తిరిగి తెరిచారు. ఆదివారం నుంచి ప్రైమరీ, సెకండరీ స్కూళ్లు ఓపెన్ అయ్యాయి. అలాగే... ఏడాది నుంచి అమల్లో ఉన్న మాస్క్ తప్పనిసరి అనే నిబంధనను ఎత్తివేశారు. గుంపులుగా ఉన్న చోట మాత్రం మాస్క్ వాడమని చెప్పారు. మే నుంచి వ్యాక్సిన్ వేసుకున్న విదేశీయులను తమ దేశంలోకి ఆహ్వానిస్తామని అక్కడి పాలకులు ప్రకటించారు. ఐతే... ఇప్పుడు వేస్తున్న వ్యాక్సిన్లతో కరోనా పూర్తిగా పోయే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే బూస్టర్ వ్యాక్సిన్ల తయారీ మొదలైంది. సో... ఇజ్రాయెల్ పూర్తిగా కరోనా నుంచి బయటపడిపోయినట్లు భావించకూడదు అంటున్నారు నిపుణులు.

  ఇండియా పాఠాలు నేర్చుకోవాలా?
  కరోనా విషయంలో ఇజ్రాయెల్‌కీ ఇండియాకీ పోలిక కరెక్టు కాదు అంటున్నారు విశ్లేషకులు. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రతీ విషయంలో టెక్నాలజీని బాగా వాడుకునే దేశం. ఇండియాలో టెక్నాలజీ అంతంతమాత్రమే. ఇజ్రాయెల్ మొత్తం జనాభా 8,789,774. అంటే హైదరాబాద్ జనాభా కంటే తక్కువ. అందువల్ల వారిని కంట్రోల్ చెయ్యడానికీ, వ్యాక్సిన్లు వెయ్యడానికీ వీలైంది. ఇండియా జనాభా 130 కోట్ల మందికి పైనే. ఇంత మంది జనాభాను కంట్రోల్ చెయ్యడం, ఒకే తాటిపై నడిపించడం ఎలాంటి దేశానికైనా కష్టమే. పైగా ఇండియా అంతగా అభివృద్ధి చెందిన దేశం కాదు. కాబట్టి... ఇలాంటి దేశంలో కరోనా లాంటి వైరస్‌లు వస్తే... వాటి వ్యాప్తి ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ... మొదటి వేవ్‌ని ఇండియా విజయవంతంగా ఎదుర్కొంది. రెండోవేవ్ విషయంలో కాస్త తడబడినా... పోరాటం సాగిస్తూనే ఉంది. అలాంటి సమయంలో... ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశం ఏదో సాధించిందని... భారత్‌ని విపక్షాలు తక్కువ చేయడం సరైన అభిప్రాయం కాదని విశ్లేషకులు అంటున్నారు.

  ఇది కూడా చదవండి: Gold rate today: 19 రోజుల్లో రూ.3,430 పెరిగిన బంగారం... ఇక దూసుకుపోతుందా?

  ఇజ్రాయెల్‌కి పొంచి ఉన్న ముప్పు:
  ఫైజర్ వ్యాక్సిన్‌పై ఆధారపడిన ఇజ్రాయెల్ ప్రస్తుతానికి కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటున్నా... ఆ దేశ పాలకులే అప్పుడే అయిపోలేదు అంటున్నారు. కారణం... తాజా కేసుల్లో దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ అక్కడ కనిపిస్తోంది. అది థర్డ్ వేవ్‌కి దారి తీస్తుందేమో అని టెన్షన్ పడుతున్నారు. ఇండియాకీ ఈ సమస్య ఉంది. ఇండియా త్వరగా సెకండ్ వేవ్‌ని జయించకపోతే... థర్డ్ వేవ్ మరింత బలంగా, ప్రమాదకరంగా ఉండొచ్చంటున్న నిపుణులు... అది వచ్చేలోపే ఇండియా సెకండ్ వేవ్ నుంచి బయటపడాలని అంటున్నారు. మరో దేశంతో పోల్చుకునే బదులుగా... ఆయా దేశాల్లో సక్సెస్ అయిన ఫార్ములాలను ఇండియాలోనూ అమలుచేసుకుంటూ ముందుకు అడుగులు వెయ్యాలని సూచిస్తున్నారు.
  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు