హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia-Ukraine: ఉక్రెయిన్‌కు హైటెక్ ఆయుధాలను ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరిస్తుందా..?ఆ దేశ ఆలోచన అదేనా..

Russia-Ukraine: ఉక్రెయిన్‌కు హైటెక్ ఆయుధాలను ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరిస్తుందా..?ఆ దేశ ఆలోచన అదేనా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉక్రెయిన్‌పై రష్యా(Russia) యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు సైనిక సహాయంపై ఇజ్రాయెల్ ఆలోచిస్తోంది. ప్రారంభంలో ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిషేధించిన తర్వాత, కీవ్‌కు ఆయుధాలు అందించడంపై మనసు మార్చుకొంటున్నట్లు టెల్ అవీవ్ కనిపిస్తోంది.

ఇంకా చదవండి ...

ఉక్రెయిన్‌పై రష్యా(Russia) యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు సైనిక సహాయంపై ఇజ్రాయెల్ ఆలోచిస్తోంది. ప్రారంభంలో ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిషేధించిన తర్వాత, కీవ్‌కు ఆయుధాలు అందించడంపై మనసు మార్చుకొంటున్నట్లు టెల్ అవీవ్ కనిపిస్తోంది. ఉక్రెయిన్‌కు సైనిక, మానవతా సహాయాన్ని అందించాలని ఇజ్రాయెల్‌(Israel) యోచిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గ్రౌండ్‌ ట్రూప్స్‌ను(Ground Troops) ప్రొటెక్ట్‌ (Protect) చేసే డిఫెన్సివ్‌ సిస్టమ్స్‌(Defense System), పెర్సనల్‌ కాంబాట్‌ గేర్‌, వార్నింగ్‌ సిస్టమ్స్‌ని(Warning System) అందించాలని ఇజ్రాయెల్‌ భావిస్తోంది.

పాశ్చాత్య మిత్రదేశాల ఒత్తిడి, రష్యాతో(Russia) వేగంగా క్షీణిస్తున్న సంబంధాల మధ్య ఇజ్రాయెల్‌ చర్యలు మొదలయ్యాయి. అయినప్పటికీ ఉక్రెయిన్‌కు అధునాతన ఐరన్ డోమ్(Iron Dome) మిసైల్‌ సిస్టమ్‌ (Missile System) అందించడానికి మాత్రం ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు.

కీవ్‌కు ఆయుధాలను పంపకుండా ఎస్టోనియాను అడ్డుకోని ఇజ్రాయెల్..

ఇజ్రాయెల్‌ తయారు చేసిన ఆయుధాలను ఉక్రెయిన్‌కు ఇవ్వకుండా ఇజ్రాయెల్‌ అడ్డుకోలేదని మే 2న ఎస్టోనియన్ FM ఎవా-మరియా లిమెట్స్ ధ్రువీకరించింది. ఉక్రెయిన్‌కు ఎస్టోనియా బ్లూ స్పియర్ మిసైల్‌ సిస్టమ్స్‌, స్పైక్ యాంటీ ట్యాంక్‌ను పంపవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన యాంటీ ట్యాంక్ మిసైల్స్‌లో స్పైక్ ఒకటని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఉక్రెయిన్‌కు 200 మిలియన్‌ యూరోల సైనిక, పౌర సహాయాన్ని ఎస్టోనియా అందించింది. ఇప్పటికే కీవ్‌కు FGM-148 జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైల్స్‌, D-30 122mm హోవిట్జర్లను ఎస్టోనియా అందించింది. ఉక్రెయిన్‌కు అదనపు భారీ ఆయుధాలను సరఫరా చేయడానికి బాల్టిక్ దేశం సిద్ధంగా ఉంది. పాశ్చాత్య దేశాల ఆయుధాలను ఉపయోగించడానికి ఉక్రేనియన్ డిఫెన్స్ ఫోర్సెస్‌కు శిక్షణను ఇవ్వడానికి కూడా ఎస్టోనియా సిద్ధంగా ఉంది.

Russia: మాస్కో సమీపంలో కనిపించిన పుతిన్ 'డూమ్‌ డే' విమానం.. ఆందోళనలో పశ్చిమ దేశాలు.. కారణం ఏంటంటే..


ఉక్రెయిన్ యుద్ధంపై ఇజ్రాయెల్ తటస్థ వైఖరి మారుతుందా..?

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ఇప్పటివరకు ఇజ్రయిల్ తటస్థంగానే వ్యవహరించింది. యూఎస్‌, బాల్టిక్ దేశాలను ఇజ్రాయెల్‌ తయారు చేసి ఆయుధాలను ఉక్రెయిన్‌కు ఇవ్వకుండా లైసెన్స్ పరిమితులను అమలు టెల్ అవీవ్ చేసింది. ఇంతకుముందు కీవ్‌కు ఆయుధాలను ఇవ్వకుండా బాల్టిక్ దేశాలైన ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియాను ఇజ్రాయెల్ నిషేధించింది. ఉక్రెయిన్‌కు ఐరన్ డోమ్ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ బదిలీ చేయాలన్న యూఎస్‌ ప్రతిపాదనను కూడా ఇజ్రాయెల్ తిరస్కరించింది. అయితే మార్చిలో రష్యా దాడిని ఖండిస్తూ UNGA తీర్మానానికి అనుకూలంగా ఇజ్రాయెల్ ఓటు వేసింది.

ఇజ్రాయెల్‌, రష్యా మధ్య విభేదాలు ఉన్నాయా..?

అడాల్ఫ్ హిట్లర్‌కు యూదుల వారసత్వం ఉందని రష్యన్ FM లావ్రోవ్ చేసిన వ్యాఖ్యలతో చెడిన ఇజ్రాయెల్, రష్యా మధ్య సంబంధాలు ఉన్నాయి. జెలెన్స్కీ తమకు నాజీ మూలాలు లేవని యూదులమనే వాదనను ముందుకు తెచ్చారని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. నేను తప్పు కావచ్చు, కానీ హిట్లర్‌కు కూడా యూదు మూలాలు ఉన్నాయి, కాబట్టి ఆ వాదనలో అర్థం ఏమీ లేదని లావ్రోవ్‌ పేర్కొంది. జెలెన్స్కీ యూదు, మాస్కో "డి-నాజిఫైయింగ్" ఉక్రెయిన్ వాదనను సమర్థించడానికి లావ్‌రోవ్ ప్రయత్నిస్తోంది. రష్యా విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ మండిపడ్డారు. ఇలాంటి అబద్ధాలు చరిత్రలో అత్యంత భయంకరమైన నేరాలకు యూదులను బాధ్యులను చేస్తూ నిందించేందుకు ఉన్నాయని నఫ్తాలీ బెన్నెట్ చెప్పారు.

లావ్రోవ్ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యైర్ లాపిడ్ తీవ్రంగా ఖండించింది. సెర్గీ లావ్‌రోవ్ వ్యాఖ్యలు క్షమించరానివి, హిట్లర్ యూదుల సంతతికి చెందినవాడు కాదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి తెలిపారు. హోలోకాస్ట్ సమయంలో యూదులు తమను తాము చంపుకోలేదని, రష్యాతో సత్సంబంధాలు కొనసాగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని, కానీ ఒక పరిమితి ఉంటుందని, రష్యా ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు, యూదు ప్రజలకు క్షమాపణ చెప్పాలని యైర్‌ లాపిడ్‌ డిమాండ్‌ చేశారు. ఇజ్రాయెల్ కీవ్‌లో "నయా-నాజీ పాలన"కు మద్దతు ఇస్తోందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఇజ్రాయెల్‌ మాస్కోతో తన సంబంధాన్ని కొనసాగిస్తుందా? అని జెలెన్స్కీని ప్రశ్నించగా అతడు ఇలా అన్నాడు..ఈ మాటలకు సంబంధించి ఇజ్రాయెల్‌లో పెద్ద కుంభకోణం జరుగుతోందని, మాస్కో నుండి ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు అన్నాడు.

PM Modi: ఒకేసారి 5దేశాల అధినేతలతో మోదీ రౌండ్ టేబుల్ మీట్.. అందులో నలుగురు స్టార్ మహిళలే!


ఇజ్రాయెల్ రాయబారి మాస్కోలో ఉంటారా? వారి కొత్త స్థానం ఏది? రష్యాతో సంబంధాలు యథావిధిగా ఉంటాయా? అనే ప్రశ్నలకు అతడు సమాధానం చెప్పలేదు. ఇజ్రాయెల్‌లో ఉన్న 500,000 మంది ఉక్రేనియన్ ప్రవాసులు, 400,000 మంది రష్యన్ వలసదారులు.. అందువల్ల రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కూడా ఇజ్రాయెల్‌లో దేశీయ రాజకీయ సమస్య ఏర్పడింది. సిరియాలో స్వేచ్ఛను నిలుపుకోవడానికి రష్యాతో సంబంధాలను కొనసాగించాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. అప్పుడే ఇరాన్‌కు చెక్ పెట్టవచ్చనే వాదన కూడా వినపడుతోంది. అయితే మాస్కోను పట్టించుకోకుండా ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వాలనే యోచనలో ఇజ్రాయెల్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడానికి ఇజ్రాయెల్ విముఖత చూపడంపై బెన్నెట్ ప్రభుత్వం ఆందోళన ఆందోళన వ్యక్తం చేస్తోంది.

First published:

Tags: Israel, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు