ఇస్లామోఫోబియాతో విభజన.. ముస్లింలకు తీవ్ర ఇబ్బంది: ఐరాసలో ఇమ్రాన్ ఖాన్

ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోదీ తర్వాత పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. ఇస్లామోఫోబియా, వాతావరణ మార్పులు, ఆర్థిక పరిస్థితులతో పాటు మరికొన్ని అంశాలపై ప్రసంగించారు.

news18-telugu
Updated: September 27, 2019, 10:54 PM IST
ఇస్లామోఫోబియాతో విభజన.. ముస్లింలకు తీవ్ర ఇబ్బంది: ఐరాసలో ఇమ్రాన్ ఖాన్
ఐరాసలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం
news18-telugu
Updated: September 27, 2019, 10:54 PM IST
అమెరికాలో ట్విన్ టవర్స్ మీద 9/11 ఎటాక్స్ జరిగిన తర్వాత ఇస్లామోఫోబియా పెరిగిపోయిందని, ముసుగు వేసుకోవడం ముస్లింలకు వ్యతిరేకంగా ఓ ఆయుధంలా తయారైందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోదీ తర్వాత పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. ఇస్లామోఫోబియా, వాతావరణ మార్పులు, ఆర్థిక పరిస్థితులతో పాటు మరికొన్ని అంశాలపై ప్రసంగించారు. పాశ్చాత్య దేశాల్లో కోట్లాది మంది ముస్లింలు మైనారిటీలుగా బతుకుతున్నారని చెప్పారు. ‘ఇస్లామోఫోబియా ప్రజలను విభజిస్తోంది. ముసుగు ధరించడం ఓ ఆయుధంలా మారిపోయింది. ఓ మహిళ దుస్తులను తీసేయొచ్చు కానీ, మరిన్ని దుస్తులు ధరించలేని పరిస్థితి ఉంది. ప్రత్యేకించి 9/11 దాడి తర్వాత పాశ్చాత్య దేశాల నాయకులు కొందరు ఇస్లాంకి, టెర్రరిజంకి ముడిపెట్టడం వల్ల ఇలా జరిగింది.’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అతివాద ఇస్లాం అనేది లేదని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. వారు చేసిన పని వల్ల ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ‘న్యూయార్క్‌లో కూర్చున్న ఓ వ్యక్తి సంప్రదాయ ముస్లింలు, అతివాద ముస్లింలు అని ఎలా భేదం చూపించగలరు?’ అని ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు.

First published: September 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...