వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు మలేషియా షాక్..

Ban on Zakir Naik Public Speeches in Malaysia : జకీర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో ఆయన క్షమాపణ చెప్పారు. తాను జాతి విద్వేషిని కాదని, శత్రువులే లేనిపోనివి ఆపాదించి తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు.

news18-telugu
Updated: August 20, 2019, 12:53 PM IST
వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు మలేషియా షాక్..
జకీర్ నాయక్ (File Photo)
  • Share this:
వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు మలేషియా షాక్ ఇచ్చింది. ఇకపై బహిరంగ ప్రసంగాలు ఇవ్వకుండా నిషేధం విధించింది. ఒక మత ప్రబోధకుడిగా జకీర్ నాయక్ ఇస్లాం గురించి మాట్లాడవచ్చునని.. అంతే తప్ప మలేషియా అంతర్గత మత వ్యవహారాల్లో తలదూర్చవద్దని చెప్పింది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకునే మలేషియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మలేషియన్ పోలీసులు తెలిపారు.

అగస్టు 19న జకీర్ నాయక్ మలేషియాలో ఇచ్చిన స్పీచ్ తీవ్ర వివాదాస్పదమైంది. మలేషియాలోని హిందువులు భారతదేశంలోని ముస్లింల కంటే 100 రెట్లు ఎక్కువ హక్కులను కలిగి ఉన్నారని ఆయన వ్యాఖ్యానించడం దుమారం రేపింది. ఇక మలేషియాలోని చైనీస్.. గెస్ట్‌ల లాంటి వారని ఆయన వ్యాఖ్యానించారు.జకీర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో ఆయన క్షమాపణ చెప్పారు. తాను జాతి విద్వేషిని కాదని, శత్రువులే లేనిపోనివి ఆపాదించి తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. ఏ ఒక్క కమ్యూనిటీనో.. వ్యక్తినో కించపరచడం తన ఉద్దేశం కాదన్నారు. తాను తప్పుడు వ్యాఖ్యలు చేయనప్పటికీ.. తన వల్ల బాధపడినవారికి క్షమాపణ చెబుతున్నానని అన్నారు. నాయక్ వ్యాఖ్యలపై అక్కడి రాజకీయ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. నాయక్‌ను శాశ్వతంగా దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.నాయక్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సోమవారం మలేషియా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని దాదాపు 10గంటల పాటు విచారించారు.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...