హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

XI Jinping: చైనా అధ్యక్షుడు హౌస్‌ అరెస్ట్ అయ్యారా? బీజింగ్ ఎయిర్‌పోర్టులో తాజా పరిస్థితి ఇది

XI Jinping: చైనా అధ్యక్షుడు హౌస్‌ అరెస్ట్ అయ్యారా? బీజింగ్ ఎయిర్‌పోర్టులో తాజా పరిస్థితి ఇది

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్

China: SCO సదస్సు తర్వాత జిన్‌పింగ్ కనిపించకపోవడం, బీజింగ్ వైపు ఆర్మీ వాహనాలు పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు వీడియోలు వైరల్ కావడం, బీజింగ్ ఎయిర్‌పోర్టులో  విమానాలను రద్దు చేయడం వంటి పరిణామాలను చూస్తుంటే.. చైనాలో నిజంగానే ఏదో జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఇప్పుడు ప్రపంచమంతటా చైనా  (China) అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) గురించే చర్చ జరుగుతోంది. ఆయన ఎక్కడున్నారు? జిన్‌పింగ్‌పై చైనా సైన్యం (China Army) తిరుగుబాటు చేసిందా? జిన్‌పింగ్‌ను హౌస్ అరెస్ట్ చేసిందా? అంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పొల్గొన్న జిన్‌పింగ్.. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. అక్కడి నుంచి చైనా రాజధాని బీజింగ్ చేరిన వెంటనే.. ఆయన్ను పీపుల్ లిబరేషన్ ఆర్మీ (PLA) హౌస్ అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బీజింగ్‌కు ఆర్మీ వాహనాలను తరలివెళ్తున్నాయని అక్కడి జర్నలిస్టులు కూడా సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. 80 కి.మీ. మేర ఈ వాహనాల ర్యాలీ ఉందని జెన్నిఫర్ జెంగ్ అనే జర్నలిస్ట్ పోస్ట్ చేశారు.

  అటు బీజింగ్‌ ఎయిర్‌పోర్టులో భారీగా విమానాలను రద్దు చేశారట. విమాన రాకపోకల పెద్ద ఎత్తున నిలిపివేసినట్లు సోషల్ మీడియాలో పెద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దాదాపు 60 శాతం విమానాలను క్యాన్సిల్ అయ్యాయని సమాచారం. విమాన రాకపోకల వివరాలను తెలిపే 'ఫ్లైట్ రాడార్ 24'లోనూ అలాంటి సమాచారమే ఉంది. బీజింగ్ మీదుగా రాకపోకలు సాగించే విమానాల సంఖ్య చాలా తక్కువగా చూపిస్తోంది. ప్రపంచంలోనే విమానాల రద్దీ ఎక్కువగా ఉండే ఎయిర్‌పోర్టుగా బీజింగ్ ఎయిర్‌పోర్టుకు పేరుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పోల్చితే.. విమానాల రాకపోకలు ఎక్కువగా సాగుతాయి. కానీ ఇప్పుడు అక్కడ ఎప్పుడూ లేనంత తక్కువ సంఖ్యలో విమానాలు తిరుగుతున్నాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టు కంటే తక్కువ రద్దీ ఉంది.

  ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఢిల్లీ, బీజింగ్ ఎయిర్‌పోర్టులో రాకపోకలు (Image:flightradar24)

  SCO సదస్సు తర్వాత జిన్‌పింగ్ కనిపించకపోవడం, బీజింగ్ వైపు ఆర్మీ వాహనాలు పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు వీడియోలు వైరల్ కావడం, బీజింగ్ ఎయిర్‌పోర్టులో  విమానాలను రద్దు చేయడం వంటి పరిణామాలను చూస్తుంటే.. చైనాలో నిజంగానే ఏదో జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. చైనాలో మాజీ మంత్రులకు ఉరిశిక్షలు వేయడం, ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, కరోనాను కట్టడి చేయలేకపోవడం వంటి పలు కారణాల వల్ల అధ్యక్షుడి తీరుపై ఆర్మీ అసంతృప్తిగా ఉందని..ఈ క్రమంలోనే తిరుగుబాటు చేసి.. జిన్‌పింగ్‌ను హౌస్ అరెస్ట్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ఆర్మీ జనరల్ లీ ఖయోమింగ్ (General Li Qiaoming) అధ్యక్ష బాధ్యతలు చేపట్టవచ్చని ప్రచారం జరుగుతోంది.

  కానీ చైనాలో సంక్షోభంపై  స్పష్టమైన సమచారం మాత్రం అధికారంగా బయటకు రాలేదు.  అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా దీనిపై వార్తలు రాయలేదు. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్ హౌస్ అరెస్ట్.. ఫేక్ న్యూస్ కావచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. షాంఘై సహకార సంఘం సదస్సులో అంతర్జాతీయ నేతలను కలిసి తర్వాత.. జిన్‌పింగ్ క్వారంటైన్లోకి వెళ్లి ఉండవచ్చని.. అంతేతప్ప ..  సైనిక తిరుగుబాటు వార్తల్లో నిజంలేకపోవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: China, Xi Jinping

  ఉత్తమ కథలు