Home /News /international /

IRISH MAN LOSES HIS MEMORY 10 MINUTES AFTER HAVING SEX WITH WIFE PVN

Man Loses Memory : భార్యతో శృంగారం..పది నిమిషాల్లో అంతా మర్చిపోతున్నాడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Man Loses Memory After Having Sex : ఓ వ్యక్తి తన భార్యతో శృంగారంలో పాల్గొన్న పది నిమిషాల తర్వాత అన్నీ మర్చిపోయాడు. రెండు మూడు రోజుల క్రితం ఏం జరిగిందన్నది అతనికి అస్సలు గుర్తుకు రావడం లేదట. ముందురోజు తన పెళ్లి రోజు కదా.. అదెలా మర్చిపోయా అంటూ ఆశ్చర్యపోయాడు.

ఇంకా చదవండి ...
Man Loses Memory After Having Sex : ఓ వ్యక్తి తన భార్యతో శృంగారంలో పాల్గొన్న పది నిమిషాల తర్వాత అన్నీ మర్చిపోయాడు. రెండు మూడు రోజుల క్రితం ఏం జరిగిందన్నది అతనికి అస్సలు గుర్తుకు రావడం లేదట. ముందురోజు తన పెళ్లి రోజు కదా.. అదెలా మర్చిపోయా అంటూ ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటన ఐర్లాండ్​లో జరిగింది. అరుదైన ఈ కేసు గురించి ఐరిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించారు. ఐరిష్‌ జర్నల్‌ కథనం ప్రకారం.. ఇటీవల ఓ సాయంత్రం 66 ఏళ్ల ఐరిష్‌ వ్యక్తి ఇంట్లో అతడి పెళ్లి రోజు వేడుక ఘనంగా జరిగింది. అయితే ఆ మరుసటి రోజు అతడు తన భార్యతో శృంగారం చేశారు. భార్యతో శృంగారం చేసిన పది నిమిషాలకే మతిమరుపునకు గురయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి తన మొబైల్లో తేదీని చూసుకొని, ముందు రోజు తన పెళ్లి రోజు కదా అదెలా మర్చిపోయా అంటూ ఆశ్చర్యానికి గురయ్యారు.

కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెబితే వారు మరింత షాక్‌కు లోనయ్యారు. దీంతో ముందు రోజు సాయంత్రం జరిగిన వేడుకలను పదే పదే జ్ఞప్తికి తెచ్చేందుకు భార్యాపిల్లలు ప్రయత్నించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అయితే తన పేరు, వయసు, పాత విషయాలను మాత్రం ఆ వ్యక్తి గుర్తుపెట్టుకోవడం విశేషం. ఇలా మర్చిపోవడాన్ని ట్రాన్సియెంట్‌ గ్లోబల్‌ అమ్నీషియా(TGA)"స్వల్పకాలిక మతిమరుపు"అంటారని వైద్యులు తెలిపారు. ఇది అరుదైన వ్యాధి అని, 50-70 ఏండ్ల వయస్సున్నవారిలో కనిపిస్తుందని పేర్కొన్నారు. అయితే కొన్ని గంటల్లోనే వారికి తిరిగి జ్ఞాపకశక్తి వస్తుందన్నారు. అయితే 2015లో కూడా ఇతను  టీజీఏ ప్రభావానికి లోనయ్యారు. ఆ సమయంలోనూ భార్యతో శృంగారం చేసిన తర్వాతే కావడం గమనార్హం.

ALSO READ  Brazil Floods : బ్రెజిల్‌లో భారీ వ‌ర్షాలు,వరదలు..31మంది మృతి

ఆస్ట్రేలియాలో (Australia) 'పర్మినెంట్ స్మైల్’ (Permanent Smile) అనే మెడికల్ కండిషన్‌తో పుట్టిన పాప ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమయింది. ఈ చిన్నారి గురించి తెలుసుకున్న నెటిజన్లు అయ్యో పాపం అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. పాప ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. అరుదైన మెడికల్ కండిషన్‌ (Rare medical condition‌)తో బాధపడుతున్న ఈ చిన్నారి పేరు ఐలా సమ్మర్ ముచ్చా (Ayla Summer Mucha). ఈ మెడికల్ కండిషన్‌ గురించి అవగాహన కల్పించడానికి, పెంచుకోవడానికి తల్లిదండ్రులు సోషల్ మీడియాను వేదికగా ఉపయోగిస్తున్నారు. ఐలా డిసెంబర్ 2021లో బైలేటరల్ మాక్రోస్టోమియాతో జన్మించింది. బైలేటరల్ మాక్రోస్టోమియా అంటే శిశువు కడుపులో ఉన్నప్పుడే నోటి చివర భాగాలు సరిగ్గా కలిసిపోని ఒక మెడికల్ కండిషన్‌ నోటి చివరి భాగాలు కట్ చేసినట్టుగా.. పెదాలు సాగి సాగిపోయినట్టుగా కనిపించడం వల్ల పాప ఎప్పుడూ నవ్వుతున్నట్టుగానే కనిపిస్తుంది.

దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన ఐలా తల్లిదండ్రులు, క్రిస్టినా వెర్చర్ (21), బ్లైజ్ ముచా (20) ఈ విషయం గురించి తెలుసుకున్నప్పుడు షాక్ అయ్యారు. "బ్లేజ్‌కి, నాకు ఈ పరిస్థితి గురించి తెలియదు. నేను మాక్రోస్టోమియాతో జన్మించిన వారిని ఎప్పుడూ కలవలేదు. మా బిడ్డకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలిసినప్పుడు దిగ్భ్రాంతికి గురయ్యాను" అని చిన్నారి తల్లి వెర్చర్ మీడియాకి చెప్పుకొచ్చారు. వెర్చర్ దంపతులు తమ కుమార్తెను మొదటిసారి చూసినప్పుడు నోరు చాలా వింతగా కనిపించింది. ఆ మరుక్షణమే వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అలా ఉండటానికి కారణం ఏంటో డాక్టర్లు కూడా వెంటనే చెప్పలేకపోయారు. దీంతో వారిలో ఆందోళన మరింత ఎక్కువైంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Memory

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు