37 ఏళ్ల తర్వాత ఐరీష్ సెలబ్రెటీ డాల్ఫిన్ మిస్సింగ్.. ఆందోళనలో స్థానికులు

ఐరీష్ సెలబ్రెటీ డాల్ఫిన్ కనిపించడం లేదంట. ఇక్కడ మనిషి కనిపించకపోతేనే పట్టించుకోవడం లేదు ఇంక డాల్ఫిన్ సంగతి ఎందుకనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.

news18-telugu
Updated: October 22, 2020, 2:57 PM IST
37 ఏళ్ల తర్వాత ఐరీష్ సెలబ్రెటీ డాల్ఫిన్ మిస్సింగ్.. ఆందోళనలో స్థానికులు
ఫంగీ డాల్ఫిన్ (Photo-Twitter/Fungie the Dolphin)
  • Share this:
ఐరీష్ సెలబ్రెటీ డాల్ఫిన్ కనిపించడం లేదంట. ఇక్కడ మనిషి కనిపించకపోతేనే పట్టించుకోవడం లేదు ఇంక డాల్ఫిన్ సంగతి ఎందుకనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇది సాదాసీదా డాల్ఫిన్ కాదు. 37 ఏళ్లుగా సందర్శకులను తన విన్యాసాలతో అబ్బుపరుస్తూ బోట్ టూర్లలో పాల్గొంటుంది. ఐర్లాండ్ లోని కౌంటీ కెర్రీలో డింగిల్ తీరంలో ఉన్న ఫంగీ అనే ఈ డాల్ఫిన్.. గిన్నిస్ రికార్డు హోల్డర్ కూడా. ఎక్కువ కాలం ఒంటరిగా జీవిస్తున్న డాల్ఫిన్ గా ఇది గిన్నిస్ బుక్ లో రికార్డు సొంతం చేసుకుంది. తాజాగా గత గురువారం నుంచి ఇది కనిపించకపోవడం స్థానికంగా చర్చనియాంశమైంది. స్థానికులు ఈ అంశంపై రకరకాల అభిప్రాయాలను వెల్లబుచ్చుతున్నారు.

5 గంటల కంటే ఎక్కువ సేపు కనిపించకుండా ఉండదు..

డింగిల్స్ తీరంలో ఈ డాల్ఫిన్ 1983 చేరిందని, గరిష్ఠంగా నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే కనిపించకుండా ఉంటుందని డింగిల్ డాల్ఫిన్ బోట్ టూర్స్ అధినేత జిమ్మీ ఫ్లానరీ తెలిపారు. 37 ఏళ్ల తర్వాత ఇది కనిపించకపోవడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ప్లానరీ.. ఈ డాల్ఫిన్ తో కలిసి బోట్ టూర్లను నిర్వహిస్తున్నారు. ఇది కనిపించకపోయినప్పటి నుంచి 12 బోట్లతో అన్వేషణ ప్రారంభించామని స్పష్టం చేశారు. ఇందుకోసం రెస్క్యూ బృందాలతో సోనార్ స్కాన్ ద్వారా కూడా వెతుకుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇంకా ఎలాంటి ఆధారం లభించలేదని వెల్లడించారు.

అధికారికంగా అన్వేషణ ఆపేశారు..
అయితే వారం రోజుల నుంచి వెతుకున్నా ఫంగీ ఆచుకీ లభ్యం కాకపోవడంతో అధికారిక అన్వేషణ ఆపివేశారు. అయితే స్థానికులు మాత్రం వెతుకులాడ కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. తమ జీవితంలో ఫంగీ భాగమైందని ఫ్లానరీ తెలిపారు. త్వరలో తిరిగి వస్తుందనే ఆశ మాకుందని ఆయన చెప్పారు.

డాల్ఫిన్ కు కోవిడ్-19 సెగ తాకిందా..
కోవిడ్-19 వల్ల దేశంలో పెట్టిన ఆంక్షల ప్రభావం పడి ఉంటుందని ఫ్లానరి అభిప్రాయపడ్డారు. దేశంలో మార్చి, ఏప్రిల్, మేలో లాక్ విధించారని అప్పుడు బోట్ టూర్లకు అంత ప్రాముఖ్యం లేదని చెప్పారు. అయితే ఇటీవలే ఆరు వారాల పాటు విధించిన లాక్ డౌన్ నిబంధనల వల్ల బోట్లు బయటకు వెళ్లలేదని చెప్పారు. ఎవ్వరూ కనిపించకపోవడం వల్ల ఫంగీ వెళ్లిపోయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కరోనాకు ముందు సీజన్ బాగుంటుందని, రోజూ 12 బోట్లు తిరిగుతాయని చెప్పారు. 50 మందికి ప్రత్యక్షంగా ఉపాధి, ఎంతో మందికి పరోక్షంగా లబ్ది చేకూరుతుందని ఫ్లానరీ తెలిపారు. ఆర్థికంగా కరోనా ప్రభావం తమకు అనుకూలంగా లేదని ఆయన అన్నారు.

డాల్ఫిన్ చనిపోయి ఉంటుందా..
ఏదిఏమైనప్పటికీ ఈ ఫంగీకి 40 ఏళ్లు ఉంటాయని ఐరీష్ వేల్ డాల్ఫిన్ గ్రూప్ సీఈఓ సైమన్ బెరో తెలిపారు. బాటిల్ నోస్ జాతికి చెందిన డాల్ఫిన్లు 30 నుంచి 40 ఏళ్ల వరకే జీవిస్తాయని, ఫంగీ కనిపంచకపోవడం ఊహించిందే అని అన్నారు. ఏదోక రోజు ఇది జరగాల్సిందేనని, చనిపోయి ఉంటుందోమోనని బెరో మీడియాకు వెల్లడించారు. అయితే ఈ విషయంలో ఇప్పుడు స్పష్టతకు రాలేమని తెలిపారు. అయితే ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని, సుదీర్ఘకాలం పాటు తన విన్యాసాలతో ప్రజల మనసులో నిలిచిందని స్పష్టం చేశారు.
Published by: Sumanth Kanukula
First published: October 22, 2020, 1:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading