Home /News /international /

IRAN US TENSION DONALD TRUMP REACTION ON IRAN MISSILE STRIKE SK

ఇరాన్ క్షిపణి దాడుల్లో ఎవరూ చనిపోలేదు.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

అమెరికా ఎంతో శక్తివంతమైన హైపర్ సోనిక్ మిసైల్స్‌ని తయారు చేస్తోందని.. తమ సైన్యం ఎంతో బలమైదన్నారు ట్రంప్. తమ ఆయుధ సంపత్తిని ఉపయోగించాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు.

అమెరికా ఎంతో శక్తివంతమైన హైపర్ సోనిక్ మిసైల్స్‌ని తయారు చేస్తోందని.. తమ సైన్యం ఎంతో బలమైదన్నారు ట్రంప్. తమ ఆయుధ సంపత్తిని ఉపయోగించాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు.

అమెరికా ఎంతో శక్తివంతమైన హైపర్ సోనిక్ మిసైల్స్‌ని తయారు చేస్తోందని.. తమ సైన్యం ఎంతో బలమైదన్నారు ట్రంప్. తమ ఆయుధ సంపత్తిని ఉపయోగించాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు.

    ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ చేసిన క్షిపణి దాడులపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.  ఇరాన్ దాడిలో ఏ ఒక్క అమెరికన్‌కూ గాయాలు కాలేదని తెలిపారు. తక్కువ నష్టం మాత్రమే జరిగిందని.. అమెరికన్ జవాన్లంతా క్షేమంగా ఉన్నారని ప్రకటించారు.   తాను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం ఇరాన్‌కు అణ్వాయుధాలు చిక్కనీయనని స్పష్టం చేశారు. అమెరికా ఎంతో శక్తివంతమైన హైపర్ సోనిక్ మిసైల్స్‌ని తయారు చేస్తోందని.. తమ సైన్యం ఎంతో బలమైదన్నారు ట్రంప్. తమ ఆయుధ సంపత్తిని ఉపయోగించాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ఆ అవసరం రాకూడదనే కోరుకుంటున్నట్లు పరోక్షంగా ఇరాన్‌ను హెచ్చరించారు. ఇరాన్ క్షిపణి దాడులపై వైట్ హౌస్‌లో 10 నిమిషాల పాటు మాట్లాడారు ట్రంప్.

    పశ్చిమాసియాలో ఉద్రిక్తలకు ఇరానే కారణం. ఇరాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. వేలాది మంది అమెరికా బలగాలను ఖాసిం సూలేమానీ చంపేశాడు. ఇటీవల ఇరాక్‌లో ఉన్న అమెరికన్ దాళాలపై దాడులు చేసేందుకు ప్లాన్ చేశారు. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో యూఎస్ ఎంబసీపై జరిగిన దాడి వెనక సూలేమానీ హస్తముంది. మరిన్ని దాడులు చేయాలనుకున్నాడు. అందుకే అతడిని హతమార్చాం. సూలేమానీని చంపండం తప్పేమీ కాదు. అతడి మరణం ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక. ఇరాన్ ఉగ్రవాదాన్ని మానుకునే వరకు మధ్యప్రాచ్యంలో శాంతి సాధ్యం కాదు. అమెరికా శాంతిని ప్రోత్సహిస్తుంది. ఇరాన్‌కు మంచి భవిష్యత్ ఉండాలని ఆశిస్తున్నా.
    డొనాల్డ్ ట్రంప్.


    మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బుధవారం ఇరాన్ దాడులు చేసిన విషయం తెలిసిందే. 15 క్షిపణులతో అల్ అసద్, ఎర్బిల్ బేస్‌లపై విరుచుకుపడింది. అమెరికా భద్రతా దళాలే లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడింది. క్షిపణి దాడుల్లో అమెరికాకు చెందిన 80 మంది టెర్రరిస్టులు హతమయ్యారని ఇరాన్ స్టేట్ టెలివిజన్ ప్రకటించుకుంది. యూఎస్ ఆర్మీ హెలికాప్టర్లు, ఆయుధ సామాగ్రి పెద్ద మొత్తంలో ధ్వంసమైందని వెల్లడించింది. ఇరాక్‌లో మరో 100 ప్రాంతాలను టార్గెట్ చేశామని.. అమెరికా కవ్వింపులకు పాల్పడితే గట్టి సమాధానం చెబుతామని ఇరాన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఐతే ఇరాన్ దాడుల్లో ఎవరూ చనిపోలేదని ట్రంప్ ప్రకటించారు.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Iran, Iran US Tension

    తదుపరి వార్తలు