ట్రంప్ పర్యటించిన అమెరికా సైనిక స్థావరమే ఇరాన్ టార్గెట్

Iran vs USA : 2018లో ఇరాక్‌లో ఆకస్మిక పర్యటన చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందర్శించిన అమెరికా సైనిక స్థావరమే లక్ష్యంగా ఇరాన్ క్షిపణిదాడులు జరిపింది

news18-telugu
Updated: January 8, 2020, 10:19 AM IST
ట్రంప్ పర్యటించిన అమెరికా సైనిక స్థావరమే ఇరాన్ టార్గెట్
ఇరాన్ క్షిపణి దాడులు
  • Share this:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2018 డిసెంబరు నెలాఖరులో ఇరాక్‌లో ఆకస్మిక పర్యటన చేయడం తెలిసిందే. ఇరాక్‌లో అమెరికా సేనలను కలిసేందుకు అప్పట్లో తన సతీసమేతంగా ట్రంప్ ఈ రహస్య పర్యటన చేపట్టారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం పశ్చిమ ప్రాంతంలోని ఆల్ అసద్ ఎయిర్‌బేస్‌ని ఆయన సందర్శించి, అక్కడ సేవలందిస్తున్న తమ బలగాలనుద్దేశించి మాట్లాడారు. అప్పట్లో ఇరాక్‌లో మూడు గంటల పాటు ట్రంప్ గడిపారు. ఇరాక్‌లోని మిగిలిన అమెరికా సైనిక స్థావరాలతో పోలిస్తే ఆల్ అసద్ ఎయిర్‌బేస్ సురక్షితమైనదని భావించడంతోనే ట్రంప్ పర్యటనకు ఆ స్థావరాన్ని ఎంచుకున్నారు.

అయితే గత రాత్రి ఇదే ఎయిర్‌బేస్ లక్ష్యంగా సేనలు క్షిపణి దాడులతో ఇరాన్ విరుచుకపడింది. ఆల్ అసద్‌తో పాటు ఇర్బిల్ ఎయిర్‌బేస్‌‌‌పై డజనుకు పైగా క్షిపణులతో దాడి చేసింది. ఇరాన్ క్షిపణి దాడుల్లో అమెరికా సైన్యానికి ఎలాంటి నష్టం జరిగిందన్న అంశంపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
First published: January 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు