అమెరికాతో యుద్ధానికి సిద్ధమన్న ఇరాన్... ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తారు?

America Vs Iran : అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ మాటల యుద్ధం కొనసాగుతోంది. అధినేతల ప్రకటనలతో ఆందోళనకర వాతావరణం కనిపిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 23, 2019, 6:45 AM IST
అమెరికాతో యుద్ధానికి సిద్ధమన్న ఇరాన్... ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తారు?
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు
  • Share this:
అమెరికా, ఇరాన్... ఈ రెండుదేశాలకూ ఏ చిన్న నష్టం జరిగినా... అది మొత్తం ప్రపంచానికే నష్టంగా మారుతుంది. కారణం ప్రపంచీకరణ. అగ్రరాజ్యం అమెరికా ప్రశాంతంగా ఉంటేనే ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు కూల్‌గా ఉంటాయి. ఇరాన్ విషయంలోనూ అంతే. అక్కడ అంతా బాగుంటేనే, చమురు సంక్షోభం తలెత్తకుండా ఉంటుంది. కానీ ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు... ఆ రెండు దేశాల మధ్యా యుద్ధం జరిగే అవకాశాల్ని పెంచుతున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్... చివరిక్షణంలో యుద్ధం చెయ్యాలనే నిర్ణయం మార్చుకున్నానని ప్రకటించగా... యుద్ధానికి తాము సిద్ధమేనని ఇరాన్ ప్రకటించడం కలకలం రేపింది. తమ దేశ సరిహద్దులోకి ఏ దేశం వచ్చినా... తాట తీస్తామన్నారు ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి అబ్బాస్‌ మౌసవీ.

గల్ఫ్‌లో రెండు ఇరాన్ నౌకలపై అమెరికా జరిగిన దాడులు తాజా మాటల యుద్ధానికి కారణం అయ్యాయి. ఇరాన్‌ భూభాగంలోకి వచ్చిన అమెరికా నిఘా డ్రోన్‌ని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డులు కూల్చివేశారు. దీనిపై స్పందించిన ట్రంప్... ఇరాన్‌పై యుద్ధం చెయ్యాలనుకున్నాననీ, యుద్ధం జరిగితే సామాన్య ప్రజలు 150 మంది చనిపోతారని సైన్యం చెప్పడం వల్ల రద్దు చేసుకున్నానని అన్నారు.

తమపై యుద్ధం చేస్తుంటే... చూస్తూ ఊరుకోం అని హెచ్చరించింది ఇరాన్. మరి ఇప్పుడు ట్రంప్ సైలెంటవుతారా... మరో వార్నింగ్ ఇస్తారా అన్నది నెక్ట్స్ సీన్.ఇవి కూడా చదవండి :

వైఎస్ వివేకానందరెడ్డిని చంపిందెవరు?... పులివెందుల, జమ్మలమడుగు టీడీపీ నేతల్లో టెన్షన్...

2022లో జమిలి ఎన్నికలు... ఏపీలో మళ్లీ మంత్రివర్గ విస్తరణ లేనట్లేనా?

డేంజర్ బెల్స్... ఏడాదికి 70 వేల ప్లాస్టిక్ కణాల్ని తినేస్తున్న అమెరికన్లు...
Published by: Krishna Kumar N
First published: June 23, 2019, 6:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading