news18-telugu
Updated: January 6, 2020, 5:33 PM IST
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు
అమెరికా అధ్యక్షుడి తల నరికి తెచ్చిస్తే భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది ఇరాన్. ఇరాన్ సైనిక జనరల్, ఖడ్స్ ఫోర్సు అధినేత ఖాసీం సులేమాన్పై దాడి చేసి, హతమార్చినందుకు అమెరికాపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఖాసీం అంత్యక్రియల సందర్భంగా అమెరికా వ్యతిరేక నినాదాలతో ఇరాన్ మొత్తం దద్దరిల్లింది. ఈ సందర్భంగా ఇరాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తలపై ఏకంగా 80 మిలియన్ డాలర్ల (దాదాపు 575 కోట్ల రూపాయలు) రివార్డు ప్రకటించింది. దేశంలో 80 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారని, వారందరి నుంచి ఒక్కో డాలర్ వసూలు చేసి, తల తెచ్చి ఇచ్చిన వారికి అందజేస్తామని వివరించింది.
ఈ నెల 3న ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఇరానియన్ జనరల్ ఖాసీం, ఆయన సలహాదారుణ్ని అమెరికా భద్రతా బలగాలు రాకెట్ దాడి చేసి చంపేసిన తర్వాత యుద్ధ వాతావరణాన్ని తలపించే పరిణామాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
January 6, 2020, 5:33 PM IST