ఆంజెలీనా జోలీ రూపం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న యువతి...చివరకు కటకటాలపాలు..

(Image: Instagram/@sahartabar_officialx)

ప్రముఖ హాలివుడ్ తార ఆంజెలీనా జోలీలా తయారవ్వాలని కలలు కని, ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించింది. చివరికి ఆంజెలీనా జోలీ కాకుండా, హాలివుడ్ సినిమాల్లో గ్రహాంతర వాసి గెటప్ వచ్చింది.

  • Share this:
    ఆంజెలీనా జోలీలా తయారవ్వాలని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. కానీ ప్రయోగం వికటించింది. ఫలితంగా ఆమె జైలు పాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే ఇరాన్ కు చెందిన సహార్ తాబర్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లకు పరిచయమే. అయితే ఆమె ఎప్పటి నుంచో ప్రముఖ హాలివుడ్ తార ఆంజెలీనా జోలీలా తయారవ్వాలని కలలు కని, ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించింది. చివరికి ఆంజెలీనా జోలీ కాకుండా, హాలివుడ్ సినిమాల్లో గ్రహాంతర వాసి గెటప్ వచ్చింది. అయితే తన భయంకరమైన గెటప్ తోనే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం సాహర్ ఫోటోలు పోస్ట్ చేయడం ప్రారంభించింది. అయితే ఈ చర్యను చాలా సీరియస్ గా తీసుకున్న ఇరాన్ ప్రభుత్వం ఆమెపై మత విశ్వాసాలకు విరుద్ధంగా నడుచుకున్నందుకు అరెస్టు చేసింది. అంతేకాదు యువతను పెడమార్గం పట్టిస్తోందని, అలాగే ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఇరాన్ పోలీసులు పేర్కొంటున్నారు.

    ఇదిలా ఉంటే సహార్ తాబర్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన ఫోటోలను గత కొంత కాలంగా షేర్ చేస్తోంది. ఆమెకు దాదాపు 26800 మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆయితే ప్లాస్టిక్ సర్జరీ మోజే ఆమెను ఇలాంటి పరిస్థితి వచ్చేందుకు కారణమైందని ఆమె సన్నిహితులు వాపోతున్నారు.
    Published by:Krishna Adithya
    First published: