Home /News /international /

IRAN GOVERNMENT LAUNCHES ISLAMIC DATING APP TO PROMOTE MARRIAGE SU GH

Marriage App: బాబ్బాబు పెళ్ళి చేసుకోండి.. ప్లీజ్‌!.. కుర్రాళ్లను బతిమిలాడుతున్న ప్రభుత్వం.. ఎందుకోసమంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్యాచ్‌లర్స్ త‌మ జీవిత భాగ‌స్వామిని క‌నుగొన‌డానికి ప‌టిష్ట‌మైన వివాహ‌బంధానికి ఈ యాప్ స‌హాయ‌ప‌డుతుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

మ‌ధ్య ప్రాచ్య దేశ‌మైన ఇరాన్‌లో విడాకుల కేసులు పెరిగిపోతుండ‌టంపై అక్కడి ప్ర‌భుత్వం తీవ్రంగా క‌ల‌త చెందుతోంది. దీంతో వివాహ‌బంధాల‌ను ప‌టిష్టం చేయ‌డానికి, బ్యాచిల‌ర్స్ జీవితాల్లో క‌ల్యాణ‌ గంట‌లు మోగ‌డానికి ఆదేశ సాంస్కృతిక శాఖ ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. దీనికి హ‌మ్‌దామ్ (స‌హ‌చ‌రుడు) అనే పేరు పెట్టారు. త‌మ జీవిత భాగ‌స్వామిని క‌నుగొన‌డానికి ప‌టిష్ట‌మైన వివాహ‌బంధానికి ఈ యాప్ స‌హాయ‌ప‌డుతుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

ఇరాన్‌లో ఇటీవ‌ల విడాకుల కేసులు ఎక్కువైపోతున్నాయి. వివాహ‌బంధాలు స‌న్న‌గిల్లిపోతున్నాయి. సామాజిక సంబంధాల‌లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై ప‌ర్షియా ప్ర‌భుత్వం తీవ్రంగా క‌ల‌త చెందింది. ఇప్ప‌టికే దేశ జ‌నాభాను పెంచాల్సిందిగా పిలుపునిచ్చిన ప్ర‌భుత్వానికి ఈ విడాకుల వ్య‌వ‌హారాలు త‌ల‌నొప్పిగా మారాయి. ఒక్క 2019లోనే ఆ దేశంలో 1,70,000 మంది కంటే ఎక్కువ మంది విడాకులు తీసుకున్నారంటే అక్క‌డి సంసారాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. 2019లోనే ఈ దేశంలో 5,20,000 మంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు.

మ‌రో వైపు దేశంలో 18 నుంచి 35 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సున్న ఏకాకులు 13 మిలియ‌న్ల మంది ఉన్నార‌ని అంచ‌నా. వీరంద‌రూ త‌మ జీవిత భాగ‌స్వామిని క‌నుగొని ఒక ఇంటివార‌వ‌డానికి ఇరాన్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన యాప్ సాయ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. ఈ యాప్‌లో త‌మ స‌హ‌చ‌రి లేదా స‌హ‌చ‌రుడిని క‌నుగొన‌డం, వారితో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డానికి అనువైన విధానాల‌ను రూపొందించారు.

దేశంలో ఒంటరి యువ‌త ఎక్కువైంది. విడాకుల రేటు పెరిగిపోతోంది. అదే స‌మ‌యంలో వివాహాల సంఖ్య కూడా త‌గ్గుతుండ‌టం ఇరాన్ ఎదుర్కొంటున్న అతి పెద్ద స‌మ‌స్య‌ల్లో ఒక‌టి అని ఈ యాప్‌ను రూపొందించిన టెబయన్ కల్చరల్ ఇనిస్టిట్యూట్ హెడ్ కోమెల్ ఖోజాస్తే అన్నారు. నిజానికి క‌ల్చ‌ర‌ల్ ఇనిస్టిట్యూట్ వెబ్‌సైట్‌లో యాప్‌లోని అంశాలే ఇందులో ఉన్న‌ప్ప‌టికీ.. మ‌రింత మందికి చేరువ చేయ‌డానికి వీలుగా కొత్త యాప్‌ను రూపొందించినట్టు ఖొజాస్తే చెప్పారు. ఆధునిక శాస్త్రీయ పద్ధతులద్వారా ఈ యాప్ యువతకు సహాయం చేస్తుందని పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాగర్ ఖలీబాఫ్ చెప్పారు.

పాశ్చ‌త్య ప్ర‌భావ‌మేనా?
ఇరాన్‌లో జ‌నాభా త‌గ్గిపోతుండ‌టానికి పాశ్చ‌త్య దేశాల ప్ర‌భావ‌మే కార‌ణ‌మ‌నే భావ‌న ఉంది. 2019లో ఇరాన్‌లో 1.2 మిలియ‌న్ల జ‌న‌నాలు న‌మోదు అయ్యాయి. 2016లో ఈ సంఖ్య 1.52 మిలియ‌న్లుగా ఉంది. అలాగే 2017 స‌గ‌టున ఒక్కో మాతృమూర్తి 2.07 మంది పిల్లల‌కు జ‌న్మ‌నివ్వ‌గా, 2019లో ఆ సంఖ్య 1.8కి ప‌డిపోయింది. దీనిపై ఇరాన్ ప్ర‌భుత్వం తీవ్రంగా ఆందోళ‌న చెందుతోంది. అందుకే వివాహాలు ప్రోత్స‌హించి జ‌నాభా సంఖ్య‌ను పెంచ‌డానికి, వ‌యోవృద్ధుల సంఖ్య‌ను త‌గ్గించ‌డానికి ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మ‌రి ఈ యాప్‌ను ఇరాన్ యువ‌త ఆద‌రిస్తుందో లేక సోలో బతుకే సో బెటర్‌ అంటుందో కాల‌మే చెప్పాలి.
Published by:Sumanth Kanukula
First published:

Tags: International news, Iran

తదుపరి వార్తలు