Home /News /international /

IRAN BANS WOMEN FROM APPEARING IN ADS AFTER OUTRAGE OVER SEXY MAGNUM COMMERCIAL GH SK

Ice Cream Ads: యాడ్స్‌లో మహిళలు నటించడంపై నిషేధం.. ఐస్‌క్రీమ్ యాడ్‌పై అక్కడ తీవ్ర దుమారం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇరాన్ (Iran)లో మహిళలు (Women) బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ (Hijab) ధరించడం తప్పనిసరి. ఇటీవల విడుదలైన రెండు ఐస్‌క్రీమ్ కమర్షియల్ యాడ్స్‌ (Ice Cream Ads)లో మహిళలు హిజాబ్ పద్ధతులను సరిగా పాటించలేదు. అలానే ఈ ప్రకటనల్లో మహిళలను చాలా అభ్యంతరకర రీతిలో చూపించారట. దాంతో ఈ యాడ్స్ ఇరాన్‌లో పెద్ద దుమారం రేగుతోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
Ice Cream Ads:  ఇరాన్ (Iran)లో మహిళలు (Women) బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ (Hijab) ధరించడం తప్పనిసరి. ఈ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవు. అయితే దేశంలో ఇటీవల విడుదలైన రెండు ఐస్‌క్రీమ్ కమర్షియల్ యాడ్స్‌ (Ice Cream Ads)లో మహిళలు హిజాబ్ పద్ధతులను సరిగా పాటించలేదు. అలానే ఈ ప్రకటనల్లో మహిళలను చాలా అభ్యంతరకర రీతిలో చూపించారట. దాంతో ఈ యాడ్స్ ఇరాన్‌లో పెద్ద వివాదానికి దారితీశాయి. ఈ వాణిజ్య ప్రకటనలు మహిళలను అసభ్యంగా చూపించాయని, వీటిలో హిజాబ్ నిబంధనలను మహిళలు ఉల్లంఘించారంటూ ఇరాన్ మతాధికారులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రకటనలు సెక్సీగా కూడా ఉన్నాయంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ యాడ్స్‌ను మహిళలతో రూపొందించడమే ఇరాన్ మహిళా మోడల్స్‌ కొంపముంచింది. ఈ ఐస్‌క్రీమ్ యాడ్స్‌ దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం రేపడంతో దేశ సాంస్కృతిక శాఖ ఇకపై కమర్షియల్ యాడ్స్‌లో మహిళలు నటించడానికి వీల్లేదని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో యాడ్స్‌లో నటించే మహిళలకు షాక్ తగిలినట్లయింది.

మహిళలు యాడ్స్‌లో కనిపించకుండా నిషేధం
అన్ని రకాల ప్రకటనలు, వాణిజ్య ప్రకటనలలో మహిళలు నటించడాన్ని బ్యాన్ చేశామంటూ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఇస్లామిక్ అధికారులు ప్రకటనల ఏజెన్సీలకు ఒక లేఖలో తెలియజేశారు. కమర్షియల్ యాడ్స్ కాంట్రవర్షియల్ గా మారిన కొంత సమయం తర్వాతనే ఈ బ్యాన్ విధించారు. ఒక ప్రకటనలో వదులుగా ఉన్న హిజాబ్‌ ధరించిన మహిళ మాగ్నమ్ ఐస్‌క్రీమ్‌ను రొమాంటిక్‌గా కొరకడం మహిళల గౌరవ మర్యాదలను మంటగలిపేలా ఉందని ఇరాన్ ఇస్లామిక్ నాయకులు కోపాన్ని వ్యక్తం చేశారు. ఇంకొక ప్రకటనలో మహిళను ఐస్‌క్రీమ్‌తో పోల్చారు. అయితే ఇది కూడా మహిళలను అవమానించడమేనని మత పెద్దలు ఆగ్రహించారు. అలాగే ఈ యాడ్స్ రూపొందించిన స్థానిక ఐస్‌క్రీమ్‌ తయారీదారు డొమినో (Domino)పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇటీవల హిజాబ్‌కు వ్యతిరేకంగా ప్రచారాలు
ఈ ప్రకటనలు దేశవ్యాప్తంగా పెను దుమారమే రేపడంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని హిజాబ్, పవిత్రత చట్టాల (Hijab And Chastity Laws)ను బలోపేతం చేసే ప్రయత్నాలలో భాగంగా ఇరాన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ.. ఇకపై మహిళలు ప్రకటనలలో కనిపించడానికి వీల్లేదని వారిపై బ్యాన్ విధించింది. మత పెద్దలు ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న అక్కడి అధికారులు ఈ ప్రకటనలు ఇరానియన్ ప్రజల మర్యాదకు విరుద్ధంగా ఉన్నాయని, మహిళల విలువలను అవమానించేలా కూడా ఉన్నాయని తేల్చారు. ఆపై సుప్రీం కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రెవల్యూషన్ తీర్పులకు అనుగుణంగానే నిషేధాన్ని విధిస్తునట్లు స్పష్టం చేశారు.


మరోవైపు 1979 ఇస్లామిక్ విప్లవం నుంచి ఇరాన్‌లో బహిరంగ ప్రాంతాల్లో మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి చేశారు. కానీ ఇటీవల కాలంలో ఈ హిజాబ్ అమలుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారాలు పెరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ డ్రెస్ కోడ్‌ను నిరసిస్తూ ఇరాన్‌లో మహిళలు తమ హిజాబ్‌లను తొలగించి బహిరంగ ప్రదేశాల్లో తిరిగారు. వీరిలో కొందరిని అరెస్టు చేసి శిక్షలు విధించినట్లు తెలిసింది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: International, International news, Iran

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు