మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంపై బ్యాన్...?

హూ వాంట్స్ టుబి మిలియనీర్ కార్యక్రమం జూదాన్ని ప్రేరేపించేలా ఉందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. అంతే కాదు క్యాష్ ప్రైజులు ఇచ్చే అన్ని టెలివిజన్ కార్యక్రమాలను ఇకపై బ్యాన్ చేస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది.

news18-telugu
Updated: April 28, 2019, 7:26 PM IST
మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంపై బ్యాన్...?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు పొందిన "హూ వాంట్స్ టు బి ఏ మిలియినీర్" కార్యక్రమాన్ని ఇరాన్ ప్రభుత్వం నిషేధించింది. ఇరాన్ టెలివిజన్ లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని బ్యాన్ చేస్తే ఫత్వా జారీ చేశారు. అంతే కాదు ఇస్లామ్ ఆచారాల ప్రకారం జూదం ఆడటం నేరమని, అయితే హూ వాంట్స్ టుబి మిలియనీర్ కార్యక్రమం జూదాన్ని ప్రేరేపించేలా ఉందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. అంతే కాదు క్యాష్ ప్రైజులు ఇచ్చే అన్ని టెలివిజన్ కార్యక్రమాలను ఇకపై బ్యాన్ చేస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. అలాగే అయాచితంగా డబ్బు రావడం ఇస్లామ్ పరంగా నేరమని అయతోల్లా నాజర్ అనే మత పెద్ద సూచనల మేరకే ఈ ఫత్వా జారీ చేశారు. అయితే ఈ ఫత్వా జారీ ఇరాన్ టెలివిజన్ రంగానికి పెద్ద కుదుపుగా భావిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన ఒక గేమ్ షోను మతం ఆధారంగా బ్యాన్ చేయడంతో అక్కడి టెలివిజన్ రంగం నిరాశలో కూరుకుపోయింది.

First published: April 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు