ఇరాన్ క్షిపణి దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రియాక్షన్

Iran attacks US is Iraq: అమెరికాపై ఇరాన్ ప్రతీకారదాడులకు దిగింది. ఇరాక్‌లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై డజనుకు పైగా క్షిపణులతో ఇరాక్ విరుచుకపడింది.


Updated: January 8, 2020, 8:57 AM IST
ఇరాన్ క్షిపణి దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రియాక్షన్
డోనాల్డ్ ట్రంప్
  • Share this:
ఇరాక్‌లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బలగాలు క్షిపణిదాడులు చేయడంపై అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాక్ దాడులు జరిపినట్లు ధృవీకరించారు. అయితే ప్రాణనష్టంపై ట్రంప్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్ క్షిపణుల దాడిలో జరిగిన నష్టాన్ని అంచనావేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడైనా తమకు అత్యంత శక్తివంతమైన సైన్యం ఉందంటూ ఇరాన్‌కు మరోసారి హెచ్చరికలు చేశారు. దీనిపై రేపు ఉదయం ప్రకటన చేస్తానంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.


ఇరాక్‌లోని ఆల్ అసద్, ఇర్బిల్ ఎయిర్‌బేస్‌‌లోని అమెరికా సైనిక స్థావరాలపై డజనుకు పైగా క్షిపణులతో ఇరాన్ ప్రతీకార దాడులు జరిపింది. ఈ క్షిపణి దాడుల్లో జరిగిన నష్టంపై అమెరికా ఇంకా స్పష్టతకు రాలేదని తెలుస్తోంది. తాజా పరిస్థితులను ట్రంప్ స్వయంగా సమీక్షిస్తున్నారని, సరైన సమయంలో సమాధానమిస్తామని అమెరికా రక్షణ శాఖ తెలిపింది.

First published: January 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు