మాజోలికి వస్తే...అమెరికాను ఉగ్రవాద దేశంగా ప్రకటిస్తాం...ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

తమ జాతీయసైన్యాన్ని తీవ్రవాద గ్రూపుగా పరిగణిస్తే మాత్రం అమెరికన్ ఆర్మీని కూడా ఐసిస్ తీవ్రవాద గ్రూపుతో సమానంగా చూడాల్సి ఉంటుందని, ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కమాండర్ చీఫ్ మహ్మద్ అలీ జాఫ్రీ వార్నింగ్ ఇచ్చారు.

news18-telugu
Updated: April 6, 2019, 3:11 PM IST
మాజోలికి వస్తే...అమెరికాను ఉగ్రవాద దేశంగా ప్రకటిస్తాం...ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
తమ జాతీయసైన్యాన్ని తీవ్రవాద గ్రూపుగా పరిగణిస్తే మాత్రం అమెరికన్ ఆర్మీని కూడా ఐసిస్ తీవ్రవాద గ్రూపుతో సమానంగా చూడాల్సి ఉంటుందని, ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కమాండర్ చీఫ్ మహ్మద్ అలీ జాఫ్రీ వార్నింగ్ ఇచ్చారు.
  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదుల పీచమణిచే సైన్యం ఏదైనా ఉందంటే అది యూఎస్ ఆర్మీయే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాలిబాన్లు, ఐసిస్ ఉగ్రవాదులు, జిహాదీలు ఇలా ప్రపంచంలోని ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టడంలో యూఎస్ ఆర్మీ పలు దేశాలలో పైచేయి సాధించింది. అలాంటి యూఎస్ ఆర్మీని ఉగ్రవాద ముఠాగా గుర్తిస్తామని ఒక దేశం చాలెంజ్ చేసింది. అంతేకాదు అమెరికా రాజధాని వాషింగ్టన్ ను ఉగ్రవాద కేంద్రంగా ప్రకటిస్తామని కూడా తెలిపింది. అమెరికాపై ఇంతలా సీరియస్ అయ్యింది మరెవరో కాదు...ఆయిల్ నిక్షేపాలతో తులతూగే ఇరాన్ కావడం విశేషం. ఇఫ్పటికే పలు అంశాల్లో ఉప్పు నిప్పులా సవాళ్లు విసురుకుంటున్న అమెరికా- ఇరాన్ దేశాలు ప్రస్తుతం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

ఇటీవల పెంటగాన్ వర్గాలు ఇరాన్ జాతీయ సైన్యాన్ని తీవ్రవాద గ్రూపుగా పరిగణిస్తామని ప్రకటన చేసింది. దీంతో ఇరాన్ సీరియస్ గా స్పందించింది. అమెరికా చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఒకవేళ తమ జాతీయసైన్యాన్ని తీవ్రవాద గ్రూపుగా పరిగణిస్తే మాత్రం అమెరికన్ ఆర్మీని కూడా ఐసిస్ తీవ్రవాద గ్రూపుతో సమానంగా చూడాల్సి ఉంటుందని, ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కమాండర్ చీఫ్ మహ్మద్ అలీ జాఫ్రీ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఇరాన్ లో పలు బాలిస్టిక్ మిసైల్స్, అణ్వస్త్ర పరీక్షలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.
Published by: Krishna Adithya
First published: April 6, 2019, 3:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading