Home /News /international /

IPHONE DOES RAJINIKANTH STOPS BULLET HAPPENDS IN UKRAINE UMG GH

iPhone: నిజంగా అద్భుతమే..! రజినీకాంత్‌లా బుల్లెట్‌ను ఆపేసిన ఐఫోన్.. ఉక్రెయిన్‌లో సైనికుడి ప్రాణాలు కాపాడిన యాపిల్ ఫోన్..!

సైనికుడి ప్రాణాలు కాపాడిన ఐఫోన్

సైనికుడి ప్రాణాలు కాపాడిన ఐఫోన్

రష్యా, ఉక్రెయన్ యుద్ధం నేపథ్యంలో ప్లేట్ క్యారియర్ వెస్ట్ (Plate Carrier Vest) అనే కొత్త బుల్లెట్ ప్రూఫ్‌ను మెయిన్ బుల్లెట్ ప్రూఫ్‌కు అదనంగా సైనికులు ధరిస్తున్నారు. ఈ కోట్ బుల్లెట్‌ను అడ్డుకొని సైనికుల ప్రాణాలను కాపాడుతుందో లేదో తెలియదు కానీ ఒక సాధారణ ఐఫోన్ 11 ప్రో ఆ పని చేసింది.

ఇంకా చదవండి ...
ఉక్రెయిన్ (Ukraine) దేశంపై రష్యా (Russia) దాడి మొదలు పెట్టి ఇప్పటికే ఐదు నెలలు గడిచిపోతోంది. ఈ భీకర యుద్ధంలో ఇరు దేశాల సైనికులు వేల సంఖ్యలో ప్రాణాలను కోల్పోతున్నారు. రష్యన్ సైనికులు నలుదిక్కుల నుంచి ఉక్రెయిన్ సైనికులపై తూటాల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఉక్రెయిన్ సైనికుడికి ఓ బుల్లెట్ (Bullet) నేరుగా వచ్చి తగిలింది. అదృష్టం కొద్దీ అతడు ప్రాణాలతో బతికిపోయాడు. అతడి ప్రాణాలను ఒక ఐఫోన్ కాపాడింది. ఒక రిపోర్టు ప్రకారం, బుల్లెట్ తగిలినప్పుడు ఆ సైనికుడు తన ప్లేట్ క్యారియర్ లేదా మిలిటరీ బుల్లెట్ ప్రూఫ్ కోట్‌లో ఐఫోన్ 11 ప్రో (iPhone 11 Pro) మోడల్‌ను ఉంచారు. అలా దాచిన ఆ ఐఫోన్‌కే మొదటగా బుల్లెట్ తాకింది. ఆశ్చర్యకరంగా, బుల్లెట్ దానిని దాటి చొచ్చుకెళ్లలేకపోయింది. కానీ ఐఫోన్ మాత్రం పూర్తిగా ధ్వంసమైంది.

యుద్ధం నేపథ్యంలో ప్లేట్ క్యారియర్ వెస్ట్ (Plate Carrier Vest) అనే కొత్త బుల్లెట్ ప్రూఫ్‌ను మెయిన్ బుల్లెట్ ప్రూఫ్‌కు అదనంగా సైనికులు ధరిస్తున్నారు. ఈ కోట్ బుల్లెట్‌ను అడ్డుకొని సైనికుల ప్రాణాలను కాపాడుతుందో లేదో తెలియదు కానీ ఒక సాధారణ ఐఫోన్ 11 ప్రో ఆ పని చేసి అందరి చేత గ్రేట్ అనిపించుకుంటోంది. కొద్ది గంటల క్రితం... ఒక ఐఫోన్ బుల్లెట్‌ను ఆపి ఓ సైనికుడి ప్రాణాలను కాపాడినట్లు మరో సైనికుడు చెప్పే వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. ఈ వీడియోలో సైనికుడి బాడీని బుల్లెట్ టచ్ కూడా చేయలేకపోయిందని గమనించవచ్చు. మొదటగా రెడిట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయిన ఈ వీడియో ఇప్పుడు ట్విట్టర్, యూట్యూబ్‌ వంటి ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో కూడా చక్కర్లు కొట్టడం ప్రారంభించింది.



గతంలో, రష్యన్ (Russian) లగ్జరీ బ్రాండ్ కేవియర్ స్టెల్త్ ఐఫోన్ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్ ఐఫోన్లపై బుల్లెట్‌లను సమర్థవంతంగా అడ్డుకోగల ఒక ప్రొటెక్షన్ కవర్ ఉంటుంది. స్టీల్త్ వెర్షన్ 2.0 ఐఫోన్లు BR-2 క్లాస్ 2 బుల్లెట్‌ప్రూఫ్ రక్షక కవచంతో వస్తాయి. సాయుధ వాహనాలు, యుద్ధ హెలికాప్టర్లలో ప్రత్యేకత కలిగిన NPO TCIT కంపెనీ వీటిని తయారుచేసింది. వివిధ తుపాకీ గుండ్లతో ఈ కొత్త ఐఫోన్‌ల వివిధ టెస్టింగ్ దశను కంపెనీ ప్రదర్శించింది. ఈ పరీక్షను స్వయంగా ప్రయత్నించవద్దని యూజర్లను హెచ్చరించింది. ఒక వీడియోలో ఐఫోన్ బాడీకి బుల్లెట్ షాట్ తగిలాక దానిపై బుల్లెట్ ఆకారంలో లోతైన గీతను పడటం కనిపించింది. అలాగే, డిస్‌ప్లే ఫోన్ నుంచి బయటకు వచ్చింది. కానీ ఫోన్ బుల్లెట్‌ను దాటనివ్వలేదు. కేవియర్ ఈ ఐఫోన్‌లలో కేవలం 99 యూనిట్లను ఉత్పత్తి చేసింది. దీని ప్రారంభ ధర 6,370 డాలర్లు (సుమారు రూ.4,86,540) కావడం విశేషం.
Published by:Mahesh
First published:

Tags: Apple iphone, Iphone, Soldiers, Ukraine

తదుపరి వార్తలు