• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • IPHONE A BRITAIN WOMAN RECEIVES CRACKED TILE INSTEAD OF IPHONE 12 PROMAX AND SAYS COMPANY TRIED TO MAKE HER PAY FOR IT FULL DETAILS NK

iPhone: ఐఫోన్ ఆర్డర్ ఇస్తే... పగిలిన టైల్ వచ్చింది. ఆమె ఏం చేసిందో తెలుసా?

iPhone: ఐఫోన్ ఆర్డర్ ఇస్తే... పగిలిన టైల్ వచ్చింది. ఆమె ఏం చేసిందో తెలుసా?

ఐఫోన్ ఆర్డర్ ఇస్తే... పగిలిన టైల్ వచ్చింది (image credit - twitter)

iPhone: సపోజ్ మీకే గనుక అలా వస్తే... మీరు ఏం చేస్తారు. ఆమెకు ఇది పెద్ద సమస్యగా మారింది. చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యను ఆమె ఎలా పరిష్కరించుకుందో తెలుసుకొని తీరాల్సిందే.

  • Share this:
    iPhone: ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో వస్తువులకు ఆర్డర్ ఇచ్చినప్పుడు... అవి సరైనవి వస్తే పర్వాలేదు. తేడాగా వస్తేనే సమస్య. 10 డేస్ రిటర్న్ పాలసీ ఉందంటారు. రిటర్న్ ఇచ్చేద్దామంటే... అసలు ఆర్డర్ ఇచ్చిన వస్తువు బదులు మరో వస్తువు వస్తే... ఇక రిటర్న్ ఎలా ఇవ్వగలం? అందుకే ఈ రోజుల్లో చాలా మంది... అలాంటి వస్తువును డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్లిపోయాక... దాన్ని ఓపెన్ చేసేటప్పుడు మొబైల్‌తో వీడియో రికార్డ్ చేస్తున్నారు. పొరపాటున ఆ డెలివరీలో వేరే ఐటెం వస్తే... వీడియో ఆధారంగా ఉపయోగపడుతోంది. ఇక్కడ ఈ స్టోరీలో ఏం జరిగిందంటే... బ్రిటన్‌... లంకాషైర్‌రి చెందిన ఒలివియా పార్కిన్‌సన్.... ఐఫోన్ 12 ప్రోమాక్స్ (iPhone 12 ProMax) కోసం ఆర్డర్ ఇచ్చింది. ఏప్రిల్ 14న ఐటెం డెలివరీ అయ్యింది. దాన్ని ఓపెన్ చేసి షాకైంది. అందులో ఫోన్ లేదు. విరిగిన టైల్ ఉంది.

    తాను అడిగిందేంటి... వచ్చిందేంటి... అని ఆశ్చర్యపోయిన ఆమె... ఐఫోన్ బాక్సులో ఈ పగిలిన పెంకుల టైల్ ఎందుకుంది అన్న ప్రశ్నకు ఆన్సర్ కావాలనుకుంది. దీన్ని డెలివరీ చేసిన డెలివరీ కంపెనీ వర్జిన్ మీడియాను ఆమె ప్రశ్నించగా... ఆ సంస్థ... తమకెలాంటి సంబంధమూ లేదంది. మీకు టైల్ వచ్చి ఉంటే... మీరు దానికే డబ్బు చెల్లించినట్లు లెక్క అంది. దాంతో ఆమె న్యాయపోరాటానికి దిగుతానని హెచ్చరించింది. వెంటనే మాటమార్చిన వర్జిన్ మీడియా... మేం దీనిపై దర్యాప్తు చేసి ఏం జరిగిందో చెబుతాం అంది.

    ఐఫోన్ ఆర్డర్ ఇస్తే... పగిలిన టైల్ వచ్చింది (image credit - twitter)




    10 రోజులైనా వర్జిన్ మీడియా సంస్థ స్పందించలేదు. దాంతో ఆమె మరోసారి కాల్ చేసి... తనకు మొబైల్ ఎందుకు రాలేదని ప్రశ్నించింది. ఇప్పుడు మరోసారి మాట మార్చిన వర్జిన్ మీడియా సంస్థ... మీకు ఫోన్ వచ్చిందా రాలేదా అన్నది మాకు అనవసరం. మీకు చేర్చాల్సిన డెలివరీ మీకు చేర్చాం. అందులో ఏం ఉందో మాకు అనవసరం అని చెప్పేసింది. దాంతో ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు.



    ఇది కూడా చదవండి: Viral video: ఆమె నిప్పురవ్వలు తింటుంది.... వీడియో చూసి నెటిజన్లు ఏమన్నారంటే...

    దీనిపై ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో... ఇది వార్తల్లోకి ఎక్కింది. దీంతో వెనకడుగు వేసిన సంస్థ... ఆమె మోసపోయిన మాట వాస్తవమే. అది ఎలా జరిగిందో మాకూ తెలియదు. పార్సిల్‌లో ఎలాంటి మార్పులూ జరగలేదు. ఆమె చెల్లించిన డబ్బు వెనక్కి ఇచ్చేస్తాం. అని చెప్పింది. ఇలా జరుగుతన్నాయి ఆన్‌లైన్ డెలివరీ మోసాలు. అందుకే మీకు వచ్చిన పార్సిల్‌ని ఓపెన్ చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేస్తే... తర్వాత ఇలా డెలివరీ కంపెనీలు నాటకాలు ఆడినా... వీడియో ఆధారంగా మీకు ఉపయోగపడుతుంది.
    Published by:Krishna Kumar N
    First published: