న్యూయార్క్‌లో సైకో కలకలం...ఓ ఇంట్లో చొరబడి కత్తితో ఐదుగురిపై దాడి...

యూదుల పండుగ అయిన హనుక్కా వేడుకల్లో ఈ ఘటన జరిగింది. ఆ ఇంట్లోకి చొరబడిన అగంతకుడు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలవ్వగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని యూదు ప్రజా వ్యవహారాల మండలి ట్విట్టర్‌లో పేర్కొంది.

news18-telugu
Updated: December 30, 2019, 8:48 PM IST
న్యూయార్క్‌లో సైకో కలకలం...ఓ ఇంట్లో చొరబడి కత్తితో ఐదుగురిపై దాడి...
న్యూయార్క్‌లో సైకో కలకలం...ఓ ఇంట్లో చొరబడి కత్తితో ఐదుగురిపై దాడి...
  • Share this:
అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. యూదుల పండుగ అయిన హనుక్కా వేడుకల్లో ఈ ఘటన జరిగింది. ఆ ఇంట్లోకి చొరబడిన అగంతకుడు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలవ్వగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని యూదు ప్రజా వ్యవహారాల మండలి పేర్కొంది. గాయపడిన వారిలో మత బోధకుడి కుమారుడు కూడా ఉన్నట్లు తేలింది. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు న్యూయార్క్‌ పోలీసులు తెలిపారు. ఈ దాడిని పిరికిపంద చర్యగా న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో అభివర్ణించారు. ఇలాంటి వాటిని సహించబోమన్న ఆయన సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు రియువెన్‌ రివ్లిన్‌ ఈ దాడి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇలాంటి మత వ్యతిరేక దాడులను తమ దేశ ప్రజలు ఖండిస్తున్నారని, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆరు నెలల కిందట జెర్సీ నగరంలో యూదుల కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. గత ఏడాది పిటర్స్‌బర్గ్‌లో అగంతకుడు జరిపిన దాడిలో 11 మంది యూదులు మరణించారు.

First published: December 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు