హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

జీడిపప్పు ఎలా పెరుగుతుంది... నెట్‌లో వైరల్ అయిన ప్రశ్న...

జీడిపప్పు ఎలా పెరుగుతుంది... నెట్‌లో వైరల్ అయిన ప్రశ్న...

జీడిపప్పు(Source - Twitter)

జీడిపప్పు(Source - Twitter)

Cashew Tree : జీడిపప్పు చెట్టు పుట్టింది దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్‌లో. అక్కడి నుంచీ అది గోవాకి వచ్చింది. 1560లో పోర్చుగీస్ వాళ్లు... ఆ చెట్టును గోవాకి తెచ్చారు. అలా అది ఆగ్నేయ ఆసియా అంతటా విస్తరించింది. ఆ తర్వాత ఆఫ్రికాకూ వెళ్లింది.

ఇంకా చదవండి ...

Did you know how cashews grow? : జీడిపప్పులు ఎలా పెరుగుతాయో మీకు తెలుసా... ఈ రోజుల్లో ప్రపంచ దేశాలన్నీ జీడిపప్పును వాడుతున్నాయి. స్వీట్లు, హాట్లు, వంటలు అన్నింటిలోనూ జీడిపప్పు వేస్తున్నారు. జీడిపప్పు చెట్టు... ఉష్ణమండల ప్రదేశాల్లో పెరుగుతుంది. ఈ చెట్టుకు జీడి పువ్వు వచ్చాక... దాని నుంచీ జీడి యాపిల్ కాస్తుంది. అది కాస్త తియ్యగా, కాస్త వగరుగా ఉంటుంది. యాపిల్ పెద్దది అవుతున్నప్పుడే... దాని కింద జీడి పప్పు కాస్తుంది. అది కూడా పెరిగి పెద్దదవుతుంది. ఇలా జీడిపప్పు పూర్తిగా పెద్దది అయిన సమయంలో... జీడి యాపిల్ చక్కటి రంగులో... చక్కటి టేస్టుతో పెద్ద పరిమాణానికి చేరుతుంది. ఆ సమయంలో... జీడిపప్పును... జీడి యాపిల్‌తో సహా చెట్టు నుంచీ కట్ చేస్తారు. జీడి యాపిల్‌ను ఫ్రూట్ డ్రింక్ లేదా లిక్కర్ తయారీలో వాడతారు. జీడిపప్పును వేరు చేసి... అమ్ముతారు.

చిత్రమేంటంటే... అసలీ జీడిపప్పు ఎలా కాస్తుందో, ఎలా పెరుగుతుందో... ఈ రోజుల్లో చాలా మందికి తెలియదట. ఇందులో వాళ్ల తప్పేమీ లేదు. జీడిపప్పు చెట్లు ఎక్కడబడితే అక్కడ ఉండవు. ఒకవేళ ఉన్నా... జీడిపప్పు ఎప్పుడుబడితే అప్పుడు కాయదు. దానికీ ఓ సీజన్ ఉంటుంది. ఆ సమయంలో చూసిన వాళ్లకే... అది ఎలా పుడుతుందో తెలుస్తుంది. ట్విట్టర్ యూజర్... కొల్లీన్ బల్లింగర్... జీడిపప్పు, జీడి యాపిల్ ఇమేజ్ పోస్ట్ చేసి... కొన్నేళ్ల కిందట తాను ఆ విషయాన్ని తెలుసుకున్నానని చెప్పారు.

ఆశ్చర్యమేంటంటే... జీడిపప్పు చెట్లకు కాస్తుందన్న విషయమే చాలా మందికి తెలియదట. అసలు అది విత్తనం అన్న సంగతి కూడా తమకు తెలియదంటున్నారు చాలా మంది. జీడిపప్పులు... జీడి యాపిల్‌కి కాస్తాయన్న సంగతి కూడా తెలియదంటున్నారు నెటిజన్లు. జీడి యాపిల్ అనే ఫ్రూట్ ఒకటుంటుందన్న సంగతి కూడా తెలియదంటున్నారు చాలా మంది.

జనరేషన్ మారేకొద్దీ... ఇలాంటి విషయాలు తెలియట్లేదు. ఇంటర్నెట్ రావడంతో కొంతవరకూ ఏ యూట్యూబ్‌లోనో వీడియోలు చూసి కొంతవరకూ తెలుసుకుంటున్నారు. కానీ... జీడితోటకు వెళ్లి డైరెక్టుగా చూస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయి.

Published by:Krishna Kumar N
First published:

Tags: Health benifits, Health Tips, Life Style

ఉత్తమ కథలు