Internet Down: ప్రపంచవ్యాప్తంగా బంద్ అయిన ఇంటర్నెట్ సేవలు.. మీకూ ఈ సమస్య ఎదురైందా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఒక్కసారిగా ఆగిపోతే ఏమైనా ఉందా. ఇవాళ సరిగ్గా అదే జరిగింది. ప్రపంచ దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా ఇంటర్నెట్ బంద్ కావడంతో బిజినెస్, మీడియా, ప్రభుత్వ వెబ్‌సైట్లు ఏవీ ఓపెన్ కాలేదు. అనేక దేశాల్లో ఇంటర్నెట్ ఔటేజ్‌తో కుదుపు వచ్చినట్టైంది.

  • Share this:
    ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఒక్కసారిగా ఆగిపోతే ఏమైనా ఉందా. ఇవాళ సరిగ్గా అదే జరిగింది. ప్రపంచ దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా ఇంటర్నెట్ బంద్ కావడంతో బిజినెస్, మీడియా, ప్రభుత్వ వెబ్‌సైట్లు ఏవీ ఓపెన్ కాలేదు. అనేక దేశాల్లో ఇంటర్నెట్ ఔటేజ్‌తో కుదుపు వచ్చినట్టైంది. అమెజాన్, జొమాటో, మైంత్రా మరియు ఇతర వెబ్‌సైట్లు ఏవీ ఓపెన్ కాకపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందారు. జూన్ 8న కూడా ఒకసారి ఇలాగే ప్రపంచ దేశాలు ఇంటర్నెట్ ఔటేజ్ సమస్యను ఎదుర్కొన్నాయి. ఈ ఇంటర్నెట్ ఔటేజ్ కారణంగా పేమెంట్ యాప్స్ అయిన పేటీఎంతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయిన డిస్లీ ప్లస్ హాట్‌స్టార్, ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ లాంటి గేమ్ యాప్స్, బ్యాంకులకు సంబంధించిన వెబ్‌సైట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పేమెంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్న వారికి సేవలు ఒక్కసారిగా స్తంభించిపోవడంతో ఏమైందో అర్థం కాక తికమక పడ్డారు.

    జొమాటో సీఈవో దీపేందర్ గోయల్ తమ యాప్ ఇంటర్నెట్ ఔటేజ్ కారణంగా డౌన్ అయినట్లు ట్వీట్ చేశారు. ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ‘అకమై’ ఇంటర్నెట్ ఔటేజ్‌పై స్పందించింది. ఈ సమస్యపై దృష్టి పెట్టామని.. ఈ సమస్యను 30 నిమిషాల్లో పరిష్కరిస్తామని ఆ సంస్థ ట్వీట్ చేసింది. ఆ తర్వాత ఇంటర్నెట్ సేవలు మళ్లీ యధావిధిగా అందుబాటులోకి వచ్చాయి.
    Published by:Sambasiva Reddy
    First published: