INTERNATIONAL TRAVEL THE CENTER HAS ANNOUNCED THAT THOSE COMING FROM CERTAIN COUNTRIES WILL NOT BE REQUIRED TO UNDERGO RTPCR TESTS EVK
International Travel: ఆ దేశాల నుంచి వచ్చేవారికి ఊరట.. వారు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం ఎదురు చూడక్కర్లేదు!
ప్రతీకాత్మక చిత్రం
International Travel: కరోనా వైరస్ (Corona Virus)కు సంబంధించిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ (Omicran) ముప్పును దృష్టిలో ఉంచుకుని కేంద్రం అంతర్జాతీయ ప్రయాణీకుల విషయంలో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే తాజాగా ఒమిక్రాన్ ప్రభావం నుంచి దేశాల జాబితాను అట్ రిస్క్ పేరుతో కేంద్రం ప్రకటించింది. కేంద్రం తాజాగా సవరించిన అట్ రిస్క్ దేశాల జాబితా నుంచి సింగపూర్‌ని తొలగించింది.
కరోనా వైరస్ (Corona Virus)కు సంబంధించిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ (Omicran) ముప్పును దృష్టిలో ఉంచుకుని కేంద్రం అంతర్జాతీయ ప్రయాణీకుల విషయంలో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రపంచ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ విషయంలో మార్గదర్శకాలను జారీ చేసిందని, విమానాశ్రయాలు (Airports) మరియు ఓడరేవుల వద్ద గట్టి నిఘా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్టులలో కోవిడ్ పరీక్షలు, ఆ తర్వాత క్వారంటైన్ నిబంధనలు తప్పనిసరి చేశారు. ఈ మేరకు ఒమిక్రాన్ ప్రభావం నుంచి దేశాల జాబితాను అట్ రిస్క్ పేరుతో కేంద్రం ప్రకటించింది. ఇందులో తొలుత యూకే, దక్షిణాఫ్రిక, బ్రెజిల్, బొట్సవానా, చైనా, ఘనా, మారిషస్, న్యూజీల్యాండ్, జింబాబ్వే, సింగపూర్ (Singapore), ఇజ్రాయిల్, హాంగ్‌కాంగ్ దేశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సింగపూర్ నుంచి ఇండియా (India) కు వచ్చే ఎన్నారైలు, అంతర్జాతీయ ప్రయాణికులకు ఊరట లభించింది. కేంద్రం తాజాగా సవరించిన అట్ రిస్క్ దేశాల జాబితా నుంచి సింగపూర్‌ని తొలగించింది. అయితే కొత్తగా ఘనా, టాంజానియా దేశాలు ఈ జాబితాలో చేర్చింది.
ఇకపై సింగపూర్ దేశం నుంచి ఇండియా వచ్చే ప్రయాణికులు ఎయిర్‌పోర్టులలో కోవిడ్ నిర్థారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం ఎదురు చూడక్కర్లేదు. ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ (RTPCR Test)కారణంగా దాదాపు అన్ని ఎయిర్‌పోర్టులలో అట్ రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కనీసం రెండు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది.
రైల్వే ప్రయాణికులకు ఆంక్షలు..
ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. మళ్లీ నిబంధనలు కఠినంగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. మళ్లీ లాక్ డౌన్ లాంటి పరిస్థితి తలెత్తకూడదు అంటే.. కచ్చితంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రమాదం పొంచే ఉంటుంది. ఒమిక్రాన్ భయం.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా థర్డ్ వేవ్ రావడానికి ముందే దాని వ్యాప్తిని అరికట్టడం కోసం ఇప్పటి నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవడం రైల్వే అధికారులు ప్రారంభించారు. ముఖ్యంగా దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకి పెరిగిపోవడంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది.
విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులతో మనదేశంలో కూడా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం ఆదేశాల మేరకు రైల్వే శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కఠినమైన మార్గదర్శకాలను దక్షిణ మద్య రైల్వే శాఖ జారీ చేసింది. ప్రతి రైల్వే కార్మికుడికి టీకాలు వేయడంతో పాటు మాస్క్ లేని వారికి రైల్వే స్టేషన్ల, రైళ్లలో ప్రవేశం లేదంటున్నారు అధికారులు. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి రావాలని సూచిస్తున్నారు.
ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మాస్క్ లేకుండా రైల్వే స్టేషన్లోకి వస్తే 500 రూపాయలు జరిమానా విధించనున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లలో కొత్త ఆదేశాలు పాటించకుండా వెతికి పట్టుకొని మరి జరిమానా విధిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కొత్త రూల్స్ పట్ల ప్రయాణికులకు అవగాహన కోసం ప్రకటనల బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలని, కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.