అంతర్జాతీయంగా కోవిడ్ 19 ప్రభావం నెమ్మదిగా తగ్గుముఖం పడుతుండడంతో పలు దేశాలు విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను (Restrictions) సడలిస్తున్నాయి. నవంబర్ 8, 2021 నుంచి అమెరికా వెళ్లేందుకు భారతీయులకు అనుమతి ఇస్తోంది. అంతే కాకుండా న్యూజిలాండ్ (New Zealand) నుంచి ఆస్ట్రేలియా (Australia) కు నిర్బంధ రహిత ప్రయాణం సోమవారం నుంచి పునఃప్రారంభించబడుతుందని ఆస్ట్రేలియా పర్యాటక మంత్రి ఆదివారం తెలిపారు. మార్చి 2020 నుంచి మొదటిసారిగా అంతర్జాతీయ (International) సరిహద్దులను పాక్షికంగా తిరిగి తెరవడానికి దేశం సిద్ధంగా ఉంది. అయితే అమెరికా (America) ఆంక్షల తొలగింపు ఎక్కువగా భారతీయులకు లబ్ధి చేకూరనుంది. చాలా కాలంగా వీసా (Visa)ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు.
అమెరికా ఆంక్షల సడలింపుతో భారతీయులు (Indians) హర్షంగానే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా వీసా కోసం ఎదురుచూడాల్సి రావొచ్చు. ముఖ్యం గా నాన్ ఇమ్మి గ్రెంట్ వీసా కేటగిరీ వారి అపాయింట్ కోసం వేచిచూసే సమయం ఎక్కువగా ఉం డే అవకాశం ఉందని భారత్‌లోని అమెరికా రాయబార కార్యా లయం వెల్లడించింది.
అమెరికా తీసుకొన్న తాజా నిర్ణయంతో భారత్ నుంచి సుమారు 30 లక్షల మంది వీసాలతో అమెరికాకు ప్రయాణం చేయవచ్చని అమెరికా రాయబార కార్యలయం అంచనా వేస్తోంది. దీని ద్వారా వీసా మంజూరు అనుమతుల పరిశీలనుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అంతే కాకుండా డబ్ల్యూహెచ్ఓ (WHO) ఎమర్జెన్సీ లిస్టింగ్ జాబితాలో ఉన్న వ్యాక్సిన్ తీసుకొన్న వారిని మాత్రమే ఈ ప్రయాణాలకు అమెరికా అనుమతించనుంది. అంతే కాకుండా 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారికి ఈ ధ్రువపత్రం అవసరం లేదు. ఎందుకంటే అంతర్జాతీయంగా ఇంకా 18 ఏళ్ల లోపు వారికి టీకా పంపిణీపై ఎటువంటి నిర్ణయం తీసుకోనందున వారికి ఈ మినహాయింపు ఇచ్చినట్టు పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
నిరీక్షణ తప్పదా..
అంతర్జాతీయంగా కోవిడ్ నియంత్రణ ఓ దశకు చేరుకోవడం.. వ్యాక్సిన్ (Vaccine) ప్రక్రియ వేగవంత అవ్వడంతోపాటు పలు దేశాలు ద్వైపాక్షి సంబంధాలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులను అనుమతిస్తున్నాయి. భారత్ నుంచి ఎక్కువగా వెళ్లేది అమెరికాకే. ఈ నేపథ్యంలో అమెరికా రాయబార కార్యాలయంలో నాన్ ఇమిగ్రెంట్ వీసా విభాగాల వారికి వీసా మంజూరుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే సిబ్బంది భద్రత అందుబాటుకు వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కారణంగా ఆంక్షలు ఎత్తివేసినా అమెరికా వీసా కోసం నిరీక్షణ తప్పేలా లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid -19 pandemic, Covid 19 restrictions, International, United states, Visa