హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Afghanistan: తాలిబన్లకు నిరసనల సెగ.. మహిళల నుంచే తొలి నిరసనలు

Afghanistan: తాలిబన్లకు నిరసనల సెగ.. మహిళల నుంచే తొలి నిరసనలు

ఆప్ఘనిస్థాన్ లో ఆందోళనలు

ఆప్ఘనిస్థాన్ లో ఆందోళనలు

తాలిబన్లపై ఆప్ఘన్ల తిరుగుబాటు మొదలెట్టారు. ఓ వైపు ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు మహిళలు సైతం వారికి వ్యారేకంగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు.. దీంతో మరోసారి అప్ఘనిస్తాన్ అట్టుడుకుతోంది.

  ఆప్ఘన్ లో మళ్లీ నిరసనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా మహిళలు ఈ నిరసనల్లో అత్యధికంగా పాల్గొంటున్నారు. ఓ వైపు అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సన్నాహాలు చేస్తుంటే.. వారికి నిరసనల స్వాగతాలు ఎదురవుతున్నాయి. తాలిబన్లకు వ్యతిరేకంగా మహిళలు కూడా రోడ్డెక్కి గట్టిగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌ స్వాతంత్య్ర దినానికి ఒక్కరోజు ముందు ప్రభుత్వ కార్యాలయాలపై అఫ్గాన్‌ పతాకం ఎగరాలని డిమాండ్లు మిన్నంటాయి. తాలిబన్లపై ప్రజలు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. జలాలాబాద్‌లో నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్‌ జెండాకు బదులుగా తిరిగి అఫ్గాన్‌ పతాకాన్ని ఎగురవేయాలన్న డిమాండ్‌తో బుధవారం నిరసన ప్రదర్శనలకు దిగారు. అఫ్గాన్‌ జెండా పట్టుకొని వందలాది మంది నిరసనకారులు నడిచి వెళుతూ ఉంటే, వారిని చెదరగొట్టడానికి తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నిరసనని కవర్‌ చెయ్యడానికి వచ్చిన జర్నలిస్టుల్ని చితక్కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో కాల్పుల శబ్దాలు కూడా స్పష్టంగా వినిపించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారని, డజన్ల మంది గాయపడ్డారని అల్‌జజీరా ఛానెల్‌ వెల్లడించింది.

  కాబూల్‌లో మహిళల రూపంలో తొలిసారిగా తాలిబన్లకు నిరసనల సెగ తగిలింది. సమాన హక్కుల్ని డిమాండ్‌ చేస్తూ మహిళలు ప్లకార్డులు పట్టుకొని కాబూల్‌ వీధుల్లో నిరసనకి దిగారు. వీరి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పక్కనే తాలిబన్లు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నా.. వారంతా బెదిరిపోలేదు. తమ హక్కుల్ని కాపాడాలని నినాదాలు చేశారు.

  పేరుకే శాంతి మంత్రాన్ని వల్లిస్తున్న తాలిబన్లు ఆచరణలో తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారు. టఖార్‌ ప్రావిన్స్‌లో ఒక మహిళ హిజాబ్‌ లేకుండా బయటకు రావడంతో తాలిబన్లు మంగళవారం ఆమెని కాల్చి చంపినట్టుగా ఫాక్స్‌ న్యూస్‌ వెల్లడించింది. దేశం విడిచి పారిపోవాలని కాబూల్‌ విమానాశ్రయానికి వస్తున్న వారిపై పదునైన ఆయుధాలతో దాడికి దిగుతున్నారు. ఎయిర్‌పోర్టులో జనాల్ని నియంత్రించడానికి గాల్లోకి కాల్పులు జరపడం, మహిళలు, పిల్లలని చూడకుండా కర్రలతో కొట్టడం వంటివి చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Afghanistan, International news, Taliban, World news

  ఉత్తమ కథలు