Girl Friend Slaps: లైవ్ లోనే ప్రియుడి చెంప చెల్లుమనిపించిన ప్రేయసి.. కారణం తెలిస్తే షాక్..

లైవ్ లో ప్రియుడి చెంప చెల్లుమనిపించిన ప్రేయసి

Girl Friend Slaps: ఓ టిక్ టాక్ యూజర్ చేసిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఓ ప్రియుడ్ని ఇంటర్వ్యూ చేస్తూ.. అతడి ప్రేయసి గురించి ఓ ప్రశ్న అడిగాడు. అతడు అమాయకంగా సమాధానం చెప్పాడు.. అంతే అతడి చెంప చెల్లుమంది.. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎందుకు కొట్టిందో తెలుసా..?

  • Share this:
    Girl Friend Slaps: అప్పటి వరకు హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ రోడ్డుపై షికార్లు చేస్తోంది ఓ ప్రేమ జంట.. ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ లోకాన్నే మరిచిపోయింది. ఇంతలో అనుకోకుండా ఆ ప్రేమ జంట దగ్గరకు వచ్చాడు ఓ టిక్ టాక్ యూజర్. ప్రియుడి ముందు మైక్ పెట్టాడు. వరుస పెట్టి క్వశ్చన్స్ వేస్తున్నాడు.. అయితే అనుకోకుండా ప్రేయసికి సంబంధించి ఓ ప్రశ్న అడిగాడు ఆ యూజర్.. ప్రియుడు ఏ మాత్రం తడబడకుండా టక్కున సమాధానం చెప్పాడు.. అంతే పక్కనే ఉన్న ప్రేయసి షాక్ తింది.. ఆ షాక్ నుంచి వెంటనే తేరుకొని ప్రియుడి చెంప చెల్లుమనిపించింది. ఇంతకీ అతడ్ని ఎందుకు అలా కొట్టిందో తెలుసా..?

    ప్రేమకు హద్దులుండవు. ప్రేమ అనేది ఓ అద్భుతమైన భావన. ప్రేమ గురించి ఎంతో మంది ఎన్నో విషయాలను చెబుతుంటారు. ఇక సమయ పరీక్షను తట్టుకుని నిలబడిన ఎన్నో ప్రేమ కథలు సోషల్‌ మీడియాలో నెటిజన్‌ల హృదయాలను గెలుచుకుంటూనే ఉంటాయి. అయితే తాజాగా ఓ ప్రేమికుడు తన ప్రేయసికి ఇచ్చిన రేటింగ్ తో అతడి చెంప చెల్లుమనిపించింది ప్రియురాలు. లండన్‌కి చెందిన ఓ వ్యక్తిని టిక్‌టాక్‌ యూజర్‌ ఇంటర్వ్యూ చేశాడు.

    ఆ ఇంటర్వ్యూలో తనకు గాల్‌ ఫ్రెండ్‌ ఉందని చెప్పడంతో.. రేటింగ్‌ అడిగాడు టిక్ టాక్ యూజర్. అయితే దానికి ప్రియుడు ఇచ్చిన సమాధానమే ప్రియురాలుకి కోపం తెప్పించింది. అతడు ఆమెకు 10 కి 4 మాత్రమే రేటింగ్ ఇచ్చాడు. అప్పటి వరకు హ్యాపీగా తనను పొగిడిని ప్రియుడు.. ఆ లైవ్ లో మాత్రం అంత తక్కువ మార్కులు ఇవ్వడంతో షాక్ కు గురైంది. ఒక్క క్షణం అలాగే ఉండి..వెంటనే తేరుకొని అతడి వెనకాల నుంచి ముందుకు వచ్చింది ప్రియుడి చెంప చెల్లుమనిపించింది.

    [embed]https://www.youtube.com/watch?v=U9YthR5Z10I[/embed]

    ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. ఇప్పటి వరకు లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. అయితే దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ప్రేయసి ఎలా ఉన్నా.. ఆమె మనతో ఎలా ప్రవర్తిస్తున్నా కచ్చితంగా 10కి 10 రేటింగ్ ఇవ్వాలి.. లేకుంటే ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్ చేశాడు. కొందరైతే పదికి 11 మార్కులు ఇచ్చినా ఒప్పుకుంటారు.. కానీ ఒక్క రేటింగ్ పాయింట్ తగ్గించినా ఇలాంటి కష్టాలు తప్పవంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఇది ఒక ఫ్రాంక్ వీడియో అని.. కావాలనే ఈ వీడియో చేశారని చెబుతున్నారు. అయితే ఇది కావాలని చేసినా.. అనుకోకుండా జరిగినా ప్రస్తుతం వైరల్ గా మారింది.
    Published by:Nagesh Paina
    First published: