Suez Canal Traffic: సూయెజ్ కాలువలో మళ్లీ ట్రాఫిక్ జాం.. సకాలంలో స్పందించడంతో తప్పిన భారీ నష్టం

సూయజ్ కాలువలో మళ్లీ ట్రాఫిక్ జామ్

Suez Canal Traffic: సూయెజ్ కాలువలో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఇలా పలుమార్లు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో అధికారులు తలల పట్టుకుంటున్నారు. శాశ్వత పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు..

 • Share this:
  Suez Canal Traffic: సూయెజ్ కాలువ (Suez Canal) మరోసారి బ్లాక్ అయిందని చెబుతున్నారు. గతంలో ఎవర్‌గ్రీన్ నౌక అడ్డుగా నిలిచినట్లుగానే మరోసారి వాతావరణం మారిపోయిందని ఈజిప్షియన్ అధికారులు చెబుతున్నారు. సకాలంలో అక్కడి అధికారులు స్పందించడంతో భారీ నష్టం తప్పింది. అయితే గతంలో కూడా ఇంతకంటే దారుణమైన పరిస్థితి నెలకొంది. ఈజిప్టులోని సూయిజ్ కాలువలో మార్చి 23న బలమైన గాల్పుల కారణంగా అదుపు తప్పి భారీ నౌక ‘ఎవర్ గివెన్’ ఇరుక్కు పోయింది. వారం రోజుల పాటు టగ్ బోట్లతో ఆ భారీ నౌకను పక్కకు లాగేందుకు చేసిన ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. 2,24,000 టన్నుల బరువున్న ఈ భారీ నౌక మార్చి 23న దాదాపు 20వేల కంటైనర్లతో బయల్దేరింది. వాతావరణం అనుకూలించక పోవడంతో ఆదిలోనే అడ్డంకి ఎదురైంది. అదుపు తప్పి సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయింది. ఈ నౌక ఆగిపోవడం వల్ల ఇతర నౌకలు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో.. నౌకల ద్వారా జరిగే అంతర్జాతీయ వాణిజ్యం (International business) దాదాపుగా స్థంభించిపోయింది. రోజుకు రూ.70వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. వారం రోజుల తరువాత నౌక కదిలింది.

  ఇక తాజాగా సూయెజ్ కెనాల్ అథారిటీ స్టేట్మెంట్ ప్రకారం.. ‘పనామా జెండాతో ఉన్న భారీ నౌకను దాటి ప్రయాణించాల్సిన మిగిలిన వాటి దారి మళ్లించారు. మరో లైన్ గుండా పంపించి నష్టం జరగకుండా చూశారు. దక్షిణ దిశగా ప్రయాణిస్తున్న నౌకలో 43వేల టన్నుల సామాగ్రి ఉన్నట్లు చెబుతున్నారు. కెనాల్ గుండా రోజూ రెండు నౌకలు ప్రయాణిస్తుంటాయి. ఒకటి మధ్యధరా సముద్రానికి ఉత్తర దిశగా వెళితే, మరొకటి ఎర్ర సముద్రానికి దక్షిణ దిశగా ప్రయాణిస్తాయి.

  ఇదీ చదవండి: అమెరికాను మళ్లీ టెన్షన్ పెడుతున్న కొరియా.. ఇంతకీ కిమ్ మళ్లీ ఎం చేశారో తెలుసా..?

  సూయెజ్ కెనాల్ హెడ్.. అడ్మిరల్ ఒసామా రబీ మాట్లాడుతూ.. కల్గిన అసౌకర్యాన్ని ప్రొఫెషనల్ పద్ధతిలో సాల్వ్ చేశామని అన్నారు. జార్జ్ సఫ్వాత్ అనే అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. గురువారం మొత్తం 61 నౌకలు ప్రయాణించి 3.2 మిలియన్ టన్నుల సామాగ్రిని రవాణా చేశాయని అన్నారు.

  ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. స్నేహితురాలితో ఉత్సాహంగా గడిపే అవకాశం.. పెళ్లి ప్రయత్నాల్లో సక్సెస్ అందుకుంటారు.

  అయితే కెనాల్ లో ఎటువంటి ట్రాఫిక్ ఆగిపోలేదని. ఎందుకంటే మరో వాటర్ వే గుండా దానిని మళ్లించాం అని చెప్పారు. మార్గానికి అడ్డుగా తిరగబోయిన నౌకలో సమస్యను బయటపెట్టలేదు అధికారులు. ఆ నౌకను 2012 నిర్మించగా 738 అడుగుల పొడవు 104అడుగుల వెడల్పుతో ఉంటుంది. సూడాన్ పోర్టు నుంచి ఎర్ర సముద్రానికి వెళ్తుంటుందన్నారు.

  ఇదీ చదవండి: మరీ ఇంత ఫైరా? బూతులు మాట్లాడిన ఉమ.. ఇచ్చి పడేసిన శ్వేత.. నామినేషన్స్‌లో వీరే!
  Published by:Nagesh Paina
  First published: