Home /News /international /

INTERNATIONAL NEWS IN AFGHANISTAN 21 YEARS GIRL KILLED BY TALIBANS NGS

woman wearing tight clothes: బిగుతుగా దుస్తులు ధరించిందని 21 ఏళ్ల యువతి దారుణ హత్య..

బిగుతుదుస్తులు ధరించిందని యువతి హత్య

బిగుతుదుస్తులు ధరించిందని యువతి హత్య

బిగుతుగా బట్టలు ధరించిందని 21 ఏళ్ల యువతిని అతి దారుణంగా హత్య చేశారు.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ అంశం కలకలం రేపుతోంది.

  టైట్ గా బట్టలు ధరించడం ఆమె చేసిన తప్పైంది. అది కూడా అలాంటి దుస్తులు ధరించి ఒంటరిగా వెళ్లిందనే కారణంతో 21 ఏళ్ల యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఎక్కడో తెలుసా..? అఫ్గానిస్తాన్‌ భూభాగంపై తాలిబాన్‌ ఆధిపత్యం రోజు రోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. అఫ్గానిస్తాన్‌లోని బాల్ఖ్ ప్రావిన్స్‌లో బిగుతు దుస్తులు ధరించిన ఓ యువతిని తాలిబన్లు కాల్చి చంపారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. అఫ్గాన్‌ ఉత్తర బాల్ఖ్ ప్రావిన్స్‌లో ఓ యువతి బిగుతు దుస్తులు ధరించడమే కాకుండా మగ తోడులేకుండా వచ్చిందన్న కారణంతో తాలిబన్లు హత్య చేశారు. ఈ ఘటన తాలిబన్‌ నియంత్రణలో ఉన్న సమర్‌ ఖండ్‌ అనే గ్రామంలో చోటు చేసుకుంది. యువతి తన ఇంటి నుంచి మజార్-ఇ-షరీఫ్ వెళ్లడానికి వాహనం ఎక్కుతుండగా ఆమెపై దాడి జరిగింది. బాధితురాలిని నజానిన్(21) గా గుర్తించారు.

  ఆమెపై దాడి జరిగినప్పుడు బుర్ఖా ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తాలిబన్ నియంత్రణలో నివసిస్తున్న అఫ్గాన్‌ మహిళలు బిగుతు దుస్తులు ధరించి బయట పని చేయవద్దని వారు హుకుం జారీ చేశారు. ఇక అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో.. తాలిబన్లు క్రమంగా అక్కడి భూభాగాలను ఆక్రమించుకుంటున్నారు. ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని కుందుజ్ ప్రావిన్స్ రాజధానిలోని కొన్ని భాగాలను ఆదివారం తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం.

  ఇప్పటికే మూడు రాజధానులు స్వాధీనం చేసుకున్న తాలిబన్లు రెచ్చిపోతున్నారు.. రక్తపుటేరులు పారిస్తున్నారు. ఆప్ఘన్‌లోని కీలక ప్రాంతాలను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఆ వెంటనే సాధారణ పౌరులపై తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. శుక్రవారం నుంచి చేస్తున్న దాడుల్లో ఐదు ప్రావిన్సుల రాజధానులను ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు స్థానిక అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సర్‌-ఇ-పుల్‌ నగరంలోని అన్ని ప్రభుత్వ భవనాలను, అక్కడ ఉన్న అన్ని కార్యాలయాలను తమ నియంత్రణలో ఉన్నాయని తాలిబన్లు పేర్కొన్నారు.

  అధిక శాతం గ్రామీణ ప్రాంతాలను ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ఇప్పుడు పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆదివారం దేశ ఉత్తర ప్రాంతంలోని కుందుజ్‌, సర్‌-ఇ-పుల్‌, టాల్కోన్‌ నగరాలను గంటల్లోనే తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తాలిబన్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 14 మఅతదేహాలతో పాటు గాయపడిన 30 మందిని ఆసుపత్రులకు తరలించినట్లు కుందుజ్‌ ఆరోగ్య అధికారులు వెల్లడించారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Afghanistan, International news, World news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు